E-Paper
Advertisement

బ్యాంకుకు వెళ్లకుండానే..ఫోన్ నంబర్ మార్చుకోవడం ఎలా? సింపుల్ ప్రాసెస్ ఇగో!

బ్యాంకుకు వెళ్లకుండానే..ఫోన్ నంబర్ మార్చుకోవడం ఎలా? సింపుల్ ప్రాసెస్ ఇగో!
Advertisement

Change bank mobile number online: టెక్నాలజీ మారుతున్న కొద్దీ బ్యాంకులు మన పనిని చాలా ఈజీ చేశాయి. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, బ్యాంకు చుట్టూ తిరిగే పనే లేకుండా..మీరు ఇంట్లో కూర్చునే మీ మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు! ఈ అద్భుతమైన సేవలను బ్యాంకులు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నాయి. గరిష్టంగా మీ మొబైల్ నంబర్‌కు వచ్చే ఎస్ఎంఎస్ ఛార్జీలు (రూ.1 నుంచి రూ.3 వరకు) మించి ఒక్క రూపాయి ఉండదు! కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే నామమాత్రపు సర్వీస్ ఫీజు రూ.10 లోపు ఉండొచ్చు. ఇంతకీ ఇంటి నుంచే మీ బ్యాంక్ మొబైల్ నంబర్‌ను క్షణాల్లో మార్చుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.

1. నెట్ బ్యాంకింగ్ మ్యాజిక్:

ముందుగా మీ బ్యాంక్ అధికారిక నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి. హోమ్‌పేజీలో మెరిసే ‘Profile’ లేదా ‘Personal Details’ సెక్షన్‌కు వెళ్లండి. అక్కడ ‘Contact Details’ లేదా ‘Update Mobile Number’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి. మీ కొత్త మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి..పాత లేదా కొత్త నంబర్‌కు వచ్చే ఓటీపీతో వెరిఫై చేయండి. మీ డెబిట్ కార్డ్ వివరాలు లేదా నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ ఉంటే చాలు.. ఈ ప్రాసెస్ నిమిషాల్లో పూర్తవుతుంది!

Advertisement

2.ఏటీఎం సెంటర్ ట్రిక్:

మీ సమీపంలోని మీ బ్యాంక్ ఏటీఎం సెంటర్‌కు వెళ్లండి. మీ ఏటీఎం కార్డ్‌ని స్వైప్ చేసి..మీ సీక్రెట్ పిన్ నంబర్ ఎంటర్ చేయండి. స్క్రీన్‌పై కనిపించే ఆప్షన్లలో ‘Banking’ లేదా ‘Registration/Services’ ఆప్షన్‌ను క్లిక్ చేయండి. అందులో ‘Mobile Number Registration’ లేదా ‘Change Mobile Number’ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. మీ పాత నంబర్, ఆ తర్వాత కొత్త నంబర్‌ను ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి. రెండు నంబర్లకు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే మీ అప్‌డేట్ సక్సెస్ అయినట్లే.

Advertisement

Also Read: అమెజాన్ సేల్ షాకింగ్ ఆఫర్..రూ.9 వేలకే బ్రాండెడ్ ట్రెడ్‌మిల్స్,మిస్ అయితే అంతే!

3.మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ :

ఎస్బీఐ (SBI), హెచ్‌డీఎఫ్‌సీ (HDFC),ఐసీఐసీఐ (ICICI)వంటి ప్రముఖ బ్యాంకుల అధికారిక మొబైల్ యాప్స్ (Yono, iMobile మొదలైనవి)ద్వారా కూడా ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళ్లి డైరెక్ట్‌గా నంబర్ మార్చుకోవచ్చు. ఆధార్ బేస్డ్ ఈ-కేవైసీ (e-KYC)సపోర్ట్ ఉంటే ఈ ప్రక్రియ మరింత వేగంగా పూర్తవుతుంది.

ఒకవేళ ఈ డిజిటల్ పద్ధతులు చేయడం కొత్తగా అనిపిస్తే.. మీ బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్‌ను సంప్రదించవచ్చు లేదా రిజిస్టర్డ్ మెయిల్ ద్వారా మార్గదర్శకాలు పొందొచ్చు. అయితే.. సమయాన్ని ఆదా చేసుకుంటూ.. అత్యంత ఈజీగా పని పూర్తి కావాలంటే.. మాత్రం ఇంట్లో ఉండే నెట్ బ్యాంకింగ్ లేదా ఏటీఎం పద్ధతే బెస్ట్.

Related News

ఒక్క ఏడాదిలోనే రూ.3.2 లక్షల నుంచి రూ.40 లక్షల ప్యాకేజీకి.. ప్రభుత్వ కాలేజీ విద్యార్థి కెరీర్ సూపర్ ఫాస్ట్

గోల్డ్ లోన్ చెల్లించినా మీ బంగారాన్ని బ్యాంక్ తిరిగి ఇవ్వకపోతే ఏం చేయాలి? ఇది తెలుసుకోండి

పదేళ్ల తర్వాత ఆదివారం బ్యాంకులు ఓపెన్.. నగదు విత్‌డ్రా పరిమితులు తొలగింపు, సమ్మెలో 7.5 లక్షల మంది

ఆన్‌లైన్‌లో తప్పుడు ప్రొడక్ట్ వచ్చిందా?రిటర్న్ చేసే ముందు ఈ తప్పులు చేయొద్దు!

ఇల్లు ఖాళీ చేసాక ఓనర్ డిపాజిట్ ఇవ్వట్లేదా? మీ డబ్బును తిరిగి పొందే సింపుల్ టిప్స్

చాక్లెట్ల పేరుతో ఆటపట్టించి.. ఉద్యోగులకు ఐఫోన్ గిఫ్టులు.. ఈ బాస్ బంగారం బాబోయ్!

కిరోసిన్ దీపం వెలుగులో చదివి రూ.20 లక్షల సాలరీ జాబ్.. వ్యవసాయ కూలీ బిడ్డ ఐపిఎస్ ఆఫీసర్

Big Stories

Advertisement
×