E-Paper
Advertisement

హనుమాన్ అంశ్‌కు తెలుగులో షాక్.. అసలేం జరిగింది?

హనుమాన్ అంశ్‌కు తెలుగులో షాక్.. అసలేం జరిగింది?
Advertisement

Hanuman Ansh:‘హనుమాన్ అంశ్’…హిందీలో కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో వచ్చి ఏకంగా 400కోట్లు వసూలు చేయడంతో ఈ సినిమా పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది.ఇక ఈ సినిమా తెలుగులోనూ వస్తుందంటే అంచనాలు భారీగానే పెరిగాయి.పైగా హనుమాన్ అనే పేరుకి టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉండటంతో సినిమా భారీగా ఓపెనింగ్స్ రాబడుతుందని ఆశ పడ్డారు మేకర్స్.కానీ సినిమా థియేటర్లలోకి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఇన్ సైడ్ టాక్ .దీంతో  తొలి రోజే వసూళ్లు దారుణంగా ఉండటంతో అసలు ఎక్కడ తేడా కొట్టిందా అని ఆరా తీసే పడ్డారట.

హిందీలో హిట్.. తెలుగులో మాత్రం డల్!

Advertisement

అయితే అక్టోబర్ 9న తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈ సినిమా తొలి రోజు సుమారు రూ.70 లక్షల నెట్ వసూళ్లకే పరిమితమైనట్లు తెలుస్తుంది. హిందీలో ఈ స్థాయి విజయాన్ని అందుకున్న సినిమాకు తెలుగులో ఇలాంటి ఓపెనింగ్స్ రావడం నిరాశ కలిగించే విషయమనే చెప్పాలి.

ఈ సినిమా విషయంలో మొదట కనిపిస్తున్న సమస్య ఇదే. హిందీలో భారీ వసూళ్లు వచ్చాయనే విషయాన్ని ప్రచారంలో ఊదరగొట్టారు.కాని తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఎందుకు చూడాలనే ఆసక్తిని మాత్రం కలిగించలేకపోయారు మేకర్స్.

Advertisement

ఒక భాషలో సినిమా సక్సెస్ అయిందని మరో భాషలోనూ అదే ఫలితం వస్తుందని భావిస్తే తేడా కొడుతుంది అనేదానికి ఈ సినిమానే పెద్ద ఎగ్జాంపుల్. అక్కడి ప్రేక్షకులు సినిమాను ఆదరించడానికి కారణాలు ఉండొచ్చు. కానీ అవే కారణాలు తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయని చెప్పలేం కూడా.

 తెలుగు ప్రేక్షకుల్లో అసలు బజ్ క్రియేట్ అయిందా?

హిందీలో సినిమా విడుదలైనప్పటి నుంచి కలెక్షన్లు పెరిగే వరకు జరిగిన ప్రయాణం అక్కడి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిందనే చెప్పాలి. కానీ తెలుగు వెర్షన్ విడుదలయ్యే సమయానికి ఆ స్థాయిలో బజ్ రాకపోవడం ఓపెనింగ్స్‌పై ఎఫెక్ట్ చూపించింది.

నిజానికి ఒక డబ్బింగ్ సినిమా థియేటర్లలోకి వస్తోందంటే దాని గురించి ప్రేక్షకులకు ముందుగానే తెలియాలి. కథలోని ఏదైనా స్పెషల్ గా ఉండాలి,లేక పొతే హిందీలో హిట్ అయిందన్న ట్యాగ్‌తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం చాలా కష్టం.ప్రచారంలో ఎక్కడైనా లోపం జరిగిందా? తెలుగు ప్రేక్షకులకు సినిమాను సరైన విధంగా పరిచయం చేయలేకపోయారా? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.

సినిమా గురించి ముందే తెలిసిపోవడం కూడా సమస్యే!

‘హనుమాన్ అంశ్’ హిందీలో విడుదలై చాలా రోజులైంది. అప్పటికే ఇతర భాషల ప్రేక్షకులు సినిమాని చాలా వరకు వివిధ రకాలుగా చూసేశారు.ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ కోసం మళ్లీ థియేటర్లకు వెళ్తారా అంటే అనుమానమే.

 మెల్లిగా ఏమైనా కనెక్ట్ అవుతుందేమో !

నీమ్ కరోలి బాబా జీవితానికి సంబంధించిన ఆధ్యాత్మిక అంశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. కానీ ఇలాంటి కథలు అందరిని ఒకేలా స్థాయిలో ఆకట్టుకుంటాయని చెప్పలేం.రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ సాధించిందనే టాక్ బాగానే ఉంది కాని తెలుగులో ఆ టాక్ పెద్దగా పని చేసినట్టు కనిపించట్లేదు.చూడాలి మరి హిందీలోలా ఇక్కడ కూడా మెల్లిగా ఏమైనా కనెక్ట్ అవుతుందేమో !

ALSO READ :జిమ్‌లో దివి సందడి.. ఇష్టమైన వ్యక్తితో వర్కౌట్స్, లేటెస్ట్ వీడియో వైరల్!

Tags

Related News

బిగ్ బాస్ షో పై అనుపమ కామెంట్స్…అంత పిచ్చి ఉందా?

వితికా షేరు, రాజీవ్ కనకాలతో సందడిగా మారిన సిస్ట్లా..గ్రాండ్ సెలబ్రేషన్స్!

అల్లు అర్జున్ భార్య అందానికి ఫ్యాన్స్ ఫిదా.. ఫొటోలు వైరల్

వెంకీ ఆదర్శ కుటుంబం కొత్త విడుదల తేదీ ఇదే.. ఈసారైనా వస్తారా? లేదా?

నాగవంశీ, పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన నెటిజన్.. కారణం ఇదే!

రజనీకాంత్  భాషా సీక్వెల్  అందుకే చేయలేదా?కారణం అదేనా?

ఎక్కడ చూసినా జిమ్ జిమ్ తార.. ఇప్పుడు అనుపమ వంతు!. వైరల్ వీడియో

Big Stories

Advertisement
×