Tenant security deposit rights: మెట్రో నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు చాలా మంది అద్దె ఇళ్లలో ఉండటం అనేది సర్వసాధారణం .మనం అద్దెకు దిగేటప్పుడు.. ఇంటి యజమానికి భారీ మొత్తంలో సెక్యూరిటీ డిపాజిట్ (అడ్వాన్స్) చెల్లిస్తుంటాం. సాధారణంగా ఇది రెండు నుంచి పది నెలల అద్దెకు సమానంగా ఉంటుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే రూ.20,000 నుంచి రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్‌గా ఇస్తుంటాం.అయితే..ఇల్లు ఖాళీ చేసే సమయంలో ఈ డబ్బులను తిరిగి ఇవ్వడంలో చాలా మంది ఇంటి యజమానులు ఇబ్బందులు పెడుతుంటారు. అనవసరమైన సాకులు చెప్పి డబ్బులు ఇవ్వకుండా తిప్పుతుంటారు. మరి ఇలాంటి మోసాలను ఎదుర్కొని మీ డబ్బులు మీరు ఎలా దక్కించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది ఇల్లు మారేటప్పుడు సరైన రెంట్ అగ్రిమెంట్ రాసుకోకుండా.. కేవలం మాటల మీద డిపాజిట్ ఇస్తుంటారు. ఇదే అతిపెద్ద తప్పు.ఒకవేళ ఓనర్ మీ డిపాజిట్ డబ్బులు ఇవ్వకపోతే.. మీ దగ్గర లీగల్ ప్రూఫ్ ఉండదు. అందుకే.. రెంట్ అగ్రిమెంట్‌లో సెక్యూరిటీ డిపాజిట్ ఎంత చెల్లించారు, ఇల్లు ఖాళీ చేసే సమయంలో ఆ మొత్తాన్ని ఏ విధంగా పూర్తి స్థాయిలో తిరిగి ఇవ్వాలి అనే అంశాలను స్పష్టంగా రాయించుకోవాలి. అగ్రిమెంట్‌లో ఈ నిబంధనలు స్పష్టంగా ఉంటే యజమానులు డబ్బులు ఎత్తివేయడానికి సాహసించలేరు.
మనదేశంలో అద్దెదారుల హక్కులను కాపాడేందుకు అనేక చట్టాలు ఉన్నాయి. మోడల్ టెనెన్సీ యాక్ట్ ప్రకారం, ఇంటి యజమాని అద్దెదారు నుంచి తీసుకున్న.. సెక్యూరిటీ డిపాజిట్‌ను ఇల్లు ఖాళీ చేసిన వెంటనే లేదా గరిష్టంగా కొన్ని రోజుల్లోగా తిరిగి ఇవ్వాలి. ఒకవేళ ఇల్లు పాతబడినా లేదా సాధారణంగా గోడలకు అయిన చిన్నచిన్న మరమ్మతులకు కూడా అద్దెదారుల డిపాజిట్ నుంచి డబ్బులు కట్ చేయడానికి ఓనర్లకు చట్టపరంగా ఎలాంటి హక్కు లేదు.
Also read: హౌస్ వైఫ్స్ కోసం..లక్షల్లో ఆదాయం తెచ్చిపెట్టే బిజినెస్ ఐడియాలు!
ఒకవేళ ఇంటి యజమాని మీ ఫోన్‌లు ఎత్తకపోయినా.. లేదా డిపాజిట్ ఇవ్వడానికి నిరాకరించినా మీరు కింది చర్యలు తీసుకోవచ్చు.
లీగల్ నోటీసు: మీరు ఒక లాయర్ ద్వారా మీ ఇంటి యజమానికి అధికారికంగా.. లీగల్ నోటీసు పంపొచ్చు. ఈ నోటీసు అందిన తర్వాత మెజారిటీ ఓనర్లు భయపడి డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు.
రాతపూర్వక ఫిర్యాదు : ఒకవేళ ఓనర్ స్పందించకపోతే.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో రెంట్ అగ్రిమెంట్ కాపీతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయొచ్చు.
కన్స్యూమర్ ఫోరమ్ లేదా సివిల్ కోర్టు: అద్దెదారులు తమ హక్కుల కోసం కస్టమర్ల ఫోరమ్‌ను లేదా సివిల్ కోర్టును ఆశ్రయించి నష్టపరిహారంతో.. సహా డబ్బులను రాబట్టుకోవచ్చు. అయితే.. లీగల్ ఖర్చులు, సమయం దృష్టిలో పెట్టుకొని ముందుగా మధ్యవర్తుల ద్వారా మాట్లాడటం మంచిది.
ఇల్లు మారుతున్న సమయంలో.. అద్దెదారులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. డిపాజిట్ డబ్బులు పూర్తిగా చేతికి అందే .. వరకు ఇంటి తాళాలు ఓనర్‌కు అప్పగించకపోవడం లేదా ముందుగానే..క్లియర్ చేసుకోవడం బెస్ట్.మీ హక్కులు ఏంటో మీకు తెలిస్తే .. ఎవరూ మిమ్మల్ని మోసం చేయలేరు.