Champions Trophy: ఎట్టకేలకు 2025 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సమయం రానే వచ్చేసింది. రేపు అంటే (మార్చి 9) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మధ్యాహ్నం 2:30 గంటలకు (IST) మ్యాచ్ మొదలు కానుంది. ఈ మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. ఈ క్రమంలో రెండు జట్లు కూడా విజయం సాధించాలని భావిస్తున్నాయి. మరోవైపు అనేక మంది క్రీడాభిమానులు ఈ తగ్గపోరు మ్యాచ్ చూసేందుకు ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు. దీంతోపాటు మరికొంత మంది ఈరోజు కూడా బయలుదేరి వెళ్తున్నారు.
అయితే రేపు ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్న హోటళ్లకి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో రూమ్స్ రేట్లను ఏకంగా 70 నుంచి 120 శాతం పెంచేశారు. సూపర్ సండే వచ్చిన నేపథ్యంలో ఈ మ్యాచ్ కోసం వచ్చే వారి సంఖ్య మరింత పెరగనుంది. ఆ రోజును అవకాశంగా చేసుకున్న రెస్టారెంట్లు, పబ్‌లు, కేఫ్‌లు కూడా దీని కోసం సిద్ధమయ్యాయి. దీంతో 2025 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కేవలం ఆట మాత్రమే కాకుండా, ఇటు వ్యాపార పరంగా కూడా మంచి ఆదాయాన్ని ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది.
ఈ క్రమంలో రెస్టారెంట్లు తమ అతిథులను ఆకర్షించడానికి వివిధ ఆఫర్లను, సూపర్ సండే ప్రోమోషన్లను కూడా ప్రకటించాయి. 2025 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా అనేక మంది ఫ్యామిలీతో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ క్రమంలో ప్రత్యేక ప్యాకేజెస్, గ్రూప్ డిస్కౌంట్స్, లైవ్ స్క్రీనింగ్ వంటి ఆఫర్లతో ఆతిధ్యాన్ని అందించేందుకు అనేక రెస్టారెంట్లు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు పబ్‌లు, కేఫ్ లు కూడా కస్టమర్లకు టేస్టీ ఫుడ్ సహా లైవ్ మ్యాచ్ సౌకర్యాలను అందిస్తున్నాయి.
Read Also: Gold Duty Free: దుబాయ్ నుంచి గోల్డ్ కొనుగోలు చేస్తే ఎంత సేవ్ చేసుకోవచ్చు.. లిమిట్ ఎంత..
ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ కోసం మొత్తం 25,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దీంతో AED 9 మిలియన్లు (దాదాపు 7 కోట్ల రూపాయలు) వచ్చినట్లు ఆయా వర్గాలు తెలిపాయి. అంతేకాదు కొన్ని టెక్కెట్లను పలువురు ఆన్ లైన్ విధానంలో బ్లాక్ మార్కెట్లో ఉన్న ధర కంటే అత్యధికంగా వెయ్యి శాతం పెంచి సేల్ చేసినట్లు పలు నివేదికలో సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి. ఈ మ్యాచ్ ఉందని పలువురు అవకాశంగా మార్చుకుని ఎక్కువ టిక్కెట్లను ముందే తీసుకుని ఇలా బ్లాక్ మార్కెట్లో దందా చేస్తున్నారని క్రీడాభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మామలుగానే భారతదేశంలో క్రికెట్ కు ప్రజల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇక టీమిండియా ఫైనల్ మ్యాచ్ అంటే ఆ ఉత్సాహం మరింత గరిష్ట స్థాయికి చేరుకుంటుందని చెప్పవచ్చు. సండే మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను అనేక మంది ప్రత్యక్షంగా చూసేందుకు ఇష్టపడతారు. దీంతోపాటు ఈ మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందోనని ఇప్పటి నుంచి పలువురు బెట్టింగ్స్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్ మళ్లీ ప్రారంభం.. వీటిపై బంపర్ ఆఫర్స్..