E-Paper
Advertisement

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ నాలుగో క్లౌడ్ రీజియన్ సెంటర్.. ఏఐ మౌలిక వసతులకు బూస్ట్

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ నాలుగో క్లౌడ్ రీజియన్ సెంటర్.. ఏఐ మౌలిక వసతులకు బూస్ట్
Advertisement

Hyderabad: భారతదేశంలో మైక్రోసాఫ్ట్ తన క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాలను భారీగా విస్తరిస్తోంది. పెరుగుతున్న డేటా సెంటర్ల అవసరాలు, ఏఐ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో నాలుగో క్లౌడ్ రీజియన్‌ సెంటర్‌ను సోమవారం ప్రారంభించింది. ఇండియా సౌత్ సెంట్రల్ పేరుతో కేంద్రం ఏర్పాటు చేసింది. దీంతో ఆ కంపెనీ క్లౌడ్ సేవలు బలోపేతం చేసింది.

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ నాలుగో క్లౌడ్ రీజియన్

మైక్రోసాఫ్ట్ గతంలో ప్రకటించినట్టుగా రాబోయే నాలుగేళ్లలో భారత్‌లో 20.5 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది ఇందులో భాగంగా సోమవారం తన నాలుగవ క్లౌడ్ రీజియన్‌గా హైదరాబాద్‌లో ఇండియా సౌత్ సెంట్రల్ క్లౌడ్ రీజియన్‌ను ప్రారంభించింది. ఇప్పటికే పూణె, చెన్నై, ముంబై నగరాల్లో ఆ సంస్థకు క్లౌడ్ రీజియన్లు ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంతో కలిపి దేశంలో అతిపెద్ద హైపర్‌స్కేల్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కలిగిన సంస్థగా నిలిచింది. క్లౌడ్ సామర్థ్యం, ఏఐ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కోసం ఏర్పాటు చేసింది.

2030 నాటికి  2 కోట్ల మందికి ట్రైనింగ్

Advertisement

ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రతినిధి పునీత్ చందోక్ మాట్లాడారు. ఈ పెట్టుబడి కేవలం మౌలిక సదుపాయాలకే పరిమితం కాదన్నారు. 2030 నాటికి భారత్‌లో 2 కోట్ల మందికి శిక్షణ ఇవ్వడానికి కంపెనీ కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే కోటి మందికి శిక్షణ ఇచ్చామని, ఏఐ శిక్షణ తర్వాత 1,25,000 మంది ఉద్యోగాలు పొందారని, పలువురు వ్యాపార సంస్థలను ప్రారంభించారని వివరించారు. ప్రపంచంలో అత్యధికంగా డేటాను ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలుస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న డేటాలో దాదాపు 20 శాతం భారత్ నుంచి వస్తుందన్నారు. కాకపోతే ప్రపంచ డేటా సెంటర్ల సామర్థ్యంతో పోల్చితే మన దేశ వాటా కేవలం 3 శాతం.

నీటి వినియోగం జీరో ఉండేలా ప్లానింగ్- మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రతినిధి పునీత్

ఆసియాలో మైక్రోసాఫ్ట్ రెండో వ్యూహాత్మక కేంద్రం హైదరాబాద్ రీజియన్ అని అన్నారు. దేశంలో మౌలిక సదుపాయాలు, కంప్యూట్-సామర్థ్యం కోసం చేస్తున్న అతిపెద్ద పెట్టుబడులలో ఇదొకటన్నారు. డేటా సెంటర్లను నిర్మించడం కాకుండా, మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవడం, అవసరమైన నైపుణ్యాలు ఉండడంతో కంపెనీ దృష్టి సారించిందని నొక్కి చెప్పారు. హైదరాబాద్ డేటా సెంటర్‌ను ఎయిర్-కూలింగ్ టెక్నాలజీని ఉపయోగించి నీటి వినియోగం సున్నాగా ఉండేలా రూపొందించినట్లు చందోక్ తెలిపారు. మైక్రోసాఫ్ట్ దేశంలో 1 GW గ్రీన్ ఎనర్జీ కోసం ఒప్పందం కుదుర్చుకుందని, అందులో 630 MW ఇప్పటికే అందుబాటులో ఉందన్నారు. సంస్థలు, ప్రభుత్వాలు ఏఐతో ప్రయోగాలు చేయడంతో దానిని పెద్ద ఎత్తున అమలు చేసే దిశగా పయనిస్తున్నామన్నారు.

Advertisement

ALSO READ: డ్రీమ్ హోమ్ కోసం లోన్ తీసుకుంటున్నారా? ఈ తప్పులు చేశారంటే..జీవితాంతం పశ్చాత్తాప పడాల్సిందే!

Related News

డ్రీమ్ హోమ్ కోసం లోన్ తీసుకుంటున్నారా? ఈ తప్పులు చేశారంటే..జీవితాంతం పశ్చాత్తాప పడాల్సిందే!

ఇండియాలో మాయమవుతున్న 1 BHK ఇళ్లు.. డిమాండ్ ఉన్నా నిర్మాణాలు తక్కువ.. కారణాలు ఇవే

ఈ రోజు రూ.50,000 బంగారంలో పెట్టుబడి పెడితే 10 ఏళ్ల తరువాత ఎంత వస్తుంది?

40 దాటిన ఉద్యోగుల్లో పెరుగుతున్న లేఆఫ్ భయం.. కార్పొరేట్ కంపెనీల్లో ఏం జరుగుతోందంటే?

బంగారం కొనేవారికి శుభవార్త.. ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ మార్కెట్లో ధరలు చూద్దాం

మంచి కార్పొరేట్ జాబ్ వదిలి వ్యవసాయం.. కట్ చేస్తే రూ.కోట్ల బిజినెస్‌ చేస్తున్న యువతి

టాటా సన్స్‌లో మళ్లీ ముసలం.. ట్రస్ట్ సంచలన ప్రకటన, చంద్రశేఖరన్ నియామకం చెల్లదు

Big Stories

Advertisement
×