E-Paper
Advertisement

ఎస్‌‌బీఐ బంపరాఫర్.. పిల్లలు, వృద్ధులు, యువత కోసం.. అధిక వడ్డీతో 3 సూపర్ స్కీమ్స్!

ఎస్‌‌బీఐ బంపరాఫర్.. పిల్లలు, వృద్ధులు, యువత కోసం.. అధిక వడ్డీతో 3 సూపర్ స్కీమ్స్!
Advertisement

SBI Savings Schemes: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారుల కోసం ఎన్నో రకాల సేవలను అందుబాటులో ఉంచింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మూడు చిన్న పొదుపు పథకాలను సైతం సులభంగా పొందే వీలును ఎస్‌బీఐ కల్పిస్తోంది. చిన్నారులు, యువత, వృద్ధుల కోసం ప్రత్యేకంగా రూపొందిన ఈ స్కీమ్స్.. మధ్యతరగతి ప్రజలకు ఎన్నో రకాల బెనిఫిట్స్ ను అందించనున్నాయి. ప్రస్తుతం ఎస్‌బీఐ అందిస్తున్న స్కీమ్స్ లో టాప్ – 3లో ఉన్న పథకాల గురించి ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)

60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఎస్‌బీఐ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఒక మంచి ప్రత్యామ్నాయం. సాధారణంగా ఎస్‌బీఐలో ఐదేళ్ల ఎఫ్‌డీపై సీనియర్ సిటిజన్లకు 7.05 శాతం వడ్డీ లభిస్తుండగా.. ఈ స్కీమ్‌లో ఏకంగా 8.20 శాతం.. ప్రభుత్వ గ్యారెంటీతో లభిస్తుంది. ఈ పథకంలో గరిష్టంగా రూ.30 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ప్రతీ మూడు నెలలకోసారి (ఏప్రిల్, జులై, అక్టోబర్, జనవరి నెలల్లో) వడ్డీ సొమ్ము నేరుగా ఎస్‌బీఐ సేవింగ్స్ ఖాతాలో జమ అవుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా పొందవచ్చు.

సుకన్య సమృద్ధి యోజన (SSY)

Advertisement

ఇంట్లో 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్ల ఉంటే ఆమె పేరు మీద ఎస్‌బీఐ శాఖలో లేదా యోనో (YONO) యాప్ ద్వారా సుకన్య సమృద్ధి ఖాతాను తెరవవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 8.20 శాతం వడ్డీ అందుబాటులో ఉంది. ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే.. ఏ దశలోనూ దీనిపై పన్ను భారం ఉండదు. అంటే మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం, దానికి వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ సమయానికి చేతికి అందే మొత్తంపై ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.250 నుండి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేసే సదుపాయం ఉంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)

భవిష్యత్తు లక్ష్యాలు, రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) స్కీమ్ అత్యంత ప్రాధాన్యత పొందింది. సాధారణంగా బ్యాంకులు 5 నుండి 10 ఏళ్ల ఎఫ్‌డీలపై ఇచ్చే వడ్డీ రేట్ల (6.05% – 6.45%) కంటే పీపీఎఫ్ లో లభించే వడ్డీ రేటు (7.10 శాతం) చాలా ఉత్తమమైనది. సుకన్య పథకం తరహాలోనే పీపీఎఫ్ కూడా పన్ను మినహాయింపు ఉంది. కాబట్టి మెచ్యూరిటీ మొత్తంపై పైసా కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఇందులో 15 ఏళ్ల లాకిన్ పీరియడ్ పూర్తయిన తర్వాత ప్రతి 5 ఏళ్ల చొప్పున ఎన్నిసార్లైనా గడువును పొడిగించుకోవచ్చు. ఏడాదికి కేవలం రూ.500తో కూడా ఈ ఖాతాను ప్రారంభించవచ్చు.

Advertisement

Also Read: ఇదెక్కడి విచిత్రం సామీ.. 15 ఏళ్లుగా రాఖీ కట్టిన అన్ననే పెళ్లాడిన చెల్లెలు!

ఈ పథకాల్లో ఎలా చేరాలి?

పైన పేర్కొన్న ఎస్ బీఐ పథకాల్లో చేరడం చాలా సులభం. ఆన్ లైన్, అఫ్ లైన్ పద్దతుల్లో ఈ పథకంలో చేరేందుకు అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఆన్‌లైన్ పద్ధతికి వస్తే.. ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా యోనో (YONO) యాప్ లో లాగిన్ అవ్వాలి. అక్కడ ‘E-Services / Govt Schemes’ విభాగంలోకి వెళ్లి పీపీఎఫ్ లేదా సుకన్య సమృద్ధి ఖాతాను నేరుగా ఓపెన్ చేయవచ్చు. ఇక ఆఫ్ లైన్ పద్దతికి వస్తే.. సమీపంలోని ఎస్‌బీఐ శాఖకు వెళ్లి అవసరమైన గుర్తింపు కార్డులు (ఆధార్, పాన్ కార్డ్), పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, డిపాజిట్ మొత్తాన్ని సమర్పించి వెంటనే ఖాతాను ప్రారంభించవచ్చు.

Also Read: అక్టోబర్ 1 నుంచి వాట్సప్‌ కొత్త రూల్.. ఒక్కో మెసేజ్‌కు 14 పైసలు ఛార్జీ.. సామాన్యులపై ప్రభావమెంత?

Tags

Related News

పోస్టాఫీసు మోస్ట్ వాంటెడ్ స్కీమ్.. రూ.8000 కడితే చేతికి రూ.5.68 లక్షలు.. అస్సలు లైట్ తీసుకోవద్దు!

వయసు 21 ఏళ్లు.. ఒక్క నెలలో రూ.2.6 కోట్లు సంపాదన.. అదిరిపోయే బిజినెస్ ఐడియా?

పడిపోతున్న బంగారం-వెండి ధరలు.. నెలలో 8 వేల తగ్గుముఖం, ఇవాళ మార్కెట్లో ధరలు

అత్యవసరంగా డబ్బు కావాలా? మీ పిపిఎఫ్ అకౌంట్ నుంచి ఈజీ లోన్ లభిస్తుందిగా

సెక్యూరిటీ గార్డ్ జాబ్ వదిలేసి చిన్న వ్యాపారం.. కట్ చేస్తే నెలకు రూ.50 లక్షల ఆదాయం

జీతం ఎక్కువ ఉన్నా ధనవంతులు కాలేకపోతున్నారా? కోటీశ్వరులను చేసే.. 5 గోల్డెన్ సూత్రాలు మీకోసం!

కేంద్రం అదిరిపోయే స్కీమ్.. రూ. 210తో జీవితాంతం రూ. 5,000 పెన్షన్.. మధ్యతరగతికి పండగే!

Big Stories

Advertisement
×