E-Paper
Advertisement

Airtel యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. రూపాయి ఖర్చు లేకుండా యాపిల్ టీవీ+, iCloud ఫ్రీ!

Airtel యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. రూపాయి ఖర్చు లేకుండా యాపిల్ టీవీ+, iCloud ఫ్రీ!
Advertisement

Airtel Apple Offer: ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే గ్లోబల్ టెక్ దిగ్గజం ‘యాపిల్’ (Apple)తో కలిసి మరో క్రేజీ బహుమతిని యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఎంపిక చేసిన ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లపై ఎలాంటి అదనపు రుసుము లేకుండా ‘ఐక్లౌడ్ ప్లస్’ (iCloud+), యాపిల్ టీవీ+ (Apple TV+), యాపిల్ ఆర్కేడ్ (Apple Arcade) సబ్‌స్క్రిప్షన్లను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది.

200కి పైగా గేమ్స్ ఫ్రీ..

ఈ ఆఫర్ తో అర్హులైన యూజర్లు యాపిల్ క్లౌడ్ స్టోరేజ్‌తో పాటు, యాపిల్ ఒరిజినల్ కంటెంట్, 200కి పైగా గేమ్‌లను ఫ్రీగా ఆస్వాదించవచ్చని ఎయిర్ టెల్ తెలిపింది. ఇప్పటికే ఎయిర్‌టెల్ ప్లాన్ల ద్వారా ఆపిల్ టీవీ+ వాడుతున్న వారు కూడా ఈ కొత్త ఐక్లౌడ్ ప్లస్ బండిల్‌కి ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా అప్‌గ్రేడ్ కావచ్చని పేర్కొంది. ముఖ్యంగా ఎయిర్‌టెల్ రూ. 999, రూ. 1,199, రూ. 1,399, రూ. 1,749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనున్నట్లు స్పష్టం చేసింది.

ఆఫర్ ఎలా క్లెయిమ్ చేయాలి?

Advertisement

ఈ ఆఫర్‌ను పొందేందుకు యూజర్లు పైన పేర్కొన్న ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో ఏదో ఒకటి యాక్టివ్‌లో ఉంచుకోవాలి. అనంతరం ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ (iOS) ఫోన్లలోని ‘ఎయిర్‌టెల్ థాంక్స్’ (Airtel Thanks) యాప్‌లోకి వెళ్లి ప్రైమరీ కనెక్షన్ నంబర్ ద్వారా ఈ యాపిల్ బెనిఫిట్స్ ను సులభంగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, యాపిల్ యూజర్లు ఇద్దరూ ఈ ఆఫర్‌ను వినియోగించుకోవడానికి అర్హులేనని ఎయిర్ టెల్ వర్గాలు స్పష్టం చేశాయి.

ఏ ప్లాన్‌పై ఎలాంటి బెనిఫిట్స్?

ఇక ఎయిర్ టెల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ల విషయానికి వస్తే.. రూ. 999 ప్లాన్‌లో ఒక రెగ్యులర్ కనెక్షన్‌తో పాటు రెండు ఫ్రీ యాడ్-ఆన్ సిమ్‌లు లభిస్తాయి. అపరిమిత 4G, 5G డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ సదుపాయం ఉంటుంది. తాజాగా ప్రకటించిన యాపిల్ ప్రయోజనాలతో పాటు ఆమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే వంటి ఆఫర్లు కూడా ఇందులో యూజర్లకు లభిస్తాయి.

రూ.1,199, రూ.1,399 ప్లాన్స్

Advertisement

రూ.1,199 ప్లాన్‌లో పైన పేర్కొన్న రూ. 999 ప్లాన్ ప్రయోజనాలన్నీ లభిస్తాయి. అయితే ఇందులో ఒక రెగ్యులర్ కనెక్షన్‌తో పాటు మూడు ఉచిత యాడ్-ఆన్ సిమ్‌లను పొందవచ్చు. అటు రూ. 1,399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ లో రూ. 1,199 ప్లాన్‌ ప్రయోజనాలన్నింటితో పాటు, అదనంగా ఫ్రీ ‘నెట్‌ఫ్లిక్స్ బేసిక్’ (Netflix Basic) సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

Also Read: ఏడాదంతా ఫ్రీ కాల్స్, 5G డేటా.. Airtel, Jio, Viలో బెస్ట్ ప్లాన్స్ ఇవే.. ఎంజాయ్ పండగో!

రూ. 1,749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్‌లో ఇది అత్యంత ఖరీదైన ప్లాన్ గా చెప్పవచ్చు. ఇందులో ఒక ప్రైమరీ కనెక్షన్‌తో పాటు నాలుగు ఉచిత యాడ్-ఆన్ సిమ్‌లు లభిస్తాయి. నెట్‌ఫ్లిక్స్, ఐక్లౌడ్ బండిల్‌తో పాటు రూ. 3,000 విలువైన ఇంటర్నేషనల్ రోమింగ్ ప్రయోజనాలు కూడా ఇందులో యూజర్లు పొందొచ్చు.

Also Read: ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి.. ఈసారి ఎయిర్‌లైన్స్ వంతు, బుధవారం నుంచి కొత్త ఆంక్షలు

Tags

Related News

విండోస్‌కు చెక్ పెట్టేలా గూగుల్ నుంచి కొత్త ల్యాప్‌టాప్.. ఫీచర్లు చూస్తే కొనకుండా వదిలిపెట్టరు!

ఎప్పుడూ అదే గ్రీన్ స్క్రీన్‌తో బోర్ అనిపిస్తుందా? వాట్సప్‌లో రాబోతున్న ఈ కొత్త థీమ్స్ చూశారా?

ఏడాదంతా ఫ్రీ కాల్స్, 5G డేటా.. Airtel, Jio, Viలో బెస్ట్ ప్లాన్స్ ఇవే.. ఎంజాయ్ పండగో!

అమెజాన్‌ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో ఊహించని ఆఫర్లు.. ఈ కార్డ్ గనుక ఉంటే సగానికి పైగా డిస్కౌంట్!

మనిషి vs రోబోట్.. బాక్సింగ్ రింగ్‌లో బిగ్ ఫైట్.. సినిమా కాదండోయ్ నిజం!

ఈ ఎయిర్ ఫ్రైయర్ ఉంటే..నూనె లేకుండానే కరకరలాడే స్నాక్స్ రెడీ!

బడ్జెట్ ధరలో ఊరమాస్ సౌండ్! జెబ్రానిక్స్ స్పీకర్‌పై సూపర్ డీల్!

Big Stories

Advertisement
×