BigTV English

Google Fined: గూగుల్ కు షాక్, రూ. 300 కోట్లు జరిమానా విధించిన ఆస్ట్రేలియా!

Google Fined: గూగుల్ కు షాక్, రూ. 300 కోట్లు జరిమానా విధించిన ఆస్ట్రేలియా!

Google: టెక్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వానికి రూ. 300 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. స్మార్ట్‌ ఫోన్లలో సెర్చ్ ఇంజన్ల ఎంపికలను పరిమితం చేసి, వాటి నుంచి భారీగా లబ్ది పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ జరిమా చెల్లించేందుకు ఓకే చెప్పింది. గూగుల్ తన సెర్చ్ ఇంజన్‌ ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్లలో ముందే ఇన్‌ స్టాల్ చేసి ఉండేలా చూసుకోవడానికి ఆస్ట్రేలియాలోని ప్రముఖ టెల్కోలతో ఒప్పందాలు చేసుకుంది. డిసెంబర్ 2019- మార్చి 2021 మధ్య అమ్మిన స్మార్ట్ ఫోన్లలో ప్రత్యామ్నాయ సెర్చ్ ఇంజన్లను అందించకుండా చర్యలు తీసుకుంది.  ప్రతిగా ఆ ఫోన్లలో చేసిన సెర్చ్ ద్వారా వచ్చే యాడ్స్ ఆదాయంలో కొంత భాగాన్ని గూగుల్ తీసుకుంది.


ఆస్ట్రేలియన్ కోర్టుకు చేరిన వివాదం

ఈ కేసును ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ (ACCC) ముందుకు  వచ్చింది. గూగుల్ దేశంలోని రెండు అతిపెద్ద టెలికాం ప్రొవైడర్లు, టెల్స్ట్రా,  ఆప్టస్‌ తో ఒప్పందాలు కుదుర్చుకుందని, ప్రత్యర్థి సెర్చ్ ఇంజన్లను అందుబాటులో లేకుండా చేసిందని ఆరోపణలు ఎదుర్కొంది. ఈ ఒప్పందాలు పోటీ సెర్చ్ ఇంజిన్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపించింది. సుమారు 15 నెలల పాటు అక్రమ మార్గంలో ఆదాయాన్ని పొందినట్లు కోర్టు గుర్తించింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను గూగుల్కు $36 మిలియన్ల(సుమారు రూ. 300 కోట్లు) జరిమాన విధించింది. అంతేకాదు, కోర్టు అమలు చేసే అండర్‌ టేకింగ్‌ పై సంతకం చేయాలని ఆదేశించింది. తాజాగా అందుకు అంగీకరిస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది.  ఈ నిర్ణయంతో భవిష్యత్ ఒప్పందాల నుంచి  నిర్బంధ నిబంధనలను తొలగించడానికి కంపెనీని కట్టుబడి ఉంటుంది. ఆండ్రాయిడ్ పరికర తయారీదారులు,  క్యారియర్లకు సెర్చ్ ఇంజన్లు, బ్రౌజర్లను ప్రీ లోడింగ్ చేయడంలో అనుమతి ఉంటుంది.


Read Also: చెక్కుల వెనుక సంతకం ఎందుకు చేస్తారో మీకు తెలుసా?

జరిమానా చెల్లించేందుకు గూగుల్ అంగీకారం

ACCC తీసుకున్న నిర్ణయాలకు కట్టబడి ఉంటుందని గూగుల్ ప్రతినిధులు తెలిపారు. వివాదాస్పద నిబంధనలు కొంతకాలంగా గూగుల్ వాణిజ్య ఒప్పందాలలో భాగం కాదన్నారు. ఆపిల్‌ తో పోటీ పడటానికి, స్మార్ట్ ఫోన్ల ఖర్చులను తక్కువగా ఉంచడానికి సహాయపడే లక్షణాలను ఇప్పటికీ కాపాడుతున్నట్లు తెలిపారు. ఆండ్రాయిడ్ తయారీదారులకు బ్రౌజర్లు, సెర్చ్ యాప్స్ ప్రీ లోడ్ చేయడానికి ఎక్కువ సౌలభ్యాన్ని ఇవ్వడానికి గూగుల్ కట్టుబడి ఉందన్నారు. యూరప్, అమెరికాలో స్మార్ట్ ఫోన్ తయారీదారులు, యాప్ డెవలపర్లు, వినియోగదారులను ప్రభావితం చేయడానికి గూగుల్ సెర్చ్, యాడ్స్ లో తన స్థానాన్ని ఎలా ఉపయోగిస్తుందో ఇలాంటి కేసులు పరిశీలించాయి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో న్యాయమైన పోటీని నిర్ధారించడానికి నియంత్రణ సంస్థలు పెద్ద టెక్ కంపెనీలను ఎలా పరిశీలిస్తున్నాయో ఆస్ట్రేలియన్ నిర్ణయం గుర్తు చేస్తుంది. ఈ తీర్పుతో ఆస్ట్రేలియాలో అమ్మే కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్లలో ఇకపై మరిన్ని సెర్చ్ ఇంజిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Read Also: డిమార్ట్ ఎగ్జిట్ చెక్.. బిల్ మీద స్టాంప్ ఎందుకు వేస్తారో తెలుసా?

Related News

Tata Sierra SUV: రెండు వెర్షన్లలో టాటా సియెర్రా, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Cheques: చెక్కుల వెనుక సంతకం ఎందుకు చేస్తారో మీకు తెలుసా?

జియో షాకింగ్ నిర్ణయం.. ఆ రిచార్జ్ ప్లాన్‌ తొలగింపు? ఇలాగైతే కష్టమే!

DMart vs Metro: డిమార్ట్, మెట్రో.. ఏ స్టోర్ లో సరుకులు చౌకగా దొరుకుతాయంటే?

Ola Super Bike: ఓలా నుంచి సూపర్ బైక్, ధర రూ.5 లక్షలు.. భారత్ లో ఎంట్రీ ఎప్పుడంటే?

Big Stories

×