BigTV English

Electric Car Under Rs 5 Lakh: ఇండియాలో చీపెస్ట్ బ్యాటరీ కార్.. ధర రూ.5 లక్షల కంటే తక్కువే!

Electric Car Under Rs 5 Lakh: ఇండియాలో చీపెస్ట్ బ్యాటరీ కార్.. ధర రూ.5 లక్షల కంటే తక్కువే!

Electric Car Under Rs 5 Lakh| ఇండియాలో ఇప్పుడు ఎలెక్ట్రిక్ వాహనాల(ఈవీ) జోరు పెరుగుతోంది. పెట్రోల్ ఖర్చుని భరించలేక చాలామంది బ్యాటరీతో నడిచే వాహనాలను ఇష్టపడుతున్నారు. అయితే ఈవీల ధరలు ఎక్కువగా ఉండడంతో వాటి విక్రయాలు ఆశించిన స్థాయి కంటే తక్కవగానే ఉన్నాయి.


అయితే ఈవీలు తయారు చేసే జెఎస్‌డబ్యూ ఎంజీ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తమ బ్రాండ్ కార్ ధర రూ.5 లక్షల దిగువకు తీసుకువచ్చింది. అందులోని బ్యాటరీ కాస్ట్ తగ్గించడంతో ఇప్పుడు కంపెనీకి చెందిన ఎంజీ కామెట్ ఈవీ కారు రూ.5 లక్షల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. దీంతో దేశంలో ఇదే చీపెస్ట్ కారు.

జెఎస్‌డబ్యూ ఎంజీ మోటార్ కంపెనీ, చైనాకు చెందిన ఎస్ఏఐసీ మోటార్ కో తో సంయుక్తంగా బ్యాటరీ సర్వీస్ వెంచర్ ప్రారంభించింది. ఇందులో భాగంగా కామెట్, ZS EV కార్లు ధరలు ప్రారంభ ధర రూ.2 లక్షలు, రూ.4.99 లక్షలు గా ప్రకటించింది. అయితే ఈ ధరకు బ్యాటరీ యూసేజ్ కాస్ట్ అదనం. ఈ కార్లు కొనుగోలు చేసే కస్టమర్లు యూసేజ్ బేస్ట్ బ్యాటరీ రెంటల్ తీసుకోవాలి.


Also Read:  గంటకు 250కిమి వేగంతో దూసుకోపోయే బుల్లెట్ ట్రైన్.. ఇండియాలో ఇదే ఫస్ట్!

సవరించిన ధరలు ఇవే:

MG Comet BaaS: రూ. 4.99 లక్షలు + బ్యాటరీ అద్దె @ రూ. 2.5/కిమీ

MG ZS EV BaaS: రూ. 13.99 లక్షలు + బ్యాటరీ అద్దె @ రూ. 4.5/కిమీ

కారు బ్యాటరీ చార్జింగ్ కాస్ట్ కిలోమీటర్ కు రూ.1 ఉంటుంది. ఈ ఖర్చు కస్టమర్ భరించాలి. ఎలక్ట్రిక్ కార్లను ఇప్పటికీ స్టిక్కర్ ధర, బ్యాటరీ ఖర్చుతో కలిపి కస్టమర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదనంగా మూడు సంవత్సరాల తరువాత 60% బైబ్యాక్ విలువతో కస్టమర్లకు ఓనర్ షిష్ అసూరెన్స్ ఉంటుంది.

సెప్టెంబర్ 2024 మొదటి వారంలోనే JSW MG మోటార్ కంపెనీ విండ్సర్ ఈవీలో బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ మోడల్‌ లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.9.99 లక్షలు, కిలోమీటర్ కు బ్యాటరీ రెంటల్ రూ.3.5. దీన్ని పే యాజ్ యు గో మోడల్ అని అంటారు. ఈ మోడల్ లో బయ్యర్స్ తప్పనిసరిగా నెలకు రూ.5250 బ్యాటరీ ఖర్చుల కోసం చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రతినెలా 1500 కిలోమీటర్లు కారు ప్రయాణాన్ని సగటున అంచనా వేసిన ధర.

Also Read:  ఇండియాలో పెళ్లిళ్ల సీజన్ పీక్స్.. కేవలం రెండు నెలల్లో రూ.4.25 లక్షల కోట్ల బిజినెస్

1500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే.. అదనంగా ప్రయాణించే ప్రతి కిలోమీటర్ కు రూ.3.5 చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఎస్‌యువి కిలోమీటర్ రన్నింగ్ కాస్ట్ కిలోమీటర్ కు రూ.8 నుంచి రూ.10 అయితే.. విండ్సర్ ఈవీ రన్నింగ్ కాస్ట్ కిలోమీటర్ కు రూ.4.5 మాత్రమే.

కారు ఈఎంఐ ఆప్షన్ కోసం JSW MG మోటార్ బ్యాంకింగ్ పార్టనర్లుగా బజాబ్ ఫిన్ సర్వ్, హీరో ఫిన్ కార్ప్, విద్యుత్, ఎకోఫై ఆటోవర్ట్.. ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయి.

Related News

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

Big Stories

×