Gold Price Today: అంతర్జాతీయ పరిణామాల ప్రభావం బులియన్ మార్కెట్ పడింది. దీంతో విలువైన లోహాల ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. గడిచిన రెండు రోజులుగా భారీ పతనాన్ని చనిచూసిన బంగారం- వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ, దేశీయంగా ఉన్న ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం.
అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం-వెండి ధరలు క్రమంలో పెరుగుతున్నాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాల కంటే తక్కువగా ఉంటాయన్న సంకేతాలు, అమెరికా డాలర్‌ను బలహీనపరచడం, అక్టోబరులో ఫెడ్ వడ్డీ రేట్లను పెంచకపోవచ్చని అంచనాలతో పెట్టుబడుదారులకు రూటు మార్చారు. బంగారం-వెండిపై పెట్టుబడులు పెట్టడం మొదలుపెటారు. బుధవారం, గురువారాల్లో స్వల్పంగా బంగారం-వెండి ధరలు పెరగడం మొదలయ్యాయి.
గురువారం ఉదయం 9.05 గంటలకు స్పాట్ గోల్డ్ 0.7% పెరిగి ఔన్సుకు 4209 డాలర్లకు చేరుకుంది. వెండి కూడా బంగారం దారిలో నడుస్తోంది. క్రితం రోజుతో పోల్చితే బుధవారం పెరిగాయి. సెప్టెంబర్‌లో ఇప్పటివరకు బంగారం ధరలు 5.4 శాతం తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం-వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అక్టోబర్ 1 గురువారం ఉదయం హైదరాబాద్ తోపాటు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల పసిడితో పాటు వెండి ధరల వివరాలను ఇప్పుడు చూద్దాం.
ALSO READ: ‘నో యూపీఐ డే’ నిరసనపై వెనక్కి తగ్గిన ట్రేడర్స్.. మంత్రి నిర్మల భేటీలో ఏం జరిగింది?
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. అక్టోబర్ 1 అనగా గురువారం ఉదయం 6.30 గంటలకు బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.1,49,580గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,37,110 వద్ద ట్రేడంగ్ అవుతోంది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,25,100 వద్ద కొనసాగుతోంది. న్యూఢిల్లీలో 24 క్యారెట్ల పది గ్రామాలు పసిడి ధర రూ. 149,930 ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.137,238 వద్ద ఉంది. ఇక ముంబై, బెంగుళూరు, కోల్ కతా నగరాల్లో రూ.200 అటు ఇటుగా ధర పలుకుతోంది. చెన్నైలో మాత్రం బంగారం ధర ఢిల్లీ ధరకు కాస్త అటు ఇటుగా కనిపిస్తోంది. కిలో వెండి రేటు రూ. 2,25,510 వద్ద ఊగిసలాడుతోంది.