Online Shopping New Rules: నిత్యం బిజీ లైఫ్‌తో కనీసం షాపింగ్‌కు వెళ్లే సమయం సామాన్యులకు దొరకడం లేదు. ఎంత ధర ఉంటే అంతకు కొనుగోలు చేస్తున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ తీవ్రమవుతున్న నేపథ్యంలో కీలక చర్యలు చేపట్టింది కేంద్రప్రభుత్వం. ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారి హక్కులను పరిరక్షించేందుకు వినియోగదారుల రక్షణ నిబంధనలు-2026 పేరుతో కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. వచ్చేఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇంతకీ కొత్త మార్గదర్శకాలు ఏంటి?
ఆన్‌లైన్ షాపింగ్ వల్ల కొన్ని క్లిక్‌లతో దేనినైనా కొనుగోలు చేయవచ్చు. కానీ ఆ సౌలభ్యంతోపాటు తేలికగా విస్మరించే కొన్ని అంశాలు ఉన్నాయి. ప్రతి ఆన్‌లైన్ కొనుగోలుదారులు మీ పేరు, ఫోన్ నంబర్, డెలివరీ చిరునామా, లాగిన్ వివరాలు, చెల్లింపు సమాచారం ఉంటుంది. అందుకే 2027-జనవరి ఒకటి నుండి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. వినియోగదారుల రక్షణ కొత్త నిబంధనలు- 2026 రానున్నాయి. ఈ నిబంధనలు ధరల నిర్ణయం, విక్రయాల వెల్లడింపులు, సెర్చ్ ర్యాంకింగ్‌లు, ప్రకటనలు, డార్క్ ప్యాటర్న్‌లు, వినియోగదారుల డేటా, ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలను కఠినతరం చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి అమ్మకం దారుడు తన వ్యాపార వివరాలు, చిరునామా, కస్టమర్ సర్వీస్ సమాచారం, రేటింగ్స్‌ను ప్లాట్‌ఫామ్‌పై తప్పక ప్రదర్శన ఉండాలి. ఖరీదైన వస్తువులు కొనేటప్పుడు వివరాలను పరిశీలించడం చాలా ముఖ్యం. డబ్బులు చెల్లించేటప్పుడు వెబ్‌సైట్ అడ్రస్ రెండుసార్లు చెక్ చేయాలి. మీరు షాపింగ్ చేస్తున్న ప్లాట్‌ఫామ్‌కు గుర్తింపు పొందిన పేమెంట్ ఉందా? లేదా? అనేది నిర్ధారించుకోవాలి. అదే సమయంలో వేరే పేజీకి వెళ్తే వెంటనే వెనక్కి వచ్చేయాలి. మీ ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితో షేర్ చేసుకోవద్దు.
ప్లాట్‌ఫామ్‌లు వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా సెర్చ్ ఫలితాలను మార్చకూడదని స్పష్టంచేసింది. సెర్చ్‌లో పై వరుసలో కనిపించిన ప్రతి వస్తువు నాణ్యమైనదిగా నమ్మకూడదు. అమ్మకం దారుడి వివరాలు, ఇతర వినియోగదారుల రివ్యూలను పరిశీలించడం మంచిది. కొన్ని ఉత్పత్తులు డబ్బులు చెల్లించడం ద్వారా సెర్చ్ ఫలితాల్లో తప్పనిసరిగా స్పాన్సర్డ్ లేదా ప్రకటన అని స్పష్టంగా ఉండాలి. పై స్థానంలో ఉన్న ఆ ఉత్పత్తి నమ్మకమైనదని భావించవద్దు. కేవలం ప్రకటన మాత్రమేనని గుర్తు పెట్టుకోవాలి. కస్టమర్లను తికమకపెట్టి అనవసరమైన కొనుగోళ్లకు సబ్‌స్క్రైబ్ చేయించే మోసపూరిత డిజైన్లను డార్క్ ప్యాటర్న్స్ అంటారు. వాటిని పూర్తిగా నిషేధించారు. అనుకోని పాప్-అప్‌లు, సున్నితమైన సమాచారం పట్ల జాగ్రత్తగా ఆన్ లైన్ వినియోగదారుడు ఉండాలి.
ALSO READ: పండగ సీజన్ వేళ కేంద్రం శుభవార్త.. వంట నూనె ధరలకు ఊరట!
కొనుగోలుకు సంబంధించి ఎంత సమాచారం అవసరమో అంతే ఇవ్వాలని, ప్లాట్‌ఫామ్‌లు ఏ సమాచారం అడుగుతున్నాయో గమనించాలి. అవసరం లేని వివరాలు, మీ షాపింగ్ ఖాతాలకు బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం ద్వారా మీ డేటాను సురక్షితంగా ఉంచుకోవచ్చు. కొనుగోలుకు సంబంధించిన ఇన్‌వాయిస్‌లు, ఆర్డర్ కన్ఫర్మేషన్ ఈ-మెయిల్స్, పేమెంట్ రసీదులు, అమ్మకందారులతో చేసిన చాటింగ్ ఉంచాలి. భవిష్యత్తులో ఏదైనా సమస్య వచ్చి ఫిర్యాదు చేయడానికి కీలకం కానున్నాయి. ఫిర్యాదు అందిన 48 గంటల్లోగా గ్రీవెన్స్ ఆఫీసర్ స్పందించి దాని రికార్డులు ఇవ్వాలి.