E-Paper
Advertisement

పాత డెబిట్ కార్డ్ పడేస్తున్నారా? ఈ పని చేయకపోతే మీ అకౌంట్ ఖాళీ!

పాత డెబిట్ కార్డ్ పడేస్తున్నారా? ఈ పని చేయకపోతే మీ అకౌంట్ ఖాళీ!
Advertisement

Debit card security tips: ప్రస్తుతం డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో ఒకటి లేదా రెండు ఏటీఎం/డెబిట్ కార్డులు ఉంటున్నాయి. ఆన్‌ లైన్ పేమెంట్లు, షాపింగ్, ఏటీఎం విత్ డ్రా కోసం వీటిని రోజూ ఉపయోగిస్తుంటాం. అయితే.. ఆ కార్డ్స్ వాలిడిటీ అయిపోయిన తర్వాత.. లేదా కొత్త కార్డ్ బ్యాంకు నుంచి ఇంటికి రాగానే.. పాత కార్డును మనం ఏం చేస్తుంటాం? ఏదో ఒక మూలన పడేయడమో లేదా నేరుగా చెత్తబుట్టలో విసిరేయడం వంటివి చేస్తుంటాం. చాలా మంది చేసే ఈ చిన్న నిర్లక్ష్యమే పెద్ద సైబర్ నేరాలకు దారి తీస్తుందని మీకు తెలుసా? సైబర్ కేటు గాళ్లు పాత కార్డుల ద్వారా మీ బ్యాంక్ అకౌంట్‌ను ఎలా టార్గెట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం.

పాత కార్డులను పడేస్తే వచ్చే నష్టాలు:

మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుపై మీ పూర్తి పేరు, కార్డ్ నంబర్ (16 అంకెలు), ఎక్స్‌పైరీ డేట్, వెనక వైపు ఉండే 3 అంకెల CVV నంబర్ స్పష్టంగా ముద్రించబడి ఉంటాయి. అంతే కాకుండా.. కార్డు వెనక వైపు మీ సంతకం కూడా ఉంటుంది. మీరు గనక ఈ కార్డును ఎలాంటి ముక్కలు చేయకుండా అలాగే పారేస్తే.. ఆ చెత్తను సేకరించే. వారు లేదా సైబర్ కేటుగాళ్ల చేతికి ఆ కార్డ్ చిక్కితే చాలు. ఆన్ లైన్ లో సీవీవీ లేదా ఓటీపీ ఆధారంగా మీ అకౌంట్ లోని డబ్బును ఇష్టానుసారంగా కాజేసే.. ప్రమాదం ఉంది. నేటి కాలంలో అనేక బ్యాంకుల్లో కార్డ్ రిప్లేస్‌మెంట్ ఫీజులు సాధారణంగా రూ. 150 నుంచి రూ.500 వరకు ఉంటున్నాయి. కానీ ఈ చిన్న అజాగ్రత్త.. వల్ల మీరు వేల రూపాయలను కోల్పోవాల్సి రావచ్చు.

పాత డెబిట్ కార్డును ఏం చేయాలి?

Advertisement

మీ పాత లేదా ఎక్స్‌ పైర్ అయిన.. ఏటీఎం కార్డును ఎట్టి పరిస్థితుల్లోనూ అలాగే పడేయకండి.దానిని పారేసే ముందు ఈ కింది జాగ్రత్తలు కచ్చితంగా పాటించండి.

చిప్, మాగ్నెటిక్ స్ట్రిప్ ధ్వంసం :

కార్డుపై ఉన్న గోల్డెన్ కలర్ చిప్, వెనక వైపు ఉండే బ్లాక్ కలర్ మాగ్నెటిక్ స్ట్రిప్‌ను కత్తెర సహాయంతో కట్ చేయాలి. ఎందుకంటే.. మిషన్లు లేదా రీడర్లు ఆ చిప్ ద్వారానే డేటాను యాక్సెస్ చేస్తాయి.ఆ భాగాన్ని ముక్కలు చేయడం ద్వారా కార్డ్ పూర్తిగా పనికి రాకుండా పోతుంది.

కార్డ్ నంబర్ , CVV ని కట్ చేయాలి:

Advertisement

కత్తెరతో కార్డును నిలువుగా, అడ్డంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ముఖ్యంగా 16 అంకెల కార్డ్ నంబర్, ఎక్స్‌పైరీ డేట్ , సీవీవీ నంబర్లు స్పష్టంగా కనిపించకుండా వాటిని ముక్కలు ముక్కలుగా కత్తిరించడం చాలా ముఖ్యం.

Also Read: వాట్సాప్‌లో తెలియని గ్రూప్‌లలో యాడ్ చేస్తున్నారా? ఈ సెట్టింగ్ వెంటనే మార్చండి! 

వివిధ డస్ట్ బిన్లలో పడేయాలి:

కార్డును కట్ చేసిన తర్వాత ఆ ముక్కలన్నింటినీ ఒకే చోట పడేయకుండా.. వేర్వేరు చెత్త బుట్టలలో లేదా ప్యాకెట్లలో వేరు చేసి పడేయడం మరింత మంచిది. అలాగే మీ బ్యాంకుకు సంబంధించిన మొబైల్ యాప్‌లో లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆ పాత కార్డ్‌ను పర్మనెంట్‌గా ‘బ్లాక్’ లేదా ‘డీయాక్టివేట్’ చేయడం మర్చిపోకండి.

కొత్త టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. బ్యాంకు అకౌంట్ సేఫ్ గా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఇకపై మీ పాత డెబిట్ లేదా క్రెడిట్ కార్డును పారేసే ముందు ఈ చిన్న జాగ్రత్తలు పాటించి మీ కష్టార్జితాన్ని సేఫ్‌గా ఉంచుకోండి!

Related News

ఎస్‌‌బీఐ బంపరాఫర్.. పిల్లలు, వృద్ధులు, యువత కోసం.. అధిక వడ్డీతో 3 సూపర్ స్కీమ్స్!

పోస్టాఫీసు మోస్ట్ వాంటెడ్ స్కీమ్.. రూ.8000 కడితే చేతికి రూ.5.68 లక్షలు.. అస్సలు లైట్ తీసుకోవద్దు!

వయసు 21 ఏళ్లు.. ఒక్క నెలలో రూ.2.6 కోట్లు సంపాదన.. అదిరిపోయే బిజినెస్ ఐడియా?

పడిపోతున్న బంగారం-వెండి ధరలు.. నెలలో 8 వేల తగ్గుముఖం, ఇవాళ మార్కెట్లో ధరలు

అత్యవసరంగా డబ్బు కావాలా? మీ పిపిఎఫ్ అకౌంట్ నుంచి ఈజీ లోన్ లభిస్తుందిగా

సెక్యూరిటీ గార్డ్ జాబ్ వదిలేసి చిన్న వ్యాపారం.. కట్ చేస్తే నెలకు రూ.50 లక్షల ఆదాయం

జీతం ఎక్కువ ఉన్నా ధనవంతులు కాలేకపోతున్నారా? కోటీశ్వరులను చేసే.. 5 గోల్డెన్ సూత్రాలు మీకోసం!

Big Stories

Advertisement
×