E-Paper
Advertisement

ఆర్టీసీ ప్రయాణికులకు తీపి కబురు.. ఇకపై హాయిగా ట్రావెల్ చేయవచ్చు, అసలు మేటరేంటి?

ఆర్టీసీ ప్రయాణికులకు తీపి కబురు.. ఇకపై హాయిగా ట్రావెల్ చేయవచ్చు, అసలు మేటరేంటి?
Advertisement

Hyderabad: తెలంగాణ ఆర్టీసీకి శుభవార్త. ముఖ్యంగా హైదరాబాద్‌ సిటీలో ఆర్టీసీ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్. కేంద్రం కేటాయించిన 2200 ఎలక్ట్రిక్‌ బస్సులు దశలవారీగా సిటీకి వస్తున్నాయి. ఈ క్రమంలో నవంబర్‌లో తొలి విడత 137 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఆ బస్సులు వస్తే ఇకపై హాయిగా ప్రయాణికులు జర్నీ చేయవచ్చు.

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు తీపి కబురు

హైదరాబాద్‌ సిటీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి శుభవార్త. తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత సిటీ, నార్మల్ బస్సుల్లో రద్దీ అమాంతంగా పెరిగింది. పెరిగిన రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం-ఆర్టీసీ చర్యలు చేపడుతూనే ఉంది. ఈ క్రమంలో పీఎం ఈ-డ్రైవ్‌ పథకం కింద ఎలక్ట్రిక్‌ బస్సులు వివిధ రాష్ట్రాలకు కేంద్రం కేటాయించింది. ఆయా బస్సులు నవంబర్‌ నుంచి అందుబాటులోకి రానున్నాయి.

నవంబర్ నుంచి అందుబాటులోకి కొత్త బస్సులు

Advertisement

నవంబర్‌లో 137 బస్సులు నగరానికి రానున్నాయి. విడతల వారీగా మిగతా అంటే 2028 జనవరి నాటికి 2200 బస్సుల పంపిణీ పూర్తి కానుంది. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే బస్సుల్లో ప్రయాణికుల రద్దీ తగ్గుతుంది. మునుపటి మాదిరిగా హాయిగా ట్రావెల్ చేయవచ్చు. తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో హైదరాబాద్‌ సిటిలో రోజుకు సుమారు 12 లక్షల మంది ప్రయాణించేవారు. ఆ సంఖ్య అమాంతంగా రెట్టింపు అయి 25 లక్షలకు చేరినట్లు ఓ అంచనా.

ప్రయాణికులు కూర్చొని హాయిగా ట్రావెల్ చేయవచ్చు

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో వారి సంఖ్య భారీగా పెరిగింది. రద్దీ వేళల్లో ప్రయాణికులకు బస్సుల్లో సీటు దొరకడం కష్టంగా మారింది. నిలబడేందుకు బస్సుల్లో స్థలం లేని పరిస్థితులు కనిపించాయి. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ కొత్త బస్సులను సమకూర్చుకుంటోంది. పలు డిపోల నుంచి ఎలక్ట్రిక్‌ బస్సులు నడుస్తున్నాయి. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Advertisement

రూరల్ ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి. బస్సు వస్తే పురుషుల కంటే ముందుగా మహిళలు బస్సులు ఎక్కేయడం, సీట్లు కబ్జా చేయడం జరుగుతోంది.పీఎం ఈ-డ్రైవ్‌ పథకంలో భాగంగా హైదరాబాద్‌కు 2200 ఎలక్ట్రిక్‌ బస్సులను కేటాయించింది కేంద్రం. తొలి విడత టెండర్‌ ద్వారా 2000 బస్సులు, రెండో టెండర్‌ ద్వారా మరో 200 బస్సులు ఓకే అయ్యాయి. నవంబర్‌లో 137 బస్సులు రానున్నాయి. 2028 జనవరి నాటికి 385 బస్సులను అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి వివరాలు సమర్పించింది తెలంగాణ ఆర్టీసీ.

ALSO READ: ఫిర్యాదు చేస్తే ఎదురుదాడి చేస్తారా.. గద్వాల జిల్లాలో దారుణం!

తొలి విడత టెండర్లలో ఈవీఈవై ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 60 ఏసీ, 1,025 నాన్‌ ఏసీ లోఫ్లోర్‌ బస్సులు కేటాయించారు. గ్రీన్‌సెల్‌ మొబిలిటీ-పిన్నాకిల్‌ మొబిలిటీ సొల్యూషన్స్‌ సంస్థల భాగస్వామ్యానికి 100 మినీ బస్సులు దక్కాయి. అలాగే 815 స్టాండర్డ్‌ ఫ్లోర్‌ నాన్‌ ఏసీ బస్సులు దక్కాయి. రెండో విడత టెండర్‌లో మాతేశ్వరి అర్బన్‌ మొబిలిటీ సొల్యూషన్‌ లిమిటెడ్‌ 200 లోఫ్లోర్‌ బస్సులు కేటాయించింది.

Related News

ఫిర్యాదు చేస్తే ఎదురుదాడి చేస్తారా.. గద్వాల జిల్లాలో దారుణం!

ఖైరతాబాద్‌లో బీజేపీ గెలుస్తుందా?.. అసంతృప్తిలో ఎమ్మెల్యే రాజాసింగ్!

ఎన్ని చిప్పలు, బాత్రూమ్‌లు కడిగి కోట్లు సంపాదించావ్!.. కేటీఆర్ పై ఊగిపోయిన సీఎం రేవంత్!

కాంగ్రెస్‌పై తిరుగుబాటు ఖాయం.. కేసీఆర్ మళ్లీ సీఎంగా రాబోతున్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తొర్రూరు గురుకులంలో దారుణం.. విద్యార్థులతో వంట పనులు చేయిస్తున్న ప్రిన్సిపాల్!

సత్తుపల్లి టూ ఖమ్మం ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు!

సిరిసిల్ల గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి జోరుగా పాదయాత్ర!

Big Stories

Advertisement
×