E-Paper
Advertisement

రొయ్యలు, బిర్యానీలు తిని నీళ్లను రాయలసీమకు అప్పగించారు.. KCRపై జూపల్లి సంచలన వ్యాఖ్యలు!

రొయ్యలు, బిర్యానీలు తిని నీళ్లను రాయలసీమకు అప్పగించారు.. KCRపై జూపల్లి సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Jupally Krishna: సీఎల్పీ మీడియా హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఉద్యమ ఆకాంక్షలకు కేసీఆర్ నీళ్లు

Advertisement

తెలంగాణ పోరాటం అత్యంత పవిత్రమైనదని, అయితే ప్రజల ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ పాలన సాగలేదని మంత్రి జూపల్లి విమర్శించారు. కేసీఆర్ ఎంతో బాధ్యతారాహిత్యంగా రాష్ట్రాన్ని పాలించారని దుయ్యబట్టారు. పాలమూరు నీటి ప్రాజెక్టులపైన కేటీఆర్‌కు అసలు అవగాహన లేదని, కేసీఆర్‌కు అవగాహన ఉన్నప్పటికీ తెలంగాణ ప్రయోజనాల కోసం ఏనాడూ పనిచేయలేదని ఆరోపించారు.

రాయలసీమకు నీటి తరలింపుపై మండిపాటు

Advertisement

కేసీఆర్ తీరు వల్లే తెలంగాణ నీళ్లు రాయలసీమకు తరలిపోయాయని జూపల్లి ఆరోపించారు. రొయ్యలు, బిర్యానిలు తిని తెలంగాణ హక్కుగా రావాల్సిన నీటిని రాయలసీమకు అప్పగించారని విమర్శించారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నీటి కెపాసిటీ కేవలం 9 టీఎంసీలు మాత్రమేనని గుర్తుచేశారు. ఉన్న నీటిని కూడా ఇప్పుడే వదిలేస్తే.. వచ్చే ఏడు ప్రజలకు తాగునీరు ఎలా ఇస్తామని ప్రశ్నించారు. ‘మరి ప్రజలకు తాగునీళ్లు కూడా ఇవ్వొద్దని కేటీఆర్ చెబుతున్నారా?’ అని నిలదీశారు.

పాలమూరు నిర్లక్ష్యంపై నిలదీత

నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ తెచ్చుకున్నామని, నీళ్లను ఒడిసి పట్టుకోవాలని గతంలో చెప్పిన కేసీఆర్.. మరి జూరాల వద్ద నీటిని ఒడిసి పట్టుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదని జూపల్లి ప్రశ్నించారు. కేసీఆర్‌కు పాలనపై ఆలోచన లేదా, లేక అవగాహన కొరవడిందా అని ప్రశ్నించారు. పాలమూరు ప్రజల నీటి బాధలు చూడలేకే తెలంగాణ ఉద్యమం పుట్టిందని గొప్పలు చెప్పిన కేసీఆర్, పదేళ్ల తన పాలనలో ఆ బాధలకు ఎందుకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read: శ్రీశైలం మార్గంలో ఘోర ప్రమాదం.. క్రూజర్ ఢీకొని ఇద్దరు యూపీ వాసులు మృతి!

Tags

Related News

హుస్సేన్ సాగర్‌లోనే నిమజ్జనం జరపాలి.. కాంగ్రెస్, BRSల మధ్య క్విడ్ ప్రో కో ఉందా?- రాంచందర్‌రావు

శ్రీశైలం మార్గంలో ఘోర ప్రమాదం.. క్రూజర్ ఢీకొని ఇద్దరు యూపీ వాసులు మృతి!

దానం పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం.. బుధవారం విచారణ, నిర్ణయం ఎటువైపు?

బడా నేతల భూ భాగోతం అవుట్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

మలక్‌పేటలో విషాదం.. యువతికి వీడియో కాల్ చేసి..  కానిస్టేబుల్ ఆత్మహత్య!

ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో 388 ఎకరాల కబ్జాపై విచారణ జరపాలి: జనసేన

RTA లో అవినీతి దందా.. 9 ఏళ్లుగా ఒకే చోట తిష్ట!

Big Stories

Advertisement
×