Youtuber Nandana:యూట్యూబర్ గా , నందూస్ వరల్డ్ అనే ఛానల్ తో భారీ పాపులారిటీ సంపాదించుకున్న నందన (Nandana) గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. సహజత్వానికి ఉట్టిపడే వీడియోలు చేస్తూ అందర్నీ ఆకట్టుకునే ఈమె సడన్గా విదేశాలలో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసి, మోసం చేశారనే ఆరోపణలతో వార్తల్లో నిలవడం సంచలనంగా మారింది. అంతేకాదు ఈమెను హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం కూడా తెలిసిందే. దీంతో ఎక్కడ చూసినా ఈమెను విమర్శించే వారి సంఖ్య సోషల్ మీడియాలో పెరిగిపోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తాజాగా ఈమె చేసిన ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యూట్యూబర్ రమా నందన తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో..” సెప్టెంబర్ 7న గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన సమయంలో నా జీవితంలో ఒక కఠినమైన పరిస్థితిని నేను ఎదుర్కొన్నాను .నా జీవితంలో నేను మరిచిపోలేని క్లిష్టమైన కఠినమైన సంఘటన అదే.. నేను ఏ టీవీ షో కోసమో ఇండియా రాలేదు. నిజానికి నేను ముందుగా ఈ పరిస్థితిని పరిష్కరించుకోవాలి అనుకున్నా.. అందుకే చాలా అవకాశాలు వదులుకున్నాను. నాకు ఏమాత్రం సంబంధం లేని విషయంలోకి నా పేరును, నా కుటుంబ పరువును వాడుకుంటూ లాగుతున్నందుకే ముందుకు వచ్చాను. నాకు నిజం తెలుసు కాబట్టి దానితో పాటు వచ్చే దేనినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టే.. నా అంతట నేనే ముందుకు వచ్చాను.
కాలక్రమేనా నిజాలు వాటంతటవే మాట్లాడుతాయి. నిజం బయటపడుతుంది . నిజంగా బాధ్యులైన వారిని జవాబుదారీగా చేస్తారు. ఇది గొడవ చేయడం కోసం కాదు.. కేవలం సత్యం కోసం నిలబడడం.. నా కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే.. నేను ఏడవచ్చు.. బాధపడవచ్చు.. కానీ నేను చేయని తప్పుకు ఎప్పటికీ తలవంచను. నేను విచారంగా ఉండవచ్చు. కానీ నన్ను నేను ఎప్పటికీ ఓటమికి గురి కానివ్వను. నేను ధైర్యంగా నిలబడతాను. నిజాన్ని ఎదుర్కొంటాను ” అంటూ నందన తెలిపింది.. ఇకపోతే ఎన్నో అవకాశాలు వదులుకున్నానని నందన చెప్పడంతో.. నిజంగానే ఈమె తనపై పడ్డ ఆరోపణలను చెరిపి వేయడానికి బిగ్ బాస్ ఆఫర్ ను వదులుకుందా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. యూట్యూబర్ రమా నందన, ఆమె భర్త మధుకర్ కి సంబంధించిన ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్లోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. యూకే లో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారంటూ కొందరు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు ఒక బాధితుడు తాను నందన ద్వారా మోసపోయానని, ఏకంగా 15 లక్షలు చెల్లించినట్లు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించినట్లు వార్తలు వినిపించాయి . అంతేకాదు ఒక వ్యక్తి తన కొడుకు , కోడలు వీరి చేతిలో మోసపోయారు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన వీడియోలు కూడా సంచలనంగా మారిన విషయం తెలిసిందే ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే నందన పై లుకౌట్ నోటీసులు జారీ అయినట్లు సమాచారం.
also read: వారణాసి కోసం పోటీ పడుతున్న బడా నిర్మాతలు?
కాగా రమానందన సెప్టెంబర్ 7న హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు లుక్ అవుట్ నోటీసుల ఆధారంగా ఈమెను గుర్తించి అనంతరం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత పోలీసుల నోటీసుల మేరకు నందన విచారణకు హాజరయ్యారు. సుమారుగా నాలుగు గంటల పాటు ఈమెను ప్రశ్నించినట్లు సమాచారం. డెస్టినీ కన్సల్టెన్సీ కి సంబంధించిన వ్యవహారాలపైనే పోలీసులు ఈమెను ప్రశ్నించారని తెలుస్తోంది. ఇకపోతే కన్సల్టెన్సీ వ్యవహారాలతో, తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ వ్యవహారాలను తన భర్త మధుకర్ చూసుకుంటారని, ఆమె విచారణలో వెల్లడించినట్లు వార్తలు వినిపించాయి. కొంతమంది తన ఎదుగుదలను ఓర్వలేక కావాలనే తనపై, తన కుటుంబం పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
?utm_source=ig_web_copy_link&stkn=NTc4MTIwNjQ2YQ==