E-Paper
Advertisement

బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం!

బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం!
Advertisement

Chevella Accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో మంగళవారం రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో మేడిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా దారుణం

Advertisement

మొయినాబాద్‌ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి మధు(35), ఆయన భార్య సావిత్రి(30), కుమారుడు ధనుష్‌(6), కుమార్తె అక్షిత మంగళవారం సాయంత్రం ఒక శుభకార్యానికి హాజరయ్యారు. చేవెళ్ల మండలంలోని చన్‌వెల్లిలో జరిగిన ఫంక్షన్‌ ముగించుకుని, రాత్రి 9 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు.

రాత్రి వేళ వెనక నుంచి ఢీకొట్టిన వాహనం

Advertisement

చేవెళ్ల-శంకర్‌పల్లి ప్రధాన రహదారిపై గొల్లపల్లి స్టేజి సమీపానికి చేరుకోగానే, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం వీరి బైకును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగాక ఆ వాహనం నిలపకుండా డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఢీకొట్టిన తీవ్రతకు నలుగురూ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు.

చికిత్స పొందుతున్న చిన్నారి..

అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి వెంటనే పోలీసులకు, 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకునే సరికే మధు, సావిత్రి, ధనుష్‌ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. అదృష్టవశాత్తూ చిన్నారి అక్షిత గాయాలతో బయటపడటంతో ఆమెను వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో బంధువులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను తీవ్రంగా పరిశీలిస్తున్నారు.

Also Read: సీఎంగా మొదలై ప్రధానిగా.. 25 ఏళ్ల మోదీ ప్రస్థానంపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు!

Tags

Related News

 వరంగల్ జిల్లాలో విషాదం.. పాఠశాల బస్సు ఢీకొని మూడేళ్ల చిన్నారి దుర్మరణం!

చిక్కుల్లో కేసీఆర్ ఫ్యామిలీ, రేపో మాపో నోటీసులు, మళ్లీ ఏం జరిగింది? కోర్టుకు వెళ్లే ఆలోచనలో..

రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనేది కాంగ్రెస్ గుడ్డి ఆరాటం: రాంచందర్ రావు!

హైదరాబాద్‌లో చిన్నారుల కిడ్నాప్ యత్నం.. చితకబాదిన స్థానికలు!

ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

రేవంత్, కేటీఆర్ ఆస్తుల చిట్టాల డ్రామా.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్!

Big Stories

Advertisement
×