Teenmar Mallanna: తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన రాజీనామాపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్సీల అంశం ముగిశాక తన ఎమ్మెల్సీ రాజీనామా గురించి ఆలోచిస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తాను బయటకి రాలేదని.. కావాలనే కాంగ్రెస్ బయటికి పంపిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి బీసీల ద్రోహి..
కాంగ్రెస్ పార్టీని తమ పార్టీలో విలీనం చేస్తామంటే ఒప్పుకుంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డిల పార్టీనే కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి బీసీల ద్రోహి అని సంచలన విమర్శలు చేశారు. పార్టీ ఆవిర్భావం తర్వాత వరంగల్ లో మొదటి కార్యవర్గ సమావేశం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ పై సీరియస్ చర్చ జరిగిందని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు.
వరంగల్‌ను నగరాన్ని రెండో రాజధానిగా ప్రకటించాలి..
వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. కార్యవర్గ సమావేశం తర్వాత టీఆర్పీ పార్టీ వరంగల్ డిక్లరేషన్ ప్రకటిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) చేయబోతున్న10 అంశాలను మీడియా ముందు పెడుతున్నాని చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ సర్ ని, తెలంగాణకు జాతిపితగా గుర్తించాలి.. లేదంటే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గుర్తిస్తామని తీన్మార్ మల్లన్న తెలిపారు.
ALSO READ: CM Revanth Reddy: కండువాలు కప్పితే పార్టీ మారినట్టా..? సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇవ్వాలి..
తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున కొండా బాపూజీ లక్ష్మణ్ కి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. బీసీలకు ప్రతి ఏటా లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని అన్నారు. భూమిలేని బీసీ కుటుంబాలకు 2 ఎకరాల చొప్పున భూ పంపిణీ చేయాలని పేర్కొన్నారు. బీసీల సంక్షేమంతో పాటు ఎవరి వాటా వారికే అనేలా… టీఆర్పీ లో అందరికీ సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. ఇళ్లు లేని అగ్రవర్ణ పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వాలని చెప్పారు. ప్రతి ఒక్కరికి కార్పొరేట్ లెవల్ లో ఉచిత విద్య, వైద్యం అందిస్తామని చెప్పారు.
ALSO READ: Pawan Kalyan: ఏపీలో నో ప్లాస్టిక్.. పవన్ కల్యాణ్ ప్రకటన, జనసైనికులను రంగంలోకి దింపాలన్న రఘురామ!