E-Paper
Advertisement

కారుపై ఏకంగా 20 టన్నుల రాళ్లు.. టాటా ఏరిస్ బలం చూపించేందుకు మైండ్ బ్లోయింగ్ టెస్ట్!

కారుపై ఏకంగా 20 టన్నుల రాళ్లు.. టాటా ఏరిస్ బలం చూపించేందుకు మైండ్ బ్లోయింగ్ టెస్ట్!
Advertisement

Tata Aeris Durability Test: కారు బిల్డ్ క్వాలిటీ ఎంత బలంగా ఉందో తెలుసుకోవడానికి సాధారణంగా క్రాష్ టెస్టులు నిర్వహిస్తారు. అయితే, టాటా మోటార్స్ కొత్త ఏరిస్ సెడాన్ విషయంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తుంది. ఏకంగా ఒక డంప్ ట్రక్ నుంచి సుమారు 20 టన్నుల రాళ్లు, కంకర, మట్టిని కారుపైకి కుమ్మరించి దాని బలం ఏంటో చూపించే ప్రయత్నం చేసింది. ఈ టెస్ట్ ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కారుపైకి 20 టన్నుల రాళ్లు, మట్టి

తాజాగా నిర్వహించిన ఈ టెస్ట్ లో ఎరుపు రంగులో ఉన్న టాటా ఏరిస్ సెడాన్‌ను ఒక చోట నిలిపారు. అనంతరం భారీ డంప్ ట్రక్‌ ను కారు దగ్గరికి తీసుకొచ్చి, అందులో ఉన్న రాళ్లు, కంకర, మట్టిని నేరుగా ఏరిస్ పై కుమ్మరించారు. ఒక్కసారిగా భారీ మొత్తంలో రాళ్లు రప్పలు కారుపై పడటంతో ఏరిస్ పూర్తిగా వాటి కింద కూరుకుపోయింది. సాధారణంగా ఇంత బరువు ఒక వాహనంపై పడితే దాని నిర్మాణంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే, ఈ కారు ప్యాసింజర్ క్యాబిన్ నిర్మాణం ఒత్తిడికి గురి కాలేదు. స్వల్పంగా ధ్వంసం అయ్యింది. అద్దాలు, చిన్న చిన్న భాగాలు దెబ్బతిన్నాయి.

డోర్లు ఓపెన్.. ఇంజిన్ స్టార్ట్

Advertisement

టెస్ట్ లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కారు మీద పడిన రాళ్లను తొలగించిన తర్వాత ఏరిస్ డోర్లు ఈజీగా ఓపెన్ అయ్యాయి. అంతేకాదు, కారు ఇంజిన్‌ను కూడా ఎలాంటి సమస్య లేకుండా స్టార్ట్ అయ్యింది. దీంతో కారు బాడీ నిర్మాణం భారీ బరువును తట్టుకునేలా రూపొందించామని కంపెనీ ఈ టెస్ట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ప్రయాణికులు కూర్చునే ప్రాంతాన్ని రక్షించే నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు ఈ పరీక్ష ద్వారా వెల్లడించింది.

ఏరిస్‌పై హారియర్ ఈవీ!   

ఏరిస్ నిర్మాణ బలాన్ని చూపించేందుకు మరో ప్రదర్శన కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. సుమారు 2,300 కిలోల బరువున్న టాటా హారియర్ ఈవీని ఏరిస్ పైభాగంలో నేరుగా ఉంచారు. ఈ టెస్ట్ లో ఏరిస్ బాడీ ఎంత బరువును మోయగలదనే అంశాన్ని హైలైట్ చేయాలని కంపెనీ ప్రయత్నించింది. ఒక సెడాన్‌పై ఇంత భారీ వాహనాన్ని ఉంచడం కూడా కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించింది.

ఆటో అభిమానుల్లో చర్చ!

Advertisement

ఈ టెస్ట్ ఆటోమొబైల్ అభిమానులను ఆకట్టుకుంటుంది. వాహన నిర్మాణంలో బలమైన స్టీల్, దృఢమైన ఇంజినీరింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చినందుకు టాటాను ప్రశంసించారు. భారతీయ కార్ల నిర్మాణ నాణ్యతపై అవగాహన పెంచే ప్రయత్నంగా దీనిని కొందరు అభివర్ణించారు. అయితే, ఈ పరీక్షపై మరో అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. రాళ్లు, కంకరను అధిక వేగంతో, ఎక్కువ ఎత్తు నుంచి పడేయకుండా తక్కువ ఎత్తు నుంచి పడేశారని కొందరు ఆటో పరిశీలకులు చెబుతున్నారు. అందువల్ల దీనిని సాధారణ హైస్పీడ్ క్రాష్ టెస్టుతో పోల్చడం సరైనది కాదని  అభిప్రాయ పడుతున్నారు. ఇలాంటి పరీక్ష కారు భద్రతను పూర్తిగా నిర్ధారించదంటున్నారు. నిజమైన క్రాష్‌లో వాహనం ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడానికి నిర్దిష్ట ప్రమాణాలతో నిర్వహించే క్రాష్ టెస్టులు, ఇతర భద్రతా పరీక్షలు అవసరం అంటున్నారు.

Read Also: చిన్న కార్ల కోసం సుజుకి మాస్టర్ ప్లాన్.. ‘రీవ్ లైట్’ హైబ్రిడ్ వచ్చేస్తోంది!

Tags

Related News

చిన్న కార్ల కోసం సుజుకి మాస్టర్ ప్లాన్.. ‘రీవ్ లైట్’ హైబ్రిడ్ వచ్చేస్తోంది!

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ ఎంట్రీ డేట్ ఫిక్స్.. ధర అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే?

మహీంద్రా విజన్ ఎస్ వచ్చేస్తోంది.. కనెక్టెడ్ టెయిల్‌లైట్లతో అదిరిపోయే లుక్!

టాటా ఏరిస్ విడుదల.. రూ.5.29 లక్షలకే కొత్త సెడాన్!

రైడర్లకు పండుగే పండుగ.. అక్టోబర్‌ లో 5 కొత్త బైక్‌ల ఎంట్రీ!

టాటా To హ్యుందాయ్.. అక్టోబర్‌ లో విడుదలయ్యే సూపర్ మోడల్స్ ఇవే!

అక్టోబర్‌ లో కొత్త స్కూటర్ల జాతర.. హోండా, యమహా నుంచి క్రేజీ మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×