E-Paper
Advertisement

బిగ్ బాస్ షో పై అనుపమ కామెంట్స్…అంత పిచ్చి ఉందా?

బిగ్ బాస్ షో పై అనుపమ కామెంట్స్…అంత పిచ్చి ఉందా?
Advertisement

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్న అనుపమ త్వరలోనే క్రేజీ కల్యాణం (Crazy Kalyanam) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాగా విడుదల కానుంది. బద్రప్ప గాజుల అనుపమ పరమేశ్వరన్‌తో పాటు నరేష్ వీకే, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

క్రేజీ కళ్యాణం అంటున్న అనుపమ..

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే అనుపమ పరమేశ్వరన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఇంటర్వ్యూ సందర్భంగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి కూడా అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను సినిమా షూటింగ్స్ లేనప్పుడు ఫ్రీ గా ఉంటే ఎక్కువగా సినిమాలు వెబ్ సిరీస్ లో చూస్తూ ఉంటాను అని తెలిపారు అయితే ఇటీవల కాలంలో తాను బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమానికి బాగా అలవాటు పడ్డానని అనుపమ తెలిపారు.

24/7 లైవ్ చూసే అంత పిచ్చి అలవాటు..

Advertisement

ఇప్పటివరకు బిగ్ బాస్ కార్యక్రమం ఎన్నో సీజన్లు ప్రారంభమైనప్పటికీ తాను మాత్రం ఇదివరకు ఎప్పుడూ చూడలేదని మొదటిసారి బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నానని తెలిపారు. తనకు షూటింగ్స్ లేని సమయంలో ఒకరోజు ఒక ఎపిసోడ్ చూశానని, ఆ తర్వాత ప్రతిరోజు ఒక గంట చూడటం అలవాటుగా మారిపోయిందని తెలిపారు. అయితే ఆ అలవాటు ఇప్పుడు 24/7 లైవ్ చూసే వరకు వెళ్లిందంటూ అనుపమ తెలిపారు. నేను అమ్మ ఈ కార్యక్రమానికి పిచ్చ అభిమానులుగా మారిపోయామని వెల్లడించారు.

మోహన్ లాల్ హోస్ట్ గా బిగ్ బాస్..

తాను సినిమా షూటింగ్లో భాగంగా బిజీగా ఉంటే అమ్మ ఫోన్ చేసి మరి ఈరోజు ఇలా జరిగింది అలా జరిగింది అంటూ నాకు చెబుతుందనీ బిగ్ బాస్ కార్యక్రమం పట్ల తనకున్నటువంటి ఆసక్తి గురించి తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు ఎవరూ కూడా ఇలా బిగ్ బాస్ కార్యక్రమం అంటే ఇష్టం అని చెప్పిన సందర్భాలు లేవు కానీ ఈమె మాత్రం పిచ్చి అభిమాని అని చెప్పడంతో ఆశ్చర్యపోతున్నారు. అయితే అనుపమ తెలుగు కాకుండా మలయాళ సీజన్ చూస్తున్నట్టు తెలిపారు మలయాళంలో ఈ కార్యక్రమానికి హోస్టుగా మోహన్ లాల్ (Mohan Lal) కొనసాగుతున్నారు. మలయాళంలో బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం 8వ సీజన్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: వెంకీ ఆదర్శ కుటుంబం కొత్త విడుదల తేదీ ఇదే.. ఈసారైనా వస్తారా? లేదా?

Related News

హనుమాన్ అంశ్‌కు తెలుగులో షాక్.. అసలేం జరిగింది?

వితికా షేరు, రాజీవ్ కనకాలతో సందడిగా మారిన సిస్ట్లా..గ్రాండ్ సెలబ్రేషన్స్!

అల్లు అర్జున్ భార్య అందానికి ఫ్యాన్స్ ఫిదా.. ఫొటోలు వైరల్

వెంకీ ఆదర్శ కుటుంబం కొత్త విడుదల తేదీ ఇదే.. ఈసారైనా వస్తారా? లేదా?

నాగవంశీ, పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన నెటిజన్.. కారణం ఇదే!

రజనీకాంత్  భాషా సీక్వెల్  అందుకే చేయలేదా?కారణం అదేనా?

ఎక్కడ చూసినా జిమ్ జిమ్ తార.. ఇప్పుడు అనుపమ వంతు!. వైరల్ వీడియో

Big Stories

Advertisement
×