E-Paper
Advertisement

రూ.50 వేల పెట్టుబడితో నెలకు రూ.7.5 లక్షల ఆదాయం.. తెలుగోడి స్పెషల్ ఇడ్లీ బిజినెస్

రూ.50 వేల పెట్టుబడితో నెలకు రూ.7.5 లక్షల ఆదాయం.. తెలుగోడి స్పెషల్ ఇడ్లీ బిజినెస్
Advertisement

Success Story| చిన్న పెట్టుబడితో మొదలైన వ్యాపారం పెద్ద విజయంగా మారాలంటే ఒక క్రియేటివ్ ఐడియా, పట్టుదల, క్వాలిటీ పట్టుదల అవసరం. విశాఖపట్నంకు చెందిన చిట్టెం సుధీర్ కథ దీనికి మంచి ఉదాహరణగా నిలుస్తుంది. వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో చదువుకున్న సుధీర్ కేవలం రూ.50 వేల పెట్టుబడితో తన వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆరోగ్యకరమైన సంప్రదాయ ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రత్యేక ఇడ్లీలను విక్రయించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆయన వ్యాపారం నెలకు సుమారు రూ.7.5 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నట్లు సమాచారం.

కేవలం రూ.50000తో వ్యాపారం ప్రారంభం

సుధీర్ 2018లో వాసెన పొలి పేరుతో తన వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇందుకోసం ఆయన మొదట రూ.50 వేల పెట్టుబడి పెట్టారు. సంప్రదాయ టిఫిన్స్ మరింత ఆరోగ్యకరంగా అందించాలనేది ఆయన లక్ష్యం. విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో ఆయన ఈ వ్యాపారం కొనసాగిస్తున్నారు. క్రమంగా వినియోగదారులు పెరగడంతో వ్యాపారం కూడా విస్తరించింది.

ప్రజల దృష్టిని ఆకర్షించిన సుధీర్ స్పెషల్ ఇడ్లీ

Advertisement

సుధీర్ వ్యాపారానికి 2021లో పెద్ద గుర్తింపు వచ్చింది. అప్పటి ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆయన స్టాల్‌ను సందర్శించారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఆయన అక్కడ టిఫిన్ చేశారు. సుధీర్ తయారు చేసిన ప్రత్యేక ఇడ్లీలను రుచి చూసిన నాయుడు ఈ ఆలోచనను అభినందించారు. తర్వాత ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో దీనిపై పోస్టు చేయడంతో వ్యాపారానికి మరింత ప్రచారం వచ్చింది.

8 రకాల చిరుధాన్యాలతో మిల్లెట్ ఇడ్లీల తయారీ

సుధీర్ తయారు చేసే ఇడ్లీలలో 8 రకాల చిరుధాన్యాలను ఉపయోగిస్తారు. అంతేకాకుండా వీటిని విస్తరాకుల్లో ఆవిరితో ఉడికిస్తారు. ఈ సంప్రదాయ విధానం ఇడ్లీలకు ప్రత్యేకమైన రుచిని, గుర్తింపును అందిస్తోంది. విస్తరాకులకు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.

ఆరోగ్యకరమైన చట్నీలతో మిల్లెట్ ఇడ్లీలు

Advertisement

ఇడ్లీలతో పాటు సొరకాయ, అల్లం, క్యారెట్ వంటి పదార్థాలతో తయారు చేసిన చట్నీలను కూడా అందిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని కోరుకునే వినియోగదారులను ఈ ప్రత్యేక కలయిక ఆకర్షిస్తోంది. ప్రతిరోజూ ఉదయం 6:30 గంటల నుంచే ఆయన స్టాల్ వద్ద కస్టమర్లు కనిపిస్తారని నివేదికలు చెబుతున్నాయి.

Also Read: వయసు 21 ఏళ్లు.. ఒక్క నెలలో రూ.2.6 కోట్లు సంపాదన.. యువకుడి బిజినెస్ ఐడియా అదుర్స్

నెలకు 700 కిలోల చిరుధాన్యాల సేకరణ

సుధీర్ ప్రతి నెలా సుమారు 700 కిలోల చిరుధాన్యాలను సేకరిస్తున్నారు. ఇందుకోసం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని గిరిజన రైతులను సంప్రదిస్తున్నారు. ఆయన కొంతమంది రైతులకు మార్కెట్ ధర కంటే ఎక్కువ చెల్లిస్తున్నారు. దీంతో స్థానిక రైతులకు కూడా ప్రయోజనం చేకూరుతోంది.

Also Read: సెక్యూరిటీ గార్డ్ జాబ్ వదిలేసి చిన్న వ్యాపారం.. కట్ చేస్తే నెలకు రూ.50 లక్షల ఆదాయం

పెద్ద వ్యాపారంగా మారిన చిన్న పెట్టుబడి

రూ.50 వేలతో ప్రారంభమైన సుధీర్ ప్రయాణం ఇప్పుడు నెలకు రూ.7.5 లక్షల ఆదాయం వరకు చేరుకుంది. ఆరోగ్యం, సంప్రదాయం, స్థానిక ఉత్పత్తులను కలిపి ప్రత్యేకమైన వ్యాపారాన్ని నిర్మించారు. సరైన ఆలోచనతో చిన్న వ్యాపారం కూడా పెద్ద విజయాన్ని సాధించగలదని ఆయన ప్రయాణం చూపిస్తోంది.

Related News

బుధవారం జీఎస్టీ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్, అదే జరిగితే బంగారం-వెండి ధరలకు రెక్కలు

ఇల్లు కొనుగోలు చేస్తున్నారా? బిల్డర్లు ఈ విషయాల్లో మోసం చేస్తారు.. జాగ్రత్త

రూ.1 లక్ష జీతం వచ్చినా సరిపోవడం లేదు? యువ ఉద్యోగుల ఫ్రస్ట్రేషన్

రాష్ట్రం మారితే మద్యం ధర ఎందుకు మారుతుంది? అత్యంత తక్కువ ధర రాష్ట్రాలు ఇవే

బ్యాంక్‌లో సీనియర్ జాబ్ వదిలి మైక్రోగ్రీన్స్ బిజినెస్.. చిన్నగదిలో నుంచే రూ.5 లక్షలు ఆదాయం

పోస్ట్ ఆఫీస్ MISలో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేయవచ్చా? డిపాజిట్ లిమిట్స్ ఇవే

8 ఏళ్లుగా ఉద్యోగం లేదు.. 3 సార్లు యుపిఎస్‌సి పరీక్షలు ఫెయిల్.. కట్ చేస్తే రూ.17 లక్షల సాలరీ ఉద్యోగం

Big Stories

Advertisement
×