Niharika Konidela: మెగా ఫ్యామిలీ నుండి చాలావరకు అబ్బాయిలే హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ అందులో నుండి ఎంట్రీ ఇచ్చిన ఒకేఒక్క హీరోయిన్ నిహారిక కొణిదెల. ‘ఒక మనసు’ మూవీతో హీరోయిన్‌గా పరిచయమయిన నిహారిక.. పలు తమిళ చిత్రాల్లో కూడా నటించింది. కానీ అవి తనకు సక్సెస్ తీసుకొని రాకపోవడంతో టాలీవుడ్‌లోనే సెటిల్ అయిపోయింది. అలా బ్యాక్ టు బ్యాక్ పలు తెలుగు చిత్రాల్లో నటించింది. చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆన్ స్క్రీన్‌కు నిహారిక దూరమయినా నిర్మాతగా కొత్త అడుగులు వేసింది. ఇప్పుడు విడాకులు కూడా అయిపోవడంతో మరోసారి కోలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది ఈ మెగా డాటర్.
హీరోతో స్టెప్పులు
2018లో ‘ఒరు నల్ల నాల్ పాతు సొల్రేన్’ అనే తమిళ చిత్రంలో నటించింది నిహారిక కొణిదెల. అందులో విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తిక్ లాంటి హీరోలు ఉన్నా ఈ మూవీ అసలు ప్రేక్షకులకు రీచ్ అవ్వలేదు. దీంతో మళ్లీ కోలీవుడ్ వైపు అడుగుపెట్టలేదు. ఇన్నాళ్ల తర్వాత ‘మద్రాస్కారన్’ అనే తమిళ చిత్రంతో కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యింది. వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో షేన్ నిగమ్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి ‘తాయ్ తక్క కళ్యాణం’ అనే పాట విడుదలయ్యింది. అందులో షేన్ నిగమ్‌తో కలిసి నిహారిక వేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
Also Read: షారుఖ్ ఖాన్ వీక్‌నెస్ అదే, అక్షయ్ కుమార్‌కు అలా చెప్తేనే వింటాడు.. దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు
అప్పుడే విడుదల
‘మద్రాస్కారన్’ మూవీతో పాటు మరొక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌లో కూడా నటించింది నిహారిక. అది కూడా తమిళ ఆల్బమ్ సాంగ్ కావడం విశేషం. ‘కడలోరా కవిదయ్’ అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన టీజర్ కూడా తాజాగా విడుదలయ్యింది. స్వాతిని దర్శకత్వం వహించిన ఈ ఆల్బమ్ సాంగ్‌కు విషాల్ సురేశ్ సంగీతం అందించారు. ఇందులో నిహారికకు జోడీగా దర్శన్ నటించాడు. ఇందులో అమాయకమైన లుక్స్‌తో కోలీవుడ్ ప్రేక్షకులను వలలో పడేయడానికి సిద్ధమయ్యింది నిహారిక కొణిదెల. ‘కడలోరా కవిదయ్’ పూర్తి సాంగ్ సెప్టెంబర్ 20న విడుదల అవుతుందని తానే స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది.
క్లారిటీ లేదు
గత ఎనిమిదేళ్లుగా కోలీవుడ్‌కు దూరంగా ఉంది నిహారిక కొణిదెల. అలాంటిది తను హీరోయిన్‌గా నటిస్తున్న రెండు తమిళ అప్డేట్ బ్యాక్ టు బ్యాక్ ఒకేరోజు విడుదల కావడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. కోలీవుడ్ లాగానే మళ్లీ తను టాలీవుడ్‌లో కూడా యాక్టివ్ అయితే బాగుంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం తను ‘వాట్ ది ఫిష్’ అనే మూవీలో నటిస్తుందని వార్తలు వచ్చినా ఇంకా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటికి రాలేదు. నిహారిక చివరిగా ‘డెడ్ పిక్సెల్స్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. దీంతో మరోసారి వెండితెరపై నిహారికను చూడాలనుకున్న తెలుగు ప్రేక్షకులు ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలా అని ఆలోచిస్తున్నారు.