Gold Rates: భారతదేశంలో బంగారానికి డిమాండ్ చాలా ఎక్కువ. ఇంకా మగువలకు అయితే బంగారం అంటే ఉంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజా బంగారం ధరలు పసిడి ప్రియులకు శుభవార్త చెప్పాయి. ఇవాళ మరోసారి గోల్డ్ రేట్స్ ధరలు దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.440 తగ్గింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 400 రూపాయలు తగ్గింది.
ఇవాళ హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.96వేల 70 పలుకుతోంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర 88 వేల 950 రూపాయలుగా ఉంది. అయితే 2024తో పోలిస్తే ఈ ఏడాది బంగారం ధరలు భారీగా పెరిగుతున్నాయి. ఈ రోజు మాత్రం కాస్త ధరలు తగ్గాయి. గతేడాది నవంబర్‌లో 24 క్యారెట్ల తులం బంగారం 75 వేలు ఉండేది. 22 క్యారెట్ల తులం బంగారం 70 వేల లోపు ఉండేది. కానీ.. ఈ 6 నెలల్లో బంగారం ధర 25 వేలు పెరిగింది. ఏప్రిల్ 22న లక్ష రూపాయలు దాటింది. ఆ తర్వాత మళ్లీ తగ్గుతూ, పెరుగుతూ లక్షకు దగ్గరలోనే ఉంటుంది.
అయితే భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గుతాయా లేక పెరుగుతాయా అనే సందేహాలు చాలా మందిలో కలుగుతున్నాయి. ముఖ్యంగా బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉందని మరికొందరు నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం అమెరికా చైనా మధ్య తగ్గుతున్న వాణిజ్య ఉద్రిక్తతలే అని చెబుతున్నారు. మరోవైపు బంగారం ధరలు కాస్త తగ్గుతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది మంచి అవకాశం అని చెబుతున్నారు. కానీ బంగారం ధరలు ఇప్పటికీ కూడా ఆల్ టైం రికార్డ్ స్థాయికి సమీపంలోనే ఉన్నాయి. కనుక బంగారం కొనుగోలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యంగా బంగారం నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడవద్దు అని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లో చాలా మంది ఫేక్ బంగారం అమ్ముతున్నారు. దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ALSO READ: Diamond Mining: తెలుగు రాష్ట్రాల్లో భారీగా వజ్రాలు.. దొరికితే కోటీశ్వరులే.. ఎక్కడో తెల్సా?
కొందరు ఫేక్ బంగారంతో తెగ మోసాలకు పాల్పడుతున్నారు. బంగారం ఆభరణాలపై స్వచ్ఛత ప్రమాణాలు పాటించకుండా మార్కెట్లో అమ్ముతున్నారు. స్వచ్ఛత ప్రమాణాలకు పాటించే హాల్ మార్క్‌ను వాడకుండా విక్రయాలు కొనసాగిస్తున్నారు. బంగారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హాల్ మార్క్ ఉన్న గోల్డ్ ను కొనుగోలు చేయండి. బంగారం కొనే ముందు దాని స్వచ్ఛతను చెక్ చేసుకోండి. ఖరీదు విషయంలో అప్రమత్తంగా ఉండండి. బంగారం కొనే ముందు విశ్వసనీయమైన దుకాణాలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ: ECIL Recruitment: సూపర్ ఛాన్స్.. మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. స్టార్టింగ్ జీతమే రూ.40,000