Multiple bank accounts risks: ఈ రోజుల్లో చాలా మంది దగ్గర ఒకటి కంటే.. ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉండటం సాధారణం అయిపోయింది. శాలరీ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, లోన్ అకౌంట్ అంటూ రకరకాల అకౌంట్స్ కలిగి ఉంటారు. కానీ.. మీ దగ్గర 4 నుంచి 5 బ్యాంక్ అకౌంట్స్ ఉంటే, వాటి నిర్వహణపై సరైన అవగాహన లేకపోవడం వల్ల మీరు పెద్ద ఎత్తున నష్ట పోయే అవకాశం ఉంది. మినిమమ్ బ్యాలెన్స్ జరిమానాల నుంచి సైబర్ మోసాల వరకు.. మల్టిపుల్ అకౌంట్ల వల్ల కలిగే ఆ 8 నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి బ్యాంకులోనూ సగటు నెలవారీ బ్యాలెన్స్ కచ్చితంగా పడుతుంది. అర్బన్, సెమీ అర్బన్ లేదా రూరల్ ప్రాంతాలను బట్టి ఈ మొత్తం రూ. 2,000 నుంచి రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. 4-5 అకౌంట్ప్ అన్నింటిలోనూ ఇంత మొత్తం మెయింటైన్ చేయడం కష్టం. బ్యాలెన్స్ తగ్గితే బ్యాంకులు భారీగా జరిమానాలు వసూలు చేస్తాయి.
ప్రతి బ్యాంక్ అకౌంట్‌కూ ఒక ఏటీఎం/డెబిట్ కార్డ్ ఉంటుంది. ఏ కార్డ్ వాడినా, వాడకపోయినా ప్రతి సంవత్సరం డెబిట్ కార్డ్ మెయింటెనెన్స్ ఛార్జీలు, జీఎస్టీ కలిపి దాదాపు రూ. 200 నుంచి రూ. 600 వరకు మీ అకౌంట్ నుంచి కట్ అవుతాయి. ఇలా 4-5 కార్డ్స్ ఉంటే ఏటా వేల రూపాయలు వృథా అవుతాయి.
మీరు ఒకట్రెండు అకౌంట్ లను మాత్రమే రెగ్యులర్‌గా వాడుతూ.. మిగిలిన అకౌంట్ లను అలాగే వదిలేస్తే.. దాదాపు 12 నెలల పాటు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరగకపోతే ఆ అకౌంట్లు ‘డార్మండ్’ లేదా ఇన్‌యాక్టివ్ మోడ్‌లోకి వెళ్లిపోతాయి. వాటిని తిరిగి యాక్టివేట్ చేసుకోవడానికి కేవైసీ ప్రక్రియను మళ్లీ చేయాల్సి వస్తుంది.
ఎన్ని అకౌంట్లు ఉంటే అంత గందరగోళం ఏర్పడుతుంది. ఏ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఏ అకౌంట్ నుంచి ఏ సబ్స్క్రిప్షన్ లేదా ఈఎంఐ కట్ అవుతుందో సరిగ్గా ట్రాక్ చేయడం కష్టమవుతుంది. దీని వల్ల ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ దెబ్బతింటుంది.
చాలా కాలంగా ఉపయోగించని అకౌంట్ పై సైబర్ నేరగాళ్ల కన్ను పడే అవకాశం ఉంది. అలాగే ఆన్ లైన్ పాస్‌వర్డ్‌లు, యూజర్ ఐడీలను సరిగ్గా గుర్తు పెట్టుకోలేకపోవడం వల్ల సేఫ్టీ పరంగా చాలా సమస్యలు తలెత్తుతాయి.
కొన్ని అకౌంట్ లలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల మైనస్ బ్యాలెన్స్ ఏర్పడి, అది పెండింగ్ చార్జీల రూపంలో పేరుకుపోతుంది. ఇది మీ సిబిల్ స్కోర్‌పై పరోక్షంగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
బ్యాంకులు ఎస్ఎంఎస్ అలర్ట్స్ కోసం ప్రతి త్రైమాసికంలో కొంత మొత్తాన్ని కట్ చేసుకుంటాయి.వాడని అకౌంట్లకూ ఈ ఛార్జీలు వర్తిస్తాయి.
Also Read: లోన్ కావాలా? క్రెడిట్ కార్డ్ లోన్ Vs బ్యాంక్ లోన్‌లలో ఏది బెస్ట్!
సంవత్సరం చివర్లో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు అన్ని బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్లు, వాటిపై వచ్చిన వడ్డీ వివరాలను చూపించాలి. అకౌంట్ ఎక్కువగా ఉంటే ఐటీఆర్ ఫైలింగ్ మరింత క్లిష్టంగా మారుతుంది.
మీ అవసరానికి తగినట్లుగా కేవలం 2 బ్యాంక్ అకౌంట్‌లను (ఒకటి శాలరీ/ప్రైమరీ అకౌంట్, మరొకటి సేవింగ్స్/ఎమర్జెన్సీ అకౌంట్) మాత్రమే ఉంచుకుని.. మిగిలిన అనవసరమైన అకౌంట్లను అధికారికంగా క్లోజ్ చేయడం ఎల్లప్పుడూ బెస్ట్.