BigTV English

Mahindra BE 6: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహీంద్రా BE6.. 135 సెకన్లలో కార్లన్నీ సేల్

Mahindra BE 6: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహీంద్రా BE6.. 135 సెకన్లలో కార్లన్నీ సేల్

Mahindra BE 6: దేశీయ ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా అగ్రస్థానం ఉంది. నూతన ఆవిష్కరణలతో వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంటూ ముందుకు సాగుతుంది. తాజాగా, తమ ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని మరింత విస్తరించడానికి మహీంద్రా ఒక సరికొత్త ప్రయత్నంతో ముందుకు వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్లోబల్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌తో కలసి, బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఈవీను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ప్రత్యేక మోడల్ డిజైన్, పనితీరు రెండింటిని కలిపి, వినియోగదారులకు సరికొత్త, అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చే విధంగా రూపొందింది.


సోషల్ మీడియాలో క్రేజ్- 135 సెకన్లలోనే 999 యూనిట్లు బుక్

బ్యాట్‌మ్యాన్ డార్క్ నైట్ థీమ్, ప్రత్యేక గ్రాఫిక్స్, ఇంటీరియర్ టచ్‌లు ఈ వాహనానికి అదనపు ఆకర్షణ ఇచ్చాయి. ప్రారంభంలో మహీంద్రా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను కేవలం 300 యూనిట్లకు పరిమితం చేయాలని నిర్ణయించింది. కానీ వినియోగదారుల ఆసక్తి, సోషల్ మీడియాలో క్రేజ్ చూసి, తక్షణమే 999 యూనిట్లకు విస్తరించాలని నిర్ణయించుకున్నారు. ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభమైన క్షణం నుంచి, కేవలం 135 సెకన్లలోనే మొత్తం 999 యూనిట్లు బుక్ అయ్యాయి. ఈ రికార్డు వేగం బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఈవీపై భారతీయ వినియోగదారుల ఎంతగానో అంచనాలు పెట్టారో, మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తిని చూపిస్తుంది.


ప్రత్యేక స్టైలింగ్ ఎలిమెంట్స్, లైటింగ్

బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఈవీలో డార్క్ కలర్ థీమ్‌తో ఒక సినిమాటిక్ అనుభూతిని ఇస్తుంది. బ్యాట్‌మ్యాన్ యూనివర్స్ ప్రేరణతో రూపొందించిన ప్రత్యేక స్టైలింగ్ ఎలిమెంట్స్, ప్రత్యేక లైటింగ్ సెటప్ వాహనాన్ని మరింత ప్రత్యేకతతో నిలబెడుతున్నాయి. ఇది సాధారణ ఈవీ మోడల్స్ కంటే భిన్నంగా, ఆటోమొబైల్ డిజైన్,ఎంటర్‌టైన్‌మెంట్ కల్చర్‌ రెండింటిని కలిపి చేసిన ప్రత్యేక మోడల్‌గా నిలిచింది.

Also Read: Ganesh Chaturthi Hyderabad: హైదరాబాద్‌లో వర్షం బీభత్సం.. వినాయకచవితి వేడుకలకు ఆటంకం

79కే డబ్లూహెచ్ బ్యాటరీ ప్యాక్‌..

పవర్, పనితీరు పరంగా చూస్తే, 79కే డబ్లూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది 286బీహెచ్‌పీ శక్తి, 380 ఎన్‌ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్పోర్టీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలా డ్రైవ్ ఫీలింగ్ ఇస్తుంది. పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు ఏఆర్ఏఐ ధృవీకరణ ప్రకారం 682 కిలోమీటర్ల రేంజ్ కలిగినప్పటికీ, నిజ జీవిత డ్రైవ్‌లో, ఎయిర్ కండిషనింగ్ ఆన్‌లో కూడా 500 కి.మీ.కి పైగా రేంజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది.

20 నిమిషాల్లోనే బ్యాటరీ 20% నుండి 80% వరకు ఛార్జ్

ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న డీసీ ఛార్జర్ ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే బ్యాటరీని 20% నుండి 80% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక పనితీరు, ప్రత్యేక డిజైన్, అరుదైన లిమిటెడ్ ఎడిషన్ స్థాయి అన్నీ కలిపి బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఈవీని భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపుగా నిలబడింది.

డెలివరీలు సెప్టెంబర్ 20

డెలివరీలు సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభమవుతాయి. ధర రూ. 27.79 లక్షల ఎక్స్-షోరూమ్. మొత్తం మూడు వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉండే ఈ లిమిటెడ్ ఎడిషన్ ప్రతి ఒక్కదానికీ ప్రత్యేక డిజైన్ టచ్‌లను కలిగి, వినియోగదారులకు ఒక అద్భుతమైన వ్యక్తిగత అనుభవాన్ని అందిస్తుంది. మహీంద్రా బీఈ 6 బ్యాట్‌ మ్యాన్ ఎడిషన్ ఈవీ ఇది కేవలం ఒక కారు మాత్రమే కాకుండా, టెక్నాలజీ, డిజైన్, ఎంటర్‌టైన్‌మెంట్ కల్చర్‌ను కలిపి చేసిన ప్రత్యేక అనుభవం. భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో లిమిటెడ్ ఎడిషన్ ఈవీలలో బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఒక కొత్త చరిత్రను సృష్టించింది.

Related News

D-Mart: ఏంటీ? డిమార్ట్ నుంచి డబ్బులు కూడా సంపాదించవచ్చా? ఇంత సులభమా!

Investment Formula: రూ. 1.2 కోట్ల అప్పుల తీర్చి.. రూ. 5 కోట్ల సంపాదించి.. ఏం ప్లాన్ గురూ!

Americans Investments: బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా చేతినిండా సంపద.. అమెరికన్ల బుర్రే బుర్ర!

Maruti Suzuki e-Vitara: ప్రధాని మోదీ చేతుల మీదుగా.. మారుతీ సుజుకీ ఈవీ కారు, టార్గెట్ 100 దేశాలు

Gold Rates Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా?

Big Stories

×