Big Stories

Nijjar Killing: నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం లేదనుకోలేం.. కెనడా ప్రధాని ట్రూడో

Canada PM Trudeau
Canada PM Trudeau

Nijjar Killing: కెనడా మరోసారి భారత్ పైన నోరుపారేసుకుంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని మరోసారి కెనడా విమర్శలు చేసింది. అయితే ఇప్పటికే ఈ విషయంలో రెండు దేశాల మధ్య దౌత్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే నిజ్జర్ ను భారత్ నే హత్య చేసిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఖలిస్థానీ ఉగ్రవాది హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం లేదనే విషయాన్ని తేలిగ్గా కొట్టి పారేయలేమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. విదేశీ ప్రభుత్వాలు తమ దేశ పౌరులపై దాడిచేస్తే వారిని కాపాడుకునే బాధ్యత తమపై ఉందన్నారు. కెనడా గడ్డపై మన పౌరుడి హత్య జరగడం అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని వెల్లడించారు. అయితే ఈ కేసులో ట్రూడో మరోసారి భారత్ ను తప్పుబట్టారు.

- Advertisement -

కెనడాకు చెందిన ఓ కేబుల్ పబ్లిక్ అఫైర్స్ మీడియా ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ట్రూడో భారత్ పై తనకున్న విద్వేషాన్ని మరోసారి వెళ్లగక్కారు. నిజ్జర్ హత్యు కేసులో భారత్ ప్రభుత్వంతో కలిసి కెనడా ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందన్నారు. అయితే ఈ కేసులో భారత్ అందిస్తున్న సహకారంపై ఆయన ఈ విధంగా స్పందించారు.

నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందని గతంలో ఆరోపణలు వచ్చాయని.. దాన్ని తేలికగా కొట్టి పారేయలేమన్నారు. ప్రస్తుతం ఈ కేసులో కెనడా ప్రభుత్వం మరింత లోతుగా దర్యాప్తు చేస్తుందని తెలిపారు. తమ దేశ పౌరులు ఏ అంతర్జాతీయ శక్తుల జోక్యానికి గురికాకుండా చూసుకునే బాధ్యత తమదేనన్నారు.

Also Read: Argentina New President: 70 వేల మంది ఉద్యోగులపై వేటు.. అర్జెంటీనా అధ్యక్షుడు షాకింగ్ డెసిషన్.. ఎందుకంటే?

అయితే గతేడాది జూన్ లో ఖలిస్థానీ ఉగ్రవాది అయిన నిజ్జర్ కెనడాలో దారుణ హత్యకు గురయ్యారు. అప్పట్లో నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలు కారణంగా రెండు దేశాల మధ్య విభేదాలు చెలరేగాయి. కెనడా ప్రభుత్వం చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం తిప్పికొట్టింది. ఈ హత్య కేసుకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు సమర్పించిన తర్వాతనే దీనిపై భారత్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News