Supritha: నటి సురేఖావాణి గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు.సినిమాలో ఎంతో పద్దతిగా.. సాఫ్ట్ క్యారెక్టర్స్ తో అలరించే సురేఖావాణి.. బయట మాత్రం యమా యాక్టివ్ గా ఉంటుంది. సినిమాల వరకే నటన.. తమ జీవితం బయట వేరు ఉంటుంది అని చెప్పే ఆమె.. నిజ జీవితంలో కూతురుతో కలిసి నివసిస్తుంది. కొన్నేళ్ల క్రితం సురేఖావాణి భర్త చనిపోవడంతో.. ఆమె కూతురు సుప్రీత ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ బాగా ఫేమస్ అయ్యారు. సుప్రీత అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్స్ బేస్ నే ఉందని చెప్పాలి.
ఇక గత కొన్ని నెలల నుంచి సురేఖావాణి సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చి .. కూతురును హీరోయిన్ గా నిలబెట్టడం కోసం కృషి చేస్తోంది. అమ్మడు కూడా సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ బాగానే పేరు తెచ్చుకుంది. ఇప్పటికే సుప్రీత.. ఒక వెబ్ సిరీస్ లో నటించింది. ఇది కాకుండా బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా పూర్తి అయ్యేలోపు మరింత పేరు తెచ్చుకోవడానికి సుప్రీత యాంకర్ గా మారింది.
ఒక యూట్యూబ్ ఛానెల్ లో పీలింగ్స్ విత్ సుప్రీత అనే టాక్ షోతో యాంకర్ గా ఎంట్రీ ఇస్తుంది. ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో వైరల్ గా మారింది. ఇక మొదటి ఎపిసోడ్ గెస్టులుగా బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అయిన టేస్టీ తేజ, శోభా శెట్టి విచ్చేసి సందడి చేశారు. మొదటి నుంచి తేజ, సుప్రీత మంచి ఫ్రెండ్స్ కావడంతో వారిద్దరి మధ్య ర్యాపో బాగా కుదిరింది. ఎన్నో ఫన్నీ విషయాలను వారిద్దరిని అడిగి ముప్పుతిప్పలు పెట్టింది సుప్రీత.
Sobhita Dhulipala: అద్దం ముందు అక్కినేని కోడలి అందాల ఆరబోత.. మళ్లీ మొదలు
షో అంతా హుగ్గులు, ముద్దుల టాపిక్ తోనే నిండిపోయింది. వీరిద్దరికి ఒక సాంగ్ డేడికేషన్ రౌండ్ అని.. ఒక సాంగ్ వినిపించి అది ఎవరికి డేడికేట్ చేస్తారో అడిగింది. ఆకలేస్తే అన్నం పెడతా.. అలిసొస్తే ఆయిల్ పెడతా.. మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా సాంగ్ శోభా.. ఎవరికి డేడికేట్ చేస్తావని అడిగితే.. తేజ తనకు చేయమని చెప్పడంతో ఆమె నవ్వుకుంటూ చేసింది. ఇక తేజ .. నేను కూడా నిన్ను ఒక పాట డేడికేట్ చేయమంటే ఎవరికి చేస్తావని సుప్రీతను అడుగుతాడు.
పగలైనా నాకు ఓకే.. రాత్రయినా నాకు ఓకే సాంగ్ కనుక ఎవరికి డేడికేట్ చేస్తావ్ అని అడగగానే.. సుప్రీత సిగ్గుపడుతూ.. విజయ్ దేవరకొండ గాయ్స్.. ఆయన ఒప్పుకొంటే నిజంగా నాకు ఓకే గాయ్స్ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఎపిసోడ్ చివర్లో మాత్రం కొన్ని సీరియస్ ప్రశ్నలు వేసింది. శోభా శెట్టి బిగ్ బాస్ కన్నడ నుంచి ఎందుకు వచ్చేసింది.. ? తేజ గ్రూప్ గేమ్ ఆడాడా.. ? ఇలాంటి ప్రశ్నలు అడిగి షాక్ ఇచ్చింది.
ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్స్ఈ తల్లీకూతుళ్లపై విరుచుకుపడుతున్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో సురేఖవాణి.. తనకు పవన్ కళ్యాణ్ ఇష్టమని, కనిపిస్తే వెయ్యి ముద్దులు పెట్టేస్తానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు కూతురు.. అందరి ముందు విజయ్ దేవరకొండతో రాత్రైనా నాకు ఓకే అంటుంది. ఏందరిద్రంరా బాబు బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. మరి సుప్రీత షో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.