E-Paper
Advertisement

పెళ్లి కావాలి, పిల్లలు వద్దు.. గర్భసంచి అవసరం లేదు: స్నిగ్ధ!

పెళ్లి కావాలి, పిల్లలు వద్దు.. గర్భసంచి అవసరం లేదు: స్నిగ్ధ!
Advertisement

Actress Snigdha Nayani: టాలీవుడ్ ప్రేక్షకులకు నేచురల్ స్టార్ నాని నటించిన ‘అలా మొదలైంది’ సినిమాతో సుపరిచితురాలైన నటి, సింగర్ స్నిగ్ధ నయని (Snigdha nayani) తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పెళ్లి ఆలోచనల నుంచి మొదలుకొని, ఇండస్ట్రీలో ఉండే రాజకీయాల వరకు, అలాగే తన ఆరోగ్యం , వ్యక్తిగత అభిప్రాయాలపై ఆమె ఎటువంటి మొహమాటం లేకుండా ఓపెన్‌గా మాట్లాడారు. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూకి సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

అప్పుడే నా పెళ్లి – స్నిగ్ధ..

పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు స్నిగ్ధ స్పందిస్తూ.. తనకు సరైన పర్సన్ దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశారు. ఇద్దరి ఆలోచనలు కలిస్తేనే వివాహం గురించి ఆలోచిస్తానని తెలిపారు. ఇక జనాల విమర్శల గురించి మాట్లాడుతూ.. ఎవరైనా తన ఆరోగ్యం గురించి లేదా లావుగా ఉన్నావని చెబితే తాను నెగెటివ్‌గా తీసుకోనని, అందులో నిజం ఉంటే దానిని స్వీకరించి సరిదిద్దుకుంటానని చాలా మెచ్యూర్‌గా సమాధానమిచ్చారు.

పిల్లలు వద్దు.. గర్భసంచి అవసరం లేదు..

Advertisement

తాను దేవుణ్ణి ఎంతో నమ్ముతానని, దేవుడిని చూడగానే మనసుకు ఒక గొప్ప ఎనర్జీ వస్తుందని స్నిగ్ధ తెలిపారు. కేవలం కోరికలు కోరుకోవడానికి మాత్రమే కాకుండా, దేవుడంటే తనకు వ్యక్తిగతంగా ఎంతో ఇష్టమని చెప్పారు. అంతేకాకుండా తాను ప్రతి ఏటా శివమాల ధరిస్తానని, ఆ సమయంలో పీరియడ్స్ ఇబ్బంది రాకుండా ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ వాడతానని తెలిపారు. భవిష్యత్తులో పెళ్లి, పిల్లలు కావాలనుకునే వారికి గర్భసంచి అవసరమని, తనకు అలాంటి ఆలోచనలు లేనందున దాని గురించి పెద్దగా పట్టించుకోనని నిర్మొహమాటంగా చెప్పారు.

సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు :

ఇండస్ట్రీలో కొందరిని తొక్కేస్తుంటారని అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ఇది ఒక్క సినిమా రంగంలోనే కాకుండా ప్రతి రంగంలోనూ ఉంటుందని చెప్పారు. అయితే సినిమాలపై జనాలకు విపరీతమైన ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఇక్కడ జరిగే చిన్న విషయాలు కూడా బయటికి కనిపిస్తాయని తెలిపారు. ఇక తన సంపాదన గురించి చెబుతూ.. సినిమాలతో పాటు మ్యూజిక్ షోస్, కంపోజిషన్స్ ద్వారానే తన ప్రధాన ఆదాయం వస్తుందని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

ALSO READ: ఉప్పల్ బాలు వివాదంపై స్పందించిన అమర్‌దీప్ చౌదరి!

గతంలో తనకు లవ్వే లేదని చెప్పి, మరో ఇంటర్వ్యూలో రిలేషన్షిప్‌లో ఉన్నానని చెప్పడంపై అడిగిన ప్రశ్నకు ఆమె చాలా మెచ్యూర్‌గా బదులిచ్చారు. రిలేషన్షిప్స్ లేకుండా ఎలా ఉంటాయని, కొన్ని వర్కౌట్ అవుతాయని, కొన్ని వర్కౌట్ కావని చెప్పారు. ఇక మనకు నచ్చినంత మాత్రాన అవతలి వాళ్లకు మనం నచ్చాలని రూల్ లేదని, మంచిగా ఉన్నాక కూడా విడిపోయే వాళ్ళు ఉంటారని తెలిపారు. ప్రతి రిలేషన్షిప్‌లో ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదిరితేనే ముందుకు వెళ్తారని వివరించారు.

ఏ విషయాన్నైనా ముఖం మీద కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే స్నిగ్ధ స్వభావం మరోసారి ఈ ఇంటర్వ్యూ ద్వారా బయటపడింది. తన లోపాలను, వ్యక్తిగత అభిప్రాయాలను ఏమాత్రం దాచుకోకుండా చాలా బోల్డ్‌గా పంచుకున్న ఆమె తీరును నెటిజన్లు అప్రిషియేట్ చేస్తున్నారు.

Related News

చిరు – శ్రీకాంత్ ఓదెల సినిమా అటకెక్కినట్టేనా ?

ది ప్యారడైజ్ ఫస్ట్ చాయిస్ కయాదు కాదా? ఆమె రిజెక్ట్ చేస్తేనే ఛాన్స్ వచ్చిందా?

హీరో కాకపోతే నాని ఆ పని చేసేవాడా? చెప్తే లాజిక్ ఉండాలి బ్రో!

సుమలత వల్లే ఇన్ని సమస్యలు.. డాన్సర్స్ సమావేశంలో సీనియర్ మాస్టర్స్ ఫైర్!

మరో వివాదంలో ది ప్యారడైజ్..సమ్మక్క పాత్రను అవమానించారంటూ?

జూహీ చావ్లా ఆస్తులు డబుల్.. ఒక్క ఏడాదికి అన్ని కోట్లా..?

ఈ సంక్రాంతి మనదే.. కాకా పై చిరు అప్డేట్!

Big Stories

Advertisement
×