E-Paper
Advertisement

మాత్రలపై ఆ చిన్న గీత ఎందుకుందో తెలుసా? డిజైన్ కాదు… అసలు రహస్యం ఇదీ!

మాత్రలపై ఆ చిన్న గీత ఎందుకుందో తెలుసా? డిజైన్ కాదు… అసలు రహస్యం ఇదీ!
Advertisement

Tablet Score Line: ఈ రోజుల్లో ఔషదాలు (Tablets) వాడకం విపరీతంగా పెరిగింది. జ్వరం, దగ్గు, జలుబు నుంచి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు చాలా మంది టాబ్లెట్లను వినియోగిస్తున్నారు. అయితే సమస్య ఏదైనా వాటికి ఇచ్చే టాబ్లెట్లపై మాత్రం చిన్న గీతను అందరూ గమనించే ఉంటారు. అసలు ఈ లైన్ ఎందుకన్న ప్రశ్న చాలా మందికి కలిగే ఉంటుంది. ఫార్మాస్యూటికల్ రంగంలో ఈ మార్కును ‘స్కోర్ లైన్’ (Score Line) అని పిలుస్తారు. ప్రతీ టాబ్లెట్ పై దీనిని పెట్టడం వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.

అసలు ఎందుకీ ‘స్కోర్ లైన్’?

మాత్రను రెండు సమాన భాగాలుగా సులభంగా విరిచేందుకు ఈ స్కోర్ లైన్ సహాయపడుతుంది. ఒక వ్యక్తికి పూర్తి టాబ్లెట్ కంటే సగం డోస్ మాత్రమే అవసరమని డాక్టర్ సూచించినప్పుడు రోగులు దానిని కచ్చితమైన పరిమాణంలో తుంచడానికి ఈ గీత ఉపయోగపడుతుంది. ఫార్మాస్యూటికల్ నిబంధనల ప్రకారం.. స్కోర్ లైన్ ఉన్న మాత్రను రెండు ముక్కలుగా చేసినప్పుడు రెండు వైపులా సమాన పరిమాణంలో ఔషధ గుణాలు ఉండేలా తయారీదారులు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తారు. ఎందుకంటే మందు ఎక్కువైనా లేదా తక్కువైనా చికిత్స ఫలితంపై ప్రభావం పడుతుంది.

అన్ని మాత్రలనూ తుంచకూడదా?

Advertisement

అయితే మాత్రలపై గీత కనిపించినంత మాత్రాన ప్రతీ మాత్రనూ విరవడం సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల మందుల తయారీలో ప్రత్యేక కోటింగ్ ఇస్తారు. ఇవి కడుపులో యాసిడ్ల నుంచి మందును కాపాడటానికి లేదా శరీరంలోకి మెల్లమెల్లగా ఔషధం విడుదలయ్యేలా డిజైన్ చేయబడతాయి. ఇలాంటి మాత్రలను విరిచి వేసుకుంటే అవి పనిచేసే విధానం మారిపోయి సైడ్ ఎఫెక్ట్స్ (Side effects) కు దారితీసే ప్రమాదం ఉంది.

వైద్యుల సలహా తప్పనిసరి

వైద్యులు లేదా ఫార్మసిస్ట్‌లు సూచించినప్పుడు, అలాగే మాత్రపై కచ్చితంగా స్కోర్ లైన్ ఉన్నప్పుడు మాత్రమే దానిని విరవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చేతులతో తుంచడం కంటే ‘పిల్ కట్టర్’ (Pill Cutter) ఉపయోగించడం వల్ల మాత్ర రెండుగా సరిగ్గా, పొడి కాకుండా విరుగుతుందని హితవు పలుకుతున్నారు.

Advertisement

Also Read: శ్రీశైలం మార్గంలో ఘోర ప్రమాదం.. క్రూజర్ ఢీకొని ఇద్దరు యూపీ వాసులు మృతి!

ఖర్చు తగ్గే వెసులుబాటు

ఇదిలా ఉంటే స్కోర్ లైన్ కేవలం వాడకం కోసమే కాకుండా మందుల వృథాను తగ్గించడానికి కూడా తోడ్పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కువ డోస్ ఉన్న మాత్రను కొనుగోలు చేసి సగానికి విరిచి వాడటం ద్వారా రోగులకు ఔషధ ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. మెుత్తం మీద మాత్రలపై ఉండే ఆ చిన్న గీత ఒక సాధారణ డిజైన్ కాదని చెప్పవచ్చు. రోగుల భద్రత, సరైన మోతాదు కోసం ఫార్మా కంపెనీలు ఎంతో ఆలోచించి తీసుకువచ్చిన ఒక ప్రాక్టికల్ డిజైన్ స్పష్టమవుతోంది.

Also Read: రూ.10 లక్షలు తగ్గిన MG సైబర్‌స్టర్.. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ కారు ధర ఎంతంటే?

Tags

Related News

షాపింగ్ సమయంలో అందమైన వస్తువులు చూడగానే కొనాలనిపిస్తుంది.. దీనికి కారణాలు ఇవే

శరీరం, మెదడు చురుకుగా ఉంచే 10 బోరింగ్ అలవాట్లు.. మీరూ పాటిస్తున్నారా?

మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు భర్త పట్ల అంకిత భావంతో ఉంటారు

ఎంజాయ్ కోసం లవ్ కోరుకుంటున్న యువత.. ఆ ప్రమాదముందని హెచ్చరిస్తున్న నిపుణులు

ఆపిల్ పండు తింటే కడుపులో పురుగుల చనిపోతాయా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

ఆధార్ కార్డ్‌లో మొబైల్ నెంబర్ అప్డేట్ ఇక చాలా ఈజీ.. ఇంటి నుంచి ఇలా చేసేయండి

రోజూ వాడే టవల్‌ను ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలి? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Big Stories

Advertisement
×