LPG Prices: దేశంలో ప్రతి నెలలో మొదటి రోజన గ్యాస్ ధరల్లో జరిగే మార్పు విషయంలో కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. ఈసారి ఏప్రిల్ 1, 2025తో ప్రారంభమైన నెలలో గ్యాస్ ధరలు తగ్గాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధరను రూ.41 తగ్గించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ఈ సిలిండర్ రిటైల్ అమ్మకపు ధర రూ.1,762కి చేరుకుంది. ఈ తాజా తగ్గింపు చాలా మంది హోటల్ వ్యాపారులు సహా పలువురికి ఉపశమనం కలిగించనుంది.
వాణిజ్య LPG ధరలు ఆయా నగరాలను బట్టి మారుతుంటాయి. పలు ప్రధాన నగరాల్లో ఉన్న తాజా ధరలు
-హైదరాబాద్ లో రూ. 1,985.50 (గతంలో రూ.2029.50)
-ఏపీ అమరావతిలో రూ. 1,921 (గతంలో రూ.1965.50)
-ఢిల్లీలో రూ. 1,762 (గతంలో రూ.1,803)
-కోల్‌కతాలో రూ. 1,872 (గతంలో రూ.1,913)
-ముంబైలో రూ.1,714.50 (ఇదివరకు రూ.1,755.50)
-చెన్నైలో రూ.1,924.50 (మునుపటి ధర రూ.1,965.50)
-ఈ ధరలు స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల కారణంగా మారుతుంటాయి.
డొమెస్టిక్ గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇక ప్రస్తుతం (ఏప్రిల్ 1, 2025) డొమెస్టిక్ 14.2 కేజీల గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గత కొన్ని నెలలుగా గృహ వినియోగ LPG ధరలు మారలేదు. వాణిజ్య రంగంలో ధరలు మారుతున్నప్పటికీ, గృహ వినియోగదారులకు స్థిరమైన ధరలతోనే సరఫరా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్ ధర రూ. 803 ఉండగా, ముంబైలో రూ.802.50, బెంగళూరులో రూ.805.50గా ఉంది. మరోవైపు చెన్నెలో రూ.818.50, కోల్ కతాలో రూ. 829, హైదరాబాద్ లో రూ.855, విజయవాడలో రూ.827.50, పాట్నాలో రూ.892, మణిపూర్ లో రూ.954.50గా ఉంది.
Read Also: Laptop Cooling Tips: మండు వేసవిలో మీ లాప్‌టాప్‌తో జాగ్రత్త..ఈ
గత నెలలో ధరలు
ఇటీవలి LPG ధరల హెచ్చుతగ్గులు గత నెల, మార్చి 1, 2025న, OMCలు ప్రధాన నగరాల్లో వాణిజ్య LPG సిలిండర్ ధరలను రూ. 6 పెంచాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయిన ఇండేన్ ప్రకారం, 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 1,797 నుంచి రూ. 1,803కి పెరిగిందని కంపెనీ పేర్కొంది. ఫిబ్రవరిలో రూ. 7 తగ్గింపు తర్వాత ఈ పెరుగుదల మార్కెట్‌లో కొనసాగుతున్న ధరలను ప్రభావితం చేసింది.
వాణిజ్య LPG ధరల గత సంవత్సరం మార్పులు
LPG ధరల్లో భారీ మార్పులు గత కొన్ని సంవత్సరాలుగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు మార్చి 2023లో వాణిజ్య LPG ధరలు ఒక్కసారిగా రూ.352 పెరిగాయి. దీంతో రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర వ్యాపారాల నిర్వహణ ఖర్చులు కూడా భారీగా పెరిగిపోయాయి. ఇది చిన్న, మధ్య తరహా వ్యాపారాలను తీవ్రంగా ప్రభావితం చేసింది.
ప్రధానంగా వాణిజ్య సంస్థలపై ప్రభావం
వాణిజ్య LPG ధరల హెచ్చుతగ్గులు ప్రధానంగా హోటళ్లకు, రెస్టారెంట్లకు, ఇతర వాణిజ్య సంస్థలకు నిరంతరం ప్రభావం చూపిస్తాయి. ఏప్రిల్ నెలలో వచ్చిన ధర తగ్గుదల కొంత ఉపశమనం కలిగించనప్పటికీ, గత నెలల్లో జరిగిన పెరుగుదల వ్యాపార నిర్వహణ ఖర్చులను మరింత పెంచింది. ఈ రేట్ల తగ్గింపు వల్ల వంట ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.
వినియోగదారులకు సూచనలు
తాజా LPG ధరల గురించి తెలుసుకుని అప్రమత్తంగా ఉండండి. మీ స్థానిక గ్యాస్ సరఫరాదారున్ని సంప్రదించి అప్‌డేట్ గురించి తెలియజేయండి. ధరల హెచ్చుతగ్గులను ముందుగా అంచనా వేసుకుని, వ్యాపార ఖర్చులను సర్దుబాటు చేసుకోండి