BigTV English

Sweeper Jobs: ఏంటండీ ఈ విడ్డూరం.. రోడ్లూడ్చే పనికి 46 వేల మంది గ్రాడ్యుయేట్ల పోటీ

Sweeper Jobs: ఏంటండీ ఈ విడ్డూరం.. రోడ్లూడ్చే పనికి 46 వేల మంది గ్రాడ్యుయేట్ల పోటీ

Sweeper Jobs: దేశంలో నిరుద్యోగ తీవ్రతా విపరీతంగా పెరుగుతోంది. పెరుగుతున్న జనాభాతో పాటు యువత సంఖ్య రోజురోజుకు దారుణంగా పెరుగుతుందని ఇప్పటికే చాలా అధ్యయనాల్లో తేలింది. ప్రతీ ఏడాది లక్షలాది మంది యువత తమ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. ఈ తరుణంలో డిగ్రీలు ఉన్నా కూడా ఉద్యోగాలు దొరక్క నానా తంటాలు పడుతున్నారు. సొంతంగా బిజినెస్ పెట్టుకోవడం, ఏదో కూలీ పనులు చేయడం, చిన్నచిన్న పనులు చేస్తూ ఇంటిని గడుపుతుండడం వంటి పనులు చేస్తున్నారు.


పెరుగుతున్న నిరుద్యోగుల సంఖ్యకు తగ్గట్టు ఉద్యోగాలు ఉండడం లేదు. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంటుంది. అయితే తాజాగా ఓ ఉద్యోగ నోటిషికేషన్ కు నిరుద్యోగులు చేసిన దరఖాస్తుకు సంబంధించిన వార్త ఒకటి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తాజాగా రోడ్లు ఊడ్చే పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగానికి ఏకంగా వేల సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఘటన హర్యానాలో వెలుగుచూసింది. రోడ్లు ఊడ్చేందుకు అక్కడి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా ఏకంగా డిగ్రీలు, పీజీలు చదివిన వారే దరఖాస్తు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఈ ఉద్యోగ దరఖాస్తుకు సంబంధించిన వివరాలను హర్యానా కౌశల్ రోజ్ గార్ నిగమ్ డాటా వెల్లడించింది. స్వీపర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ ఈ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ తరుణంలో ఆగస్టు 6వ తేదీ నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ తరుణంలో హర్యానా వ్యాప్తంగా 46,102 మంది గ్రాడ్యుయేట్లు ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మొత్తంగా 39,990 మంది డిగ్రీ అభ్యర్థులు, 6,112 మంది పీజీ పూర్తి చేసిన వారు ఉండడం విశేషం.


కేవలం వీరు మాత్రమే కాకుండా ఈ ఉద్యోగానికి ఏకంగా 1,17,144 మంది ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా మూడు లక్షల తొంభై ఐదు వేల మంది ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ ఉద్యోగానికి కేవలం రూ. 15వేల జీతం మాత్రమే వస్తుంది. పీజీలు పూర్తి చేసి ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాగా, ఇవి శాశ్వత ఉద్యోగాలు కూడా కావు. కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగాలు మాత్రమే. అయితే ఈ ఉద్యోగాలకే లక్షల్లో పోటీ పడుతున్న నిరుద్యోగ యువతను చూసి దేశమే ఆశ్చర్యపోతుంది.

Related News

Most Dogs Country: ఎక్కువ కుక్కలు ఏ దేశంలో ఉన్నాయి? టాప్ 10 లిస్టులో ఇండియా ఉందా?

Comedy video: లిఫ్ట్ బయట ఈ పిల్లోడు చేసిన పని చూస్తే.. నవ్వు ఆపకోలేరు భయ్యా..!

Viral Video: గుడ్డుపై 150మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు.. ఈ వండర్ ఫోటోను ఇప్పుడే చూసేయండి బ్రో!

ఇది రియల్లీ మైండ్ బ్లోయింగ్ వీడియా.. తాళాన్ని క్షణాల్లో ఓపెన్ చేశాడు.. ఇక దొంగలకు తెలిస్తే..?

Drunken Trump: ఫుల్‌గా మందుకొట్టి.. పుతిన్ ముందుకు.. ట్రంప్ మామ దొరికిపోయాడు, ఎలా తడబడ్డాడో చూడండి

Mumbai Hotel: ముంబై హోటల్‌లో కప్పు టీ అక్షరాల రూ.1000.. ఈ ఎన్ఆర్ఐ రియాక్షన్ చూడండి, వీడియో వైరల్

Big Stories

×