BigTV English
Advertisement

Film Industry: ఫిల్మ్ ఇండస్ట్రీ గుట్టు బయటకు.. కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి దుర్గేష్, ఆనాటి మంత్రుల మాటలు

Film Industry: ఫిల్మ్ ఇండస్ట్రీ గుట్టు బయటకు.. కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి దుర్గేష్, ఆనాటి మంత్రుల మాటలు

Film Industry:  టాలీవుడ్‌లో ఏం జరుగుతోంది? తెర వెనుక నుంచి పరిశ్రమను ఎవరు నడిపిస్తున్నారు? పైకి మాటలు ఒకలా.. లోపల ఇంకోలా జరుగుతోందా? మంత్రి కందుల దుర్గేష్ మాటల వెనుక అసలేం జరుగుతోంది? ఆయనకు హోంశాఖ ఎలాంటి నివేదిక ఇచ్చింది? మంత్రి మాటలు ఇండస్ట్రీలో గుబులు రేపుతోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


ఫిల్మ్ ఇండస్ట్రీపై మంత్రి కీలక వ్యాఖ్యలు

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కందుల దుర్గేష్.  తమ వద్దకు వస్తూనే వెనుక నుంచి కోర్టుల చుట్టూ తిప్పిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  చిత్ర పరిశ్రమకు కూటమి సర్కార్ ఎంతో సహకరిస్తుందన్నారు. కొందరి మాటలు అహంభావ పూరితంగా ఉన్నాయన్నారు.


సినిమాల విడుదలకు ముందు ప్రతిసారీ ఎవరో ఒకరు వచ్చి టికెట్ల ధరలు పెంచమని అడుగుతున్నారని, తాము ఓకే చేస్తున్నామని అన్నారు.  ఆ వెంటనే ఎవరో ఒకరు కోర్టుల్లో పిటిషన్ దాఖలు చేస్తున్నారని వివరించారు. చివరకు అధికారులు కోర్టుల చుట్టూ అధికారులు తిరగాల్సి పరిస్థితి ఏర్పడిందన్నారు.

చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం తాము ధరల పెంపుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు మంత్రి దుర్గేష్.  సోమవారం ఉదయం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాలు బయటపెట్టారు.  సినిమాటోగ్రఫీ శాఖ కింద ఉన్నప్పటికీ,  థియేటర్లకు సంబంధించిన వ్యవహారాలు హోం శాఖ కార్యదర్శి పరిధిలోకి వస్తుందన్నారు.

ALSO READ: పల్నాడు డబుల్ మర్డర్ కేసు, పరారీలో పిన్నెల్లి బ్రదర్స్

రూపాయికి పావులా ఆదాయం

నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ల మీద ఆధారపడిన కుటుంబాలు ఉంటాయన్నారు. పెద్ద సినిమా తీయాలంటే దాదాపు మూడు నాలుగేళ్లు పడుతుందన్నారు. రూపాయి రేటు వారికి పెంచితే జీఎస్టీ కింద కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు పావలా ఆదాయం వస్తుందన్నారు.

తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు మంత్రి దుర్గేశ్. షూటింగ్‌ల అనుమతులు సులభతరం చేయడం, సింగిల్ విండో విధానాన్ని పటిష్టం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఫిల్మ్ సిటీ నిర్మాణానికి సంబంధించిన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సినిమా పరిశ్రమ మన రాష్ట్రానికి గర్వకారణం, దానికి తగిన ప్రోత్సాహం అందించడం మా బాధ్యతగా చెప్పుకొచ్చారు.

న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయిస్తున్న తెర వెనుక వ్యక్తుల గురించి ఎలాంటి వివరాలు బయట పెట్టలేదు సదరు మంత్రి.  ఇటీవల జూన్ ఒకటి నుంచి ఏపీలో థియేటర్లు మూసివేస్తామంటూ వార్తల నేపథ్యంలో మంత్రి రియాక్ట్ అయ్యారు. ఈ వ్యాఖ్యల వెనుక ఎవరు ఉన్నారనే దానిపై విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం హోంశాఖ..  మంత్రి దుర్గేష్‌కు ప్రాథమిక నివేదిక ఇచ్చినట్టు సమాచారం.

దాని ఆధారంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.  చిత్ర పరిశ్రమ వెనుక వైసీపీ మద్దతుదారులు ఉండవచ్చుననే ప్రచారం మరోవైపు ఉంది. ఇండస్ట్రీలో కొంతమంది తాము ఎలాగైనా చేసుకుంటామని ఆలోచన ఉన్నట్లు చెప్పారు.  ప్రభుత్వ సహకారం అవసరం  లేదన్న మాటలను ప్రస్తావించారు.  వారు ఎలాంటి ప్రయోజనాలు ఆశించి ఆయా మాటలు అన్నారో తనకు తెలీదన్నారు.

సినిమా అనేది వ్యాపారం, దీనికి ప్రభుత్వంతో సంబంధం లేదని ఆనాటి మంత్రులు అన్న మాటలను గుర్తు చేశారు. ప్రభుత్వంతో సంబంధం లేదన్నవాళ్లు, ఆనాడు సినిమావాళ్లను రప్పించుకుని ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు.  పరిశ్రమకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. ఆ మాజీ మంత్రి విధానం ఏంటో తనకు తెలీదన్నారు.

 

Related News

Jagan Chandra Babu: ఎన్నికల వేళ జగన్ బయటకు తీసిన అస్త్రం.. చంద్రబాబు ఇప్పుడే ప్రయోగించారు

Ap Govt: ఏపీ ప్రభుత్వం వారికి శుభవార్త.. కేవలం 20 రోజులే, ఇంకెందుకు ఆలస్యం

Winter Weather Report: పెరుగుతున్న చలి తీవ్రత.. వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్

Ambati Rambabu: రూటు మార్చిన అంబటి రాంబాబు .. ఈసారి తిరుమలలో ప్రశంసలు, షాక్‌లో వైసీపీ నేతలు

Karthika Vanabhojanam: ఐదేళ్ల విరామం తర్వాత.. తిరుమలలో వైభవంగా కార్తీక వన భోజన మహోత్సవం

CM Progress Report: లక్షా 2 వేల కోట్ల పెట్టుబడులు.. 85 వేల 570 ఉద్యోగాలు.. చంద్రబాబు యాక్షన్ ప్లాన్

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయాలు

Big Stories

×