BigTV English

Cockroaches In Dosa :ప్లెయిన్​ దోశ ఆర్డర్​ చేస్తే.. బొద్దింకల దోశ ఇచ్చారు!

Cockroaches In Dosa :ప్లెయిన్​ దోశ ఆర్డర్​ చేస్తే.. బొద్దింకల దోశ ఇచ్చారు!
Cockroaches In Dosa
Cockroaches In Dosa

Cockroaches In Dosa : మనలో చాలా మంది ఫ్రీ టైమ్ ఉంటే ఫ్యామీలీ లేదా ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేయాలని చూస్తారు. ఆ సమయంలో వారితో కలసి అలా సరదాగా హోటల్స్ లేదా రెస్టారెంట్లకు వెళ్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొన్ని ప్రదేశాలు చాలా దరిద్రంగా ఉంటాయి. ఇక ఫుడ్ ప్రిపేర్ చేసే ప్లేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడున్న వంటవాళ్ల తీరు వర్ణించలేనిది.


ఇక కొన్ని హోటల్స్‌లో ఫెడ్ ఆర్డర్ చేస్తే వాళ్లు మనకు ఫుడ్‌తో పాటుగా మరచిపోలేని గిఫ్ట్ ఇస్తుంటారు. గిఫ్ట్ అంటే మీరు అనుకునేది కాదు.. బల్లులు, పురుగులు, బొద్దింకలు వంటివి అనమాట. ఇలాంటి ఘటనలు వార్తల్లో చాలానే నిలిచాయి.

Also Read : స్కూటీతో గాల్లో డ్రైవింగ్.. రూఫ్‌పై పార్కింగ్!


గతేడాది ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల్లో ఓ కుటుంం 5 స్టార్ హోటల్‌‌కి వెళ్లి సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేయగా.. వారు వేడివేడి సాంబార్ ఇడ్లీ, విత్ బల్లిని కలిపి ఇచ్చారు. వారు ఇదేంటని ప్రశ్నించగా దబాయించి దొబ్బేయ్ మన్నారు. దీంతో పెద్ద గొడవే జరిగింది. అప్పడు ఆ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫుడ్ సెఫ్టీ అధికారులు ఇలాంటివి జరగ్గానే ఏదో నామమాత్రంగ తనిఖీలు చేపట్టారు. తర్వాత అంతా మామూలే. తాజాగా ఇలాంటి కోవకు చెందిన ఘటన సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్‌చల్ చేస్తుంది. అదేంటో చూసేయండి.

ఈ తాజా ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. కన్నాట్ ప్లేస్‌లో ఉన్న మద్రాస్ కాఫీ హౌస్‌లో ఇషాని అనే మహిళ తన మిత్రుడుతో కలిసి వెళ్లింది. బారర్ వచ్చి మేడం ఆర్టర్ అన్నాడు. సాదా దోశ తెమ్మని చెప్పింది. చాలా సేపటి తర్వాత సర్వర వచ్చి దోశలను మేడం ముందు పెట్టాడు.

ఇక ఆలస్యం ఎందుకు మిత్రమా.. కమాన్ తిందామంటూ దోశలను ఇష్టంగా చూశారు. ఇంతలో దోశలో వారికి ఏదో తలుక్కుమంది. ఏంటా అదని నిశితంగా పరిశీలించగా.. అది బొద్దింకగా తేలింది. పోన్లే ఒక బొద్దంకే కదా అనుకుంటే మొత్తం ఎనిమిది ఉన్నాయి.

వెంటనే ఆ మహిళ ఆలస్యం చేయకుండా ఫుల్ ఫైర్‌తో ఈ ఘటన మొత్తాన్ని రికార్డ్ చేసి హోటల్ సిబ్బందిపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సిబ్బంది అక్కడికి చేరుకొని బొద్దింక దోశలను క్లీన్ చేశారు. మహిళ ఇంతలో ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె మాట్లాడుతూ దోశలు చాలా స్మెల్ వస్తున్నాయని, పాడైపోయాయని చెప్పింది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ప్రజలు మండిపడుతున్నారు.

Also Read : వడపావ్ అమ్ముతూ ఏడుస్తున్న చంద్రికా గేర్ దీక్షిత్‌.. అసలు కథ తెలిస్తే షాకే!

దేశ రాజధాని ఢిల్లీకి ప్రతి రోజు లక్షలాదిమంది వెళుతుంటారు. ఇలాంటి ప్రదేశాల్లో ఉన్న హోటల్స్ నిర్వహణ ఇలా ఉండటం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు హోటల్స్, ఫుడ్ కోర్టులపై నిఘా పెంచాలని అంటున్నారు. ఇవి తింటే కస్టమర్ల ప్రాణాలకు ప్రమాదం కాదా అంటూ కామెంట్ చేస్తున్నారు.

Tags

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×