E-Paper
Advertisement

30 ఏళ్లు వచ్చేలోపు..ఈ 7ట్రిక్స్ పాటిస్తే, మీ ఫ్యూచర్ సెట్టైనట్టే!

30 ఏళ్లు వచ్చేలోపు..ఈ 7ట్రిక్స్ పాటిస్తే, మీ ఫ్యూచర్ సెట్టైనట్టే!
Advertisement

Financial planning before 30: యూత్ అందరిలోనూ.. కెరీర్ ప్రారంభం నుంచే సంపాదన పెరిగినప్పటికీ, డబ్బును ఎలా మేనేజ్ చేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. జీవితంలో.. సెటిల్ కావడానికి 30 ఏళ్ల వయస్సు అనేది చాలా కీలకం. ఈ గోల్డెన్ పీరియడ్‌లో.. సరైన ఆర్థిక ప్రణాళికను అనుసరిస్తే రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవించొచ్చు. 30 ఏళ్లు నిండేలోపు ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాల్సిన ఆ 7 ముఖ్యమైన ఫైనాన్షియల్ స్టెప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం:

జీవితంలో ఊహించని ఖర్చులు.. ఎప్పుడైనా రావచ్చు. ఉద్యోగం పోవడం లేదా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలంటే..మీకు కనీసం 3 నుంచి 6 నెలల ఖర్చులకు సరిపోయే మొత్తాన్ని ఎమర్జెన్సీ ఫండ్‌గా పక్కన పెట్టుకోవాలి. ఈ డబ్బును అత్యవసర సమయాల్లో మాత్రమే ఉపయోగించాలి.

2. హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం:

Advertisement

చాలామంది యువకులు ఆరోగ్యంగా ఉన్నాము కదా అని ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపరు. కానీ ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ మీ పొదుపు మొత్తాన్ని పూర్తిగా ఖాళీ చేయగలదు. కాబట్టి 20 ఏళ్ల వయస్సులోనే.. తక్కువ ప్రీమియంతో మంచి ‘హెల్త్ ఇన్సూరెన్స్’ , మీపై ఆధారపడిన కుటుంబ సభ్యుల సేఫ్టీ కోసం ‘టర్మ్ ఇన్సూరెన్స్’ తీసుకోవడం చాలా ముఖ్యం.

3. క్రెడిట్ కార్డ్, అప్పులు:

యూత్ ఆకర్షణలకు లోనై.. అనవసరమైన షాపింగ్ కోసం క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా వాడుతుంటారు. దీని వల్ల భారీ వడ్డీలు, లేట్ ఫీజులు పడి సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది. అప్పులు.. తీసుకోవడం తప్పు కాదు కానీ, వాటిని ఎప్పుడు, ఎలా తీర్చాలనే స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. వీలైనంత వరకు క్రెడిట్ కార్డ్ బిల్లులను ఎప్పటికప్పుడు పూర్తిగా చెల్లించాలి.

4. ముందస్తు పెట్టుబడుల ప్రయాణం:

Advertisement

“డబ్బును పనిలో పెట్టండి” అంటారు పెద్దలు. మీరు ఎంత త్వరగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే.. కాంపౌండింగ్ ద్వారా మీ సంపద అంత వేగంగా పెరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్ , ఎస్ఐపీ లేదా స్టాక్ మార్కెట్‌లో సిస్టమ్యాటిక్‌గా చిన్న మొత్తాలతో పెట్టుబడులు ప్రారంభించడం మంచిది.

5. 50-30-20 బడ్జెట్ రూల్ :

మీ నెల వారీ సంపాదనను సరిగ్గా నిర్వహించడానికి ఈ రూల్ అద్భుతంగా పని చేస్తుంది. మీ ఆదాయంలో 50% భాగాన్ని ఇల్లు, కిరాణా వంటి కనీస అవసరాలకు, 30% భాగాన్ని ట్రావెలింగ్, షాపింగ్ , మిగిలిన 20% భాగాన్ని ఖచ్చితంగా సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్‌లకు కేటాయించాలి.

Also Read: మీకు 4-5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా? ఎక్కువ అకౌంట్లు ఉంటే జరిగే నష్టాలు ఇవే!

6. రిటైర్మెంట్ ప్లానింగ్ :

రిటైర్మెంట్ ఇంకా చాలా దూరం కదా అని చాలా మంది దీని గురించి ఆలోచించరు. కానీ 25 లేదా 28 ఏళ్ల వయస్సులోనే చిన్న మొత్తంతో రిటైర్మెంట్ ప్లానింగ్ (NPS లేదా PPF) ప్రారంభిస్తే.. మీరు 40-45 ఏళ్లకే ఆర్థిక స్వాతంత్య్రం సాధించడానికి అవకాశం ఉంటుంది.

7. స్కిల్ అప్‌గ్రేడేషన్, సైడ్ ఇన్‌కం:

కేవలం ఒకే ఆదాయ వనరుపై.. ఆధారపడటం ప్రస్తుత కాలంలో రిస్క్ తో కూడుకున్నది. మీ ఉద్యోగంతో.. పాటు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, ఫ్రీలాన్సింగ్ లేదా పార్ట్‌టైమ్ ద్వారా అదనపు ఆదాయ మార్గాలను సృష్టించుకోవడం ద్వారా మీ ఆర్థిక భద్రతను మరింత బలపరుచుకోవచ్చు.

డబ్బును సంపాదించడం ఎంత ముఖ్యమో.. దానిని దాచిపెట్టి వృద్ధి చేయడం అంతకంటే ముఖ్యం. ఈ చిన్న చిన్న ఆర్థిక నియమాలను మీ ఇరవై ఏళ్లకే  అలవర్చుకుంటే.. 30 ఏళ్లు వచ్చేసరికి మీరు ఒక బలమైన ఆర్థిక పునాదిని ఏర్పరచుకోగలరు.

Related News

మీకు 4-5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా? ఎక్కువ అకౌంట్లు ఉంటే జరిగే నష్టాలు ఇవే!

క్రెడిట్ కార్డ్ Vs వర్సెస్ బ్యాంక్ లోన్.. అత్యవసర సమయంలో ఏది బెటర్?

మీ బంగారంపై ఉన్న హాల్‌మార్క్ అసలైనదా? లేదా ?ఇలా గుర్తించండి!

ఒక్క ఏడాదిలోనే రూ.3.2 లక్షల నుంచి రూ.40 లక్షల ప్యాకేజీకి.. ప్రభుత్వ కాలేజీ విద్యార్థి కెరీర్ సూపర్ ఫాస్ట్

గోల్డ్ లోన్ చెల్లించినా మీ బంగారాన్ని బ్యాంక్ తిరిగి ఇవ్వకపోతే ఏం చేయాలి? ఇది తెలుసుకోండి

బ్యాంకుకు వెళ్లకుండానే..ఫోన్ నంబర్ మార్చుకోవడం ఎలా? సింపుల్ ప్రాసెస్ ఇగో!

పదేళ్ల తర్వాత ఆదివారం బ్యాంకులు ఓపెన్.. నగదు విత్‌డ్రా పరిమితులు తొలగింపు, సమ్మెలో 7.5 లక్షల మంది

Big Stories

Advertisement
×