BigTV English

OTT Movie : బట్ట, పొట్ట ఉన్నవాడితో బుట్టబొమ్మ పెళ్లి… భర్తను వదిలేసి మరో కుర్రాడితో పిల్ల యవ్వారం

OTT Movie : బట్ట, పొట్ట ఉన్నవాడితో బుట్టబొమ్మ పెళ్లి… భర్తను వదిలేసి మరో కుర్రాడితో పిల్ల యవ్వారం

OTT Movie : రొమాంటిక్ సినిమాలంటే మొదటిగా గుర్తుకు వచ్చేది హాలీవుడ్ సినిమాలే. ఈ సినిమాలలో కొన్ని సీన్స్ కోసం ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. వాటి కోసమే మళ్లీ మళ్లీ ఈ సినిమాలను చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో రొమాంటిక్ సన్నివేశాలతో పాటు, లవ్ స్టోరీ కూడా ఉంటుంది. పెళ్లి కాకుండానే హీరోయిన్ ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ తర్వాత స్టోరీ చాలా మలుపులు తిరుగుతుంది. ఈ రొమాంటిక్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే …


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ రొమాంటిక్ ఫ్రెంచ్ మూవీ పేరు ‘ది వెల్ డిగ్గర్స్ డాటర్'(The Well Digger’s Daughter). దీనికి డానియల్ ఆట్యూయ్ దర్శకత్వం వహించారు. ఇది మార్సెల్ పాగ్నోల్ రచించిన 1940ల నాటి నవల ఆధారంగా రూపొందించబడింది. ఈ మూవీ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, ఒక గ్రామీణ ఫ్రెంచ్ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీలోకి వెళితే

20వ శతాబ్దం ప్రారంభంలో ఈ మూవీ స్టోరీ, దక్షిణ ఫ్రాన్స్‌లోని ప్రోవెన్స్ ప్రాంతంలో జరుగుతుంది. పాస్కల్ అమోరెట్టి అనే సాధారణ వ్యక్తి, ఆరుగురు కుమార్తెలను పెంచుతూ ఉంటాడు. అతనికి బట్ట, పొట్ట ఉన్నా పెళ్ళాం మాత్రం అందంగా ఉంటుంది. అందుకే యుద్ధం చేసి,  ఆరుగురిని కంటాడు. అతని పెద్ద కుమార్తె పాట్రిసియా, 18 ఏళ్ల అందమైన, సున్నితమైన యువతి గా ఉంటుంది. ఆమె తన తండ్రి కష్టపడి పనిచేసే జీవనశైలికి భిన్నంగా పారిస్‌లో కొంత విద్యను అభ్యసిస్తుంది. ఒక రోజు పాట్రిసియా, జాక్వెస్ మజెల్ అనే ధనవంతుడైన ఆకర్షణీయమైన యువకుడిని కలుస్తుంది. అతను స్థానికంగా ఉండే ఒక వ్యాపారవేత్త కుమారుడు. ఇతడు పైలట్ ట్రైనింగ్ తెసుకుని ఉంటాడు. వారిద్దరూ ఒకరిపై ఒకరు ఇష్టాన్ని పెంచుకుంటారు. వారి సంబంధం త్వరగా బలపడి ప్రేమగా మారుతుంది. అయితే అప్పుడు ప్రపంచ యుద్ధం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో అధికారులు జాక్వెస్ ను యుద్ధానికి పిలుస్తారు. అతను యుద్ధానికి వెళ్లిపోయే ముందు, పాట్రిసియా అతనితో ఒక రాత్రి గడుపుతుంది.

కొంత కాలం తర్వాత, పాట్రిసియా గర్భవతి అని తెలుసుకుంటుంది. ఆ తరువాత జాక్వెస్ యుద్ధంలో మరణించినట్లు కూడా వార్తలు వస్తాయి. ఈ విషయం పాస్కల్‌కు తెలియడంతో, అతను కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. అదే సమయంలో జాక్వెస్ తల్లిదండ్రులు, పాట్రిసియా వల్లే తమ కుమారుడి ప్రమాదం జరిగిందని భావిస్తారు. ఆమెతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. ఆతరువాత పాట్రిసియా లైఫ్ లోకి మరొక వ్యక్తి వస్తాడు. ఆ తరువాత ఆమె లైఫ్ మరోలా మారుతుంది. చివరికి జాక్వెస్ మళ్ళీ తిరిగి వస్తాడా ? పాట్రిసియా మరి ఎవరితో ఉంటుంది ? పాట్రిసియా ప్రెగ్నెన్సీ కి కారణం ఎవరు? ఈ విషయాలు తెలుసుకోవాలి అంటే, ఈ రొమాంటిక్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

OTT Movie : హాంటెడ్ ప్లేస్ లో అమ్మాయి మిస్సింగ్… భయపెడుతూనే కితకితలు పెట్టే మలయాళ హర్రర్ మూవీ

OTT Movie : పిచ్చాసుపత్రిలో మెంటల్ ప్రయోగాలు… హిప్నటైజ్ చేసి మనుషుల మతిపోగోట్టే పాడు పనులు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్

OG Movie OTT: ఓజీ ఓటీటీ అప్డేట్.. ఎన్ని వారాల్లో వస్తుందంటే ?

OTT Movie : కిరీటం కోసం కొట్లాట… వేల ఏళ్ల పాటు వెంటాడే శాపం… మతిపోగోట్టే ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మహిళల్ని బలిచ్చి దిష్టి బొమ్మలుగా… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ సామీ

OTT Movie : జాబ్ ఇస్తామని చెప్పి దిక్కుమాలిన ట్రాప్… అలాంటి అమ్మాయిలే ఈ ముఠా టార్గెట్… క్రేజీ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×