BigTV English

Fastag New Rules : ఫాస్టాగ్ కొత్త నిబంధనలు ఇవే.. తెలుసుకోండి లేకపోతే భారీ జరిమానా!

Fastag New Rules : ఫాస్టాగ్ కొత్త నిబంధనలు ఇవే.. తెలుసుకోండి లేకపోతే భారీ జరిమానా!

Fastag New Rules | టోల్ గేట్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో ‘నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా’ (NHAI) ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) FASTag బ్యాలెన్స్ ధ్రువీకరణకు సంబంధించి కొన్ని ముఖ్యమైన మార్పులతో కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్పులు ఫిబ్రవరి 17 నుంచి అమల్లోకి వస్తాయి.


ఈ కొత్త మార్పులు టోల్ లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి మాత్రమే కాకుండా, మోసపూరిత కార్యకలాపాలను తగ్గించడానికి రూపొందించబడ్డాయి. కొత్త నియమాలను పాటించడం వల్ల వాహన వినియోగదారులు జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు మరియు టోల్‌ల ద్వారా సజావుగా ముందుకు సాగిపోవచ్చు.

ఫాస్ట్‌ట్యాగ్ నిబంధనలలో ఇవే మార్పులు:
60 నిమిషాల విండో: టోల్ ప్లాజాకు చేరుకోవడానికి ముందు ఫాస్ట్‌ట్యాగ్ 60 నిమిషాల కంటే ఎక్కువ కాలం బ్లాక్‌లిస్ట్‌లో ఉంటే, అది తెలుసుకున్న తరువాత 10 నిమిషాల పాటు బ్లాక్‌లిస్ట్‌లోనే కొనసాగితే, లావాదేవీలు రిజెక్ట్ అవుతాయి.


డబుల్ ఫెనాల్టీ: టోల్ ప్లాజాకు చేరుకున్నప్పుడు ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్ట్‌లో ఉండి, లావాదేవీ రిజెక్ట్ అయితే, మీరు చెల్లించాల్సిన టోల్ ఛార్జ్ కంటే రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది.

గ్రేస్ పీరియడ్: డబుల్ పెనాల్టీని నివారించడానికి వినియోగదారులు ట్యాగ్ చదివిన 10 నిమిషాలలోపు వారి FASTagని రీఛార్జ్ చేసుకోవచ్చు.

Also Read: ఎన్ఆర్ఐలకు ఆదాయపు పన్ను ఎలా వర్తిస్తుంది?.. పెట్టుబడులు, స్థిరాస్తిపై పన్ను ఉంటుందా?

ఉదాహరణ:
మీరు టోల్ ప్లాజాకు చేరుకోవడానికి ముందే మీ ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్ట్ అయితే, దానిని తెలుసుకున్న తరువాత కూడా టోల్ గుండా వెళ్తే, లావాదేవీలు రిజెక్ట్ అవుతాయి. అప్పుడు డబుల్ టోల్ ఛార్జ్ చెల్లించాలి. అలా కాకుండా, మీ ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్ట్‌లో చేరడానికి 60 నిమిషాల ముందు లేదా స్కాన్ చేసిన 10 నిమిషాలలోపు (మొత్తం 70 నిమిషాల్లో) మీరు దానిని రీఛార్జ్ చేస్తే లావాదేవీలు సక్సెస్ అవుతాయి. ఎలాంటి జరిమానాలు చెల్లించాల్సిన అవసరం లేదు.

టోల్ ప్లాజాలో ఎక్కువ టోల్ ఫీజు చెల్లించకుండా తప్పించుకోవాలంటే, టోల్ ప్లాజాలను చేరుకునే ముందు మీ ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ తగినంత ఉండేలా చూసుకోవాలి. బ్లాక్‌లిస్టింగ్‌ వంటివి నివారించుకోవడానికి KYC వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి.

హైవేపై అన్‌లిమిటెడ్ టోల్ పాస్‌లు:
వాహనదారులకు ఉపశమనం కలిగించడానికి మరియు టోల్ వసూల్లలో సరళీకరణను సాధించడానికి కేంద్ర ప్రభుత్వం టోల్ పాస్‌ల జారీలో కొత్త విధానం తీసుకురానుంది. ఇందులో వార్షిక టోల్ పాస్‌లు మరియు లైఫ్ టైం టోల్ పాస్‌లు జారీ చేయడానికి సంకల్పించింది.

వార్షిక ప్లాన్: ఏడాదికి 3000 రూపాయలు.

లైఫ్ టైం టోల్ పాస్ (15 సంవత్సరాలు): రూ. 30,000 చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం 340 రూపాయలకు నెలవారీ టోల్ పాస్ అందుబాటులో ఉంది. ఈ లెక్కన తీసుకుంటే ఏడాదికి రూ. 4080 చెల్లించాలి. కానీ ఏడాదికి టోల్ పాస్ తీసుకుంటే, 1080 రూపాయలు ఆదా చేయవచ్చు.

లైఫ్ టైం పాస్‌లు, వార్షిక పాస్‌లు ప్రస్తుత FASTag వ్యవస్థలో చేర్చనున్నారు. కాబట్టి దీనికోసం ప్రత్యేకించి డాక్యుమెంటేషన్ అవసరం లేదు. ఈ టోల్ పాస్ వ్యవస్థను త్వరలోనే తీసుకురానున్నట్లు కేంద్ర రహదారి రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. వార్షిక టోల్ పాస్ లేదా జీవిత కాల టోల్ పాస్ అనేది ఒక టోల్ గేటుకు మాత్రమే వర్తిస్తుందా లేక అన్ని చోట్లా పనిచేస్తుందా అనే వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related News

Gold Rate Increase: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!

Gold: ఈ దేశాల్లో టన్నులకొద్ది బంగారం.. మన దేశం ఏ స్థానంలో ఉందంటే?

Recharge offer: విఐ బిజినెస్ నుండి మెగా మాన్సూన్ ఆఫర్.. 449 రూపాయల ప్లాన్ ఇప్పుడు 349కే

BSNL recharge offer: రూ.61కే ఓటీటీ, లైవ్ ఛానెల్.. ఇంకా ఎన్నో, BSNL బిగ్ ప్లాన్!

FD In Bank: బ్యాంకులో FD చేయాలనుకుంటున్నారా? ఈ 3 మిస్టేక్స్ అస్సలు చేయకండి!

Jio Prepaid Plans: వామ్మో .. ఏమిటి, జియో ఇన్ని రిచార్జ్ ప్లాన్స్ తొలగించిందా?

Foreclosing Loan: బ్యాంక్ లోన్ ఫోర్ క్లోజ్ చేయడం మంచిదా? కాదా? మన క్రెడిట్ స్కోర్ పై దీని ప్రభావం ఉంటుందా?

Jio Recharge Offers: జియో బంపర్ ఆఫర్.. రీచార్జ్ చేసుకుంటే వెంటనే క్యాష్‌బ్యాక్!

Big Stories

×