Goa Liquor seized: లిక్కర్ ముఠాలకు హైదరాబాద్ పోలీసులు చెక్ పెట్టారు. గోవా నుంచి విమానంలో హైదరాబాద్‌కు తరలిస్తున్న నాన్ డ్యూటీ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నిందుతులను అరెస్ట్ చేసిన పోలీసులు, 12 మందిపై కేసు నమోదు చేశారు. మార్కెట్‌లో దీని విలువ అక్షరాలా 12 లక్షలు రూపాయలు.
హైదరాబాద్, గోవాకి చెందిన కొంతమంది వ్యక్తులు గ్రూపుగా జత కట్టారు. లిక్కర్ బిజినెస్ చేయాలని నిర్ణయించారు. తక్కువ డబ్బులతో ఎక్కువ లాభాలు సంపాదించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో గోవాను ఎంచుకున్నారు. అక్కడ లిక్కర్ బాటిళ్ల ధర తక్కువగా ఉండడంతో వాటిని హైదరాబాద్‌లో విక్రయించాలని డిసైడ్ అయ్యారు.
ALSO READ: భద్రాచలంలో ఎన్‌కౌంటర్, ఆరుగురు మావోలు మృతి.. అగ్రనేతలున్నట్టు
ఇందులో భాగంగా తొలి విడదల 415 మద్యం బాటిళ్లు హైదరాబాద్‌కు వచ్చాయి. గోవా నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాయి. దీనిపై పోలీసులకు సమాచారం రావడంతో అలర్ట్ అయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు 415 లిక్కర్ బాటిళ్లను సీజ్ చేశారు.
లిక్కర్ బాటిళ్లను దాదాపు 12 మంది తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మార్కెట్‌లో వీటి విలువ అక్షరాలా 12 లక్షలు రూపాయలు. సరుకు మొత్తానికి సీజ్ చేశారు పోలీసులు. నాలుగైదు టీములు స్కెచ్ వేసి వీరిని పక్కగా పట్టుకున్నాయి. కాకపోతే కీలక నిందితులు అందులో లేనట్టు తెలుస్తోంది.
పట్టుబడిన సరుకు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌గా గుర్తించారు పోలీసులు. ఆ తరహా లిక్కర్ వల్ల ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లుతుందని ఓ అంచనా. 12 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు, లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక ఉన్నది ఎవరన్న దానిపై ఆరా తీయడం మొదలుపెట్టారు. వారి నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. లిక్కర్ ముఠా గురించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
హైదరాబాద్‌లో గోవా లిక్కర్.. సీజ్ చేసిన పోలీసులు.
గోవా నుంచి విమానంలో హైదరాబాద్‌కు నాన్ డ్యూటీ మద్యం తరలింపు.
రూ.12 లక్షలు విలువ చేసే 415 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు.
నిందితుల అరెస్టు.. 12 మందిపై కేసు నమోదు.#GoaLiquor #Hyderabad #NewsUpdates #Bigtv pic.twitter.com/AVbAELIyu6
— BIG TV Breaking News (@bigtvtelugu) September 5, 2024