OTT Movie : మలయాళ థ్రిల్లర్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే స్టఫ్ ఉన్న ఒక సినిమా యూట్యూబ్ లో ఫ్రీగానే స్ట్రీమ్ అవుతోంది. ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్, మర్డర్ మిస్టరీ, క్లైమాక్స్ ట్విస్ట్ తో మలయాళ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఈ సినిమా ఒక మర్డర్ కేసుకు ఇరుక్కున్న తండ్రిని కాపాడే కొడుకుచుట్టూ తిరుగుతుంది. ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా పేరు ఏమిటి ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
యూట్యూబ్ లో స్ట్రీమింగ్
‘అభ్యూహం’ (Abhyuham) ఒక మలయాళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. దీనికి అఖిల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఇందులో అజ్మల్ అమీర్ (జయరాజన్), రాహుల్ మాధవ్ (డెన్నిస్), కొట్టాయం నజీర్ (జోయ్) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 43 నిమిషాల ఈ సినిమా IMDbలో 7.2/10 రేటింగ్ పొందింది. ఇది 2023 జులై 21న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా ప్రస్తుతం OTTలో అందుబాటులో లేదు. కానీ YouTube లో హిందీ డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది. 20 లక్షల వ్యూస్ కూడా సాధించింది.
స్టోరీలోకి వెళితే
జయరాజన్ ఒక రబ్బర్ ప్లాంటేషన్ వర్కర్. తన భార్య అనిత, కూతురుతో గ్రామంలో ఉంటాడు. అతను విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్ట్ రెడీ చేసుకుంటాడు. అతని తండ్రి రాజన్ చాలా సంవత్సరాలుగా ఒక మర్డర్ కేసులో జైలులో ఉన్నాడు. ఈ సమయంలో లాయర్ మంజరి జయరాజన్‌కి ఒక విషయం చెబుతుంది. రాజన్ నిర్దోషి అని, తప్పుడు కేసులో ఇరికించబడ్డాడని, రాజన్‌ని రక్షించడానికి, నిజమైన నేరస్థుడిని కనిపెట్టాలని అంటుంది. జయరాజన్ ఈ కేసును మళ్లీ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇదే సమయంలో, ACP డెన్నిస్ జోసెఫ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఈ మర్డర్ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తాడు.
జయరాజన్, మంజరి కలిసి కేసు వివరాలు తవ్వుతారు. జోయ్ ఫిలిప్ అనే పాత్ర ఇప్పుడు కథలో కీలకంగా మారుతుంది. ఇన్వెస్టిగేషన్‌లో డెన్నిస్, జయరాజన్ దాదాపు ఈ కేసు వెనుక సీక్రెట్ కనిపెడతారు. కథలో అనేక ట్విస్ట్‌లు వస్తాయి. రాజన్‌ని ఎవరు ఇరికించారు? నిజమైన నేరస్థుడు ఎవరు? ఇది కుట్రా లేక నిజమా? అనేవి క్లైమాక్స్‌లో ఒక ఊహించని ట్విస్ట్ తో రివీల్ అవుతుంది. మీరుకూడా ఈ సినిమాను చూడాలనుకుంటే, యూట్యూబ్ లో ఓ లుక్ వేయండి.
Read Also : ర్యాబిట్ సూట్ లో వింత మనిషి జోస్యం… నిద్రలో నడిచే అలవాటున్న హీరోకి ఊహించని షాక్… వణికించే హర్రర్ సీన్స్