E-Paper
Advertisement

రూ. కోట్లు ఖర్చు చేసి కారు పార్కింగ్ స్థలాలు కొనుగోలు చేసిన మహిళ.. డబుల్ ఆదాయం

రూ. కోట్లు ఖర్చు చేసి కారు పార్కింగ్ స్థలాలు కొనుగోలు చేసిన మహిళ.. డబుల్ ఆదాయం
Advertisement

woman buys 196 parking spaces| చాలామంది ఇల్లు, భూమి కొనుగోలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఓ మహిళ మాత్రం పెట్టుబడి చేయడానికి పార్కింగ్ స్థలాలను ఎంచుకుంది. ఒకేసారి ఏకంగా 196 పార్కింగ్ స్థలాలను కొనుగోలు చేసి, వాటిని అద్దెకు ఇవ్వడం ప్రారంభించింది. ప్రాంతంలో డిమాండ్ పెరగడంతో అద్దెను రెట్టింపు చేసింది. దీంతో స్థానిక నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేయగా, చివరకు ఈ వివాదం కోర్టు వరకు వెళ్లింది. అసలు ఆమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? కోర్టు ఏం తీర్పు ఇచ్చింది?

రూ.20 కోట్లతో 196 పార్కింగ్ స్థలాలు కొనుగోలు

చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో ఉన్న చాంగ్షా నగరంలో ఈ ఘటన జరిగింది. ‘వు’ అనే పేరు గల మహిళ సుమారు 14 మిలియన్ యువాన్లు, అంటే దాదాపు రూ.20 కోట్లతో 196 పార్కింగ్ స్థలాలను కొనుగోలు చేసింది. ఇవి ఆ ప్రాజెక్టులోని మొత్తం పార్కింగ్ స్థలాల్లో దాదాపు 40 శాతం కావడం గమనార్హం.

ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ముందే అంచనా

Advertisement

ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మాణం 2018లో పూర్తయింది. అయితే ప్రారంభంలో అక్కడ దుకాణాలు, పాఠశాలలు, మెరుగైన ప్రజా రవాణా వంటి సౌకర్యాలు లేకపోవడంతో కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో డెవలపర్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే, భవిష్యత్తులో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ‘వు’ అంచనా వేసింది. స్థానిక అభివృద్ధి ప్రభుత్వ ప్రణాళికలను పరిశీలించిన తర్వాత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది. చివరకు డెవలపర్ నుంచి ఒకేసారి 196 పార్కింగ్ స్థలాలను కొనుగోలు చేసింది.

డిమాండ్ పెరగడంతో అద్దె రెట్టింపు

కాలక్రమేణా ఆ ప్రాంతంలో అభివృద్ధి పెరిగింది. ఎక్కువ మంది ఇళ్లను కొనుగోలు చేయడంతో పార్కింగ్ స్థలాలకు డిమాండ్ కూడా పెరిగింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న.. ‘వు’ కొన్ని పార్కింగ్ స్థలాలకు నెలకు 75 డాలర్ల అద్దె వసూలు చేయడం ప్రారంభించింది. ఇది 2018లో డెవలపర్ నిర్ణయించిన అద్దెకు రెట్టింపు. నెలకు 300 యువాన్లకు అద్దె ఇవ్వాలని నివాసితులు కోరినా ఆమె అంగీకరించలేదు. అంతేకాకుండా, కొన్ని పార్కింగ్ స్థలాలను ఒక్కొక్కటి సుమారు 15,000 డాలర్లకు విక్రయించేందుకు కూడా ప్రయత్నించింది.

Advertisement

Also Read: ఫోన్, ల్యాప్‌టాప్ ఎక్కువగా వాడుతున్నారా? కళ్లలో మంట, పొడిబారడం సమస్యను తగ్గించుకోండిలా

కోర్టును ఆశ్రయించిన నివాసితులు

‘వు’ నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు నివాసితులు కలిసి కోర్టులో కేసు వేశారు. ఇలాంటి పార్కింగ్ స్థలాలు నివాస సముదాయంలో అవసరమైన సౌకర్యాలని, ఒకే వ్యక్తి ఇన్ని స్థలాలను లాభం కోసం నియంత్రించడం సరికాదని వాదించారు. ఆమె కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు.

Also Read: నెలకు రూ.2,000 SIP పెట్టబడితో రూ.10 లక్షల కార్పస్.. ఇలా చేస్తే సాధ్యమే?

వుకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన కోర్టు

2024 ఫిబ్రవరిలో చాంగ్షాలోని స్థానిక కోర్టు వుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. గతంలో డెవలపర్ పార్కింగ్ స్థలాలను ఇతర నివాసితులకు కూడా కొనుగోలు చేసే అవకాశం ఇచ్చాడని, కానీ వారు అప్పట్లో ఆసక్తి చూపలేదని కోర్టు పేర్కొంది. ‘వు’ పెట్టుబడి పెట్టి ఆర్థిక నష్టాల ప్రమాదాన్ని కూడా స్వీకరించిందని తెలిపింది.

ఒక వ్యక్తి ఎన్ని పార్కింగ్ స్థలాలను కలిగి ఉండవచ్చనే విషయంలో చట్టపరమైన పరిమితి లేదని కోర్టు గుర్తించింది. దీంతో ఆమె కొనుగోలు చట్టబద్ధమైనదిగా నిలిచింది. భవిష్యత్తులో డిమాండ్ పెరుగుతుందని అంచనా వేసి చేసిన పెట్టుబడి ఎంత విలువైనదిగా మారవచ్చో ఈ ఘటన తెలియజేస్తుంది.

Related News

బ్యాంకులకు కొత్త కష్టాలు..రూల్స్ మార్చేసిన ఆర్బీఐ, అసలు మేటరేంటి?

మీ కార్ లోన్, పర్సనల్ లోన్ల ఈఎంఐ పెరగబోతోందా? ఇలా తెలుసుకోండి

నెలకు రూ.2.28 లక్షలు ఆదాయం పొందుతున్న జొమాటో మాజీ ఉద్యోగి.. జాబ్ మానేసి ఏం చేస్తోందంటే

పండగల వేళ షాకిస్తున్న బంగారం ధర, పెంపు ఖాయమన్న బులియన్ వర్గాలు, మార్కెట్లో రేటు మాటేంటి?

‘వంటమనిషికి నెలకు రూ.8000 చెల్లిస్తున్నా.. వంట యువరేజ్’..బెంగుళూరు మహిళ పోస్ట్ వైరల్

తాతల ఆస్తి రెండో భార్యకు రాసిచ్చిన భర్త.. కోర్టుకెక్కిన మొదటి భార్య కూతురు.. చివరికి ఏం జరిగిందంటే

ఏటీఎం కార్డు పోయిందా? వెంటనే మీరు చేయాల్సిన పనులు ఇవే!

Big Stories

Advertisement
×