BigTV English

MG Cloud EV Launching Soon: ఎంజీ మోటార్ నుంచి కొత్త ఈవీ.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 460 కి.మీ మైలేజీ.. స్పెసిఫికేషన్స్ బ్లాక్ బస్టర్!

MG Cloud EV Launching Soon: ఎంజీ మోటార్ నుంచి కొత్త ఈవీ.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 460 కి.మీ మైలేజీ.. స్పెసిఫికేషన్స్ బ్లాక్ బస్టర్!

MG Cloud EV Launching in September 2024: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ ఎంజీ మోటార్స్ కొత్త కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను మార్కెట్‌లో పరిచయం చేస్తూ వాహన ప్రియులను అట్రాక్ట్ చేస్తుంది. సామన్యుల బడ్జెట్‌కు తగ్గ ధరలో రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఫీచర్ల విషయంలోనూ ఎక్కడా తగ్గడం లేదు. తమ వినియోగదారులకు మంచి అనుభూతిని అందించేందుకు సేఫ్టీ, డ్రైవింగ్ ఫీచర్లతో కొత్త కొత్త మోడళ్లను తీసుకొస్తుంది. అయితే ఇప్పటికే ఎన్నో రకాల మోడళ్లను తీసుకొచ్చిన టాటా మోటార్స్.. త్వరలో మరొక కొత్త ఎలక్ట్రిక్ వెహికల్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.


ఇందులో భాగంగానే కొత్త MG క్లౌడ్ EVని ఈ ఏడాది సెప్టెంబర్ రెండవ వారంలో భారతదేశంలో లాంచ్ చేయనుంది. ఈ ఈవీ దేశంలో MG మోటార్ ఇండియా మూడవ ఎలక్ట్రిక్ వాహనంగా రానుంది. ఈ క్లౌడ్ EV ఇప్పటికే అనేక సార్లు టెస్ట్ చేస్తున్న క్రమంలో బయటకనిపించింది. ఇప్పటికే లీక్ అయిన ఈ ఈవీ స్పెసిఫికేషన్ల ప్రకారం.. పెద్ద ఫ్రంట్, LED లైట్ ప్యాకేజీ, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, రూఫ్‌లైన్‌తో కూడిన క్రాస్ఓవర్ డిజైన్‌ను ఈ కారు కలిగి ఉంది.

Also Read: సెలబ్రిటీల కళ్లన్నీ ఈ కారు పైనే.. ఇప్పుడు నటుడు లారెన్స్ వంతు.. ఫీచర్లు మైండ్ బ్లోయింగ్!


ఈ క్లౌడ్ EV 4.3 మీటర్ల పొడవు, వీల్‌బేస్ 2.7 మీటర్లను కలిగి ఉంది. దీని ఫీచర్ లిస్ట్‌లో 360-డిగ్రీ కెమెరాలు, డ్యూయల్ డిజిటల్ స్క్రీన్‌లు, క్లైమేట్ కంట్రోల్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, పవర్డ్ సీట్లు, సన్‌రూఫ్ వంటివి ఉన్నాయి. ఇందులో 50.6kWh పవర్‌ట్రెయిన్‌తో అందించబడుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ క్లౌడ్ ఈవీ ఎలక్ట్రిక్ మోటారు వేరియంట్‌పై 460కిమీల మైలేజీని అందిస్తుంది.

ఈ EV ఇంకా MG అత్యంత ప్రీమియం మోడల్‌గా అంచనా వేయబడింది. ఈ ఈవీ రూ. 25-28 లక్షలతో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇది నేరుగా BYD e6తో పోటీపడుతుందని భావిస్తున్నారు. ఇది బర్న్-EV ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. కాగా ఇండోనేషియాలో క్లౌడ్ EVని మాతృ సంస్థ SAIC ద్వారా వులింగ్ బ్రాండ్ పేరుతో విక్రయిస్తారు. చైనాలో దీనిని బావోజున్ యుండువో అని పిలుస్తారు. భారతదేశంలో ఇది MGగా రీబ్యాడ్జ్ చేయబడుతుంది.

Also Read: Citroen C3 New Dhoni Edition: సిట్రోయెన్ నుంచి ధోని స్పెషల్ ఎడిషన్.. ఈ కార్లు కావాలంటే లక్ ఉండాలి!

దీని ప్రత్యేక డిజైన్ ఇంటీరియర్ ఫీచర్ల విషయానికొస్తే.. క్లౌడ్ EV దాని ప్రత్యేకమైన స్టైలింగ్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, క్లీన్ సర్ఫేసింగ్, ముందు వెనుక భాగంలో పూర్తి-వెడల్పు LED లైట్ బార్‌లు వంటి మినిమలిస్టిక్ డిజైన్ ఎలిమెంట్‌లను కలిగి ఉంది. లోపల క్లౌడ్ EV పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ADAS సూట్‌లో భాగంగా 360-డిగ్రీ కెమెరాను కూడా కలిగి ఉంది. క్లౌడ్ EV రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందుబాటులో ఉంది. అవి ఒకటి 37.9kWh ప్యాక్ 360km పరిధిని అందిస్తుంది. మరొకటి 50.6kWh ప్యాక్ 460km పరిధిని అందిస్తుంది.

Tags

Related News

BSNL Offer: రూ.107 నుంచే BSNL బడ్జెట్ ప్లాన్.. డేటా, కాల్స్, SMS అన్ని ఫ్రీ

Honda CB1000F New Bike: హోండా కొత్త బైక్.. మోడ్రన్ లుక్‌లో, ఓ రేంజ్‌లో ఫీచర్లు

Jio vs Airtel: జియో వర్సెస్ ఎయిర్‌టెల్.. 84 రోజుల రీచార్జ్ ప్లాన్‌లో ఎవరు బెస్ట్?

Amazon Diwali Offers: అమెజాన్‌ దీపావళి సేల్‌ మిస్ అవ్వొద్దు.. రూ.500లో బెస్ట్ ఇయర్‌బడ్‌ డీల్స్‌..

Flipkart Diwali Sale: కళ్లు చెదిరే ఆఫర్లతో ఫ్లిప్‌ కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్, ప్రారంభం ఎప్పుడంటే?

Today gold rate: ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Flipkart Offers: ఇంటి వద్దకే సరుకులు.. పైగా రూ.400 సేవింగ్.. ఫ్లిప్‌కార్ట్ కొత్త ఆఫర్ చూడండి!

Biggest Gold Market: మన దేశంలో అతిపెద్ద బంగారం హోల్ సేల్ మార్కెట్ ఎక్కడుందో తెలుసా..? ఇక్కడ నుంచే గోల్డ్ డిస్ట్రిబ్యూషన్

Big Stories

×