E-Paper
Advertisement

పార్ట్ టైమ్ బిజినెస్‌తో నెలకు రూ.30 లక్షల ఆదాయం.. కేవలం రూ.19000 పెట్టుబడి

పార్ట్ టైమ్ బిజినెస్‌తో నెలకు రూ.30 లక్షల ఆదాయం.. కేవలం రూ.19000 పెట్టుబడి
Advertisement

Huge Part Time Income Voice Over| చిన్న మొత్తంతో ప్రారంభించిన ఒక ప్రయత్నం కూడా జీవితంలో ఊహించని మార్పు తీసుకువస్తుంది. దీనికి NASA (అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ) ఇంజినీర్ ఎరిన్ ఆండ్రూస్ కథ మంచి ఉదాహరణ. ఆమె అదనపు ఆదాయం కోసం చేసిన చిన్న ప్రయత్నం ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ ఈ రోజు విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు అదే పని ఆమెకు నెలకు రూ.30 లక్షలకు పైగా ఆదాయం తెస్తోంది. ఎరిన్ ఆండ్రూస్ హ్యూస్టన్‌లోని NASA జాన్సన్ స్పేస్ సెంటర్‌లో పూర్తి సమయం పనిచేస్తున్నారు. అదే సమయంలో ఇంటి నుంచే తన వాయిస్-ఓవర్ వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఆమె కథ చిన్నగా ప్రారంభించి, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే మంచి అవకాశాలు లభిస్తాయని చూపిస్తోంది.

ప్రారంభ టార్గెట్ కేవలం 200 డాలర్లు 

ఎరిన్ ఆండ్రూస్ తనకు నెల జీతం సరిపోకపోవడంతో 2022 మార్చిలో సైడ్ హస్టిల్ (పార్ట్ టైమ్ వ్యాపకం) అవకాశాల కోసం వెతకడం ప్రారంభించారు. ఆ సమయంలో ఆమె సింగిల్ మదర్‌గా (భర్త నుంచి విడిపోయారు) తన కుమార్తెను చూసుకుంటున్నారు. ప్రతి నెల అదనంగా 200 డాలర్లు (భారత కరెన్సీలో రూ.19,000) సంపాదించడమే ఆమె మొదటి లక్ష్యం. ఈ డబ్బుతో తన కుమార్తెతో చిన్న ప్రయాణాలు, ఇతర కార్యక్రమాలు చేయాలని భావించారు. ఆన్‌లైన్‌లో అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో ఆమెకు వాయిస్ – ఓవర్ పని గురించి తెలిసింది. దీంతో ఈ రంగంలో ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. ఆమె శిక్షణ కోర్సు, మైక్రోఫోన్, ప్రాథమిక రికార్డింగ్ పరికరాల కోసం సుమారు 200 డాలర్లు పెట్టుబడి పెట్టారు. తర్వాత Fiverr అనే ఫ్రీ లాన్సింగ్ ప్లాట్ ఫామ్‌లో తన ప్రొఫైల్‌ను రూపొందించి పనుల కోసం ప్రయత్నించారు.

చిన్న ప్రాజెక్టులతో అనుభవాన్ని పెంచుకున్నారు

Advertisement

ప్రారంభంలో ఎరిన్‌కు వృత్తిపరమైన వాయిస్ – ఓవర్ అనుభవం లేదు. అందుకే మొదట తక్కువ పారితోషికం ఇచ్చే చిన్న ప్రాజెక్టులను స్వీకరించారు. ఈ విధానం ద్వారా ఆమె మంచి పోర్ట్‌ఫోలియో నిర్మించుకున్నారు. క్లయింట్ల నుంచి మంచి అభిప్రాయాలు కూడా పొందారు. మొదటి నెలలోనే ఆమె సుమారు 1,000 డాలర్ల ఆదాయం సంపాదించినట్లు తెలిపారు. ఇది ఆమె అనుకున్న 200 డాలర్ల టార్గెట్‌ని మించిపోయింది. కాలక్రమేణా ఆమె తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. దీంతో పెద్ద ప్రాజెక్టులు, కొత్త క్లయింట్లు ఆమెకు రావడం జరిగింది.

ఉద్యోగం తర్వాత బెడ్‌రూమ్ క్లాజెట్‌లో రికార్డింగ్

NASAలో ఇంజినీర్‌గా రోజంతా ఉద్యోగం చేసిన తరువాత ఎరిన్ ఇంట్లో చేసే పని పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నాసా సంస్థలో ఆమె వ్యోమగాముల పనితీరు, కదలికలకు సంబంధించిన పరిశోధనలో పనిచేస్తున్నారు. స్పేస్‌సూట్ ధరించినప్పుడు వ్యోమగాములు ఎలా కదులుతారనే విషయంపై ఆమె డేటాను సేకరించి విశ్లేషిస్తారు. ఉద్యోగం పూర్తయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్లి వాయిస్ – ఓవర్ ప్రాజెక్టులపై పనిచేస్తారు. వాయిస్ ఓవర్ చేయాలంటే ఎలాంటి శబ్ద కాలుష్యం లేకుండా ప్రశాంతంగా ఉండే ప్రదేశం కావాలి. అందుకోసం అమె ఇంట్లోని గెస్ట్ రూమ్ (అతిథుల గది)లోని క్లాజెట్‌ను చిన్న రికార్డింగ్ స్టూడియోగా మార్చుకున్నారు. బయటి శబ్దాన్ని తగ్గించడానికి ఆమె సాధారణ వస్తువులను ఉపయోగించారు. ప్రతి వారం ఒకటి నుంచి ఎనిమిది గంటల వరకు వాయిస్ రికార్డింగ్ చేస్తారు.
కార్పొరేట్ ప్రకటనలు, కంపెనీ వాయిస్ మెసేజ్‌లు, శిక్షణ వీడియోలకు ఆమె తన గాత్రాన్ని అందిస్తున్నారు.

Advertisement

Also Read: కేవలం రూ.16కే ఫ్రెష్ బీర్.. వాటర్ బాటిల్ కంటే తక్కువ ధర.. బారులు తీరుతున్న జనం

ప్రముఖ సంస్థలతో కలిసి పని చేసే అవకాశం

అనుభవం పెరిగిన తర్వాత ఎరిన్‌కు పెద్ద సంస్థల నుంచి కూడా అవకాశాలు వచ్చాయి. ఆమె క్లయింట్లలో కోకా కోలా, పెట్ స్మార్ట్, యునివర్సిటీ ఆఫ్ మిస్సిసిప్పీ వంటి సంస్థలు ఉన్నట్లు సమాచారం.
2026లో ఆమె వాయిస్-ఓవర్ పని ద్వారా 227,000 డాలర్లకు పైగా సంపాదించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఆమె నెలవారీ వ్యాపార ఆదాయం 32,000 డాలర్లకు పైగా చేరింది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.30 లక్షలకు సమానం. 2025లోనే ఆమె పార్ట్ టైమ్ ఆదాయం NASAలో లభించే జీతాన్ని మించిపోయిందని సమాచారం.

Also Read: ఆన్‌లైన్‌లో ఫ్రీగా చదువుకోవచ్చు.. మరి స్కూల్, కాలేజీ ఫీజులు ఎందుకు పెరుగుతున్నాయి?

అదనపు ఆదాయంతో ఆర్థిక స్వేచ్ఛ

ఈ అదనపు ఆదాయంతో ఎరిన్ ప్రయాణాలు చేయగలిగారు. ఆమె ఒక సెకండ్ హ్యాండ్ టొయోటా రావ్4 కారు కూడా కొనుగోలు చేశారు. తన కుమార్తె ఉన్నత విద్య కోసం ప్రత్యేకంగా పొదుపు నిధిని కూడా ఏర్పాటు చేశారు. చిన్న మొత్తంతో ప్రారంభమైన ఈ ప్రయత్నం ఇప్పుడు పెద్ద వ్యాపారంగా మారింది. ఎరిన్ కథ నైపుణ్యం, నిరంతర ప్రయత్నం, సరైన అవకాశాలు ఎంతటి మార్పు తీసుకురాగలవో చూపిస్తోంది.

Related News

ఇల్లు కొనుగోలు చేస్తున్నారా? బిల్డర్లు ఈ విషయాల్లో మోసం చేస్తారు.. జాగ్రత్త

రూ.1 లక్ష జీతం వచ్చినా సరిపోవడం లేదు? యువ ఉద్యోగుల ఫ్రస్ట్రేషన్

రాష్ట్రం మారితే మద్యం ధర ఎందుకు మారుతుంది? అత్యంత తక్కువ ధర రాష్ట్రాలు ఇవే

బ్యాంక్‌లో సీనియర్ జాబ్ వదిలి మైక్రోగ్రీన్స్ బిజినెస్.. చిన్నగదిలో నుంచే రూ.5 లక్షలు ఆదాయం

పోస్ట్ ఆఫీస్ MISలో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేయవచ్చా? డిపాజిట్ లిమిట్స్ ఇవే

8 ఏళ్లుగా ఉద్యోగం లేదు.. 3 సార్లు యుపిఎస్‌సి పరీక్షలు ఫెయిల్.. కట్ చేస్తే రూ.17 లక్షల సాలరీ ఉద్యోగం

రాబోయే 2 ఏళ్లలో ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో అలాంటి ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్

రూ.10 వేలతో బిజినెస్.. ఇంటి నుంచే రూ. లక్షల సంపాదన.. రిచ్ అవ్వడం పక్కా!

Big Stories

Advertisement
×