E-Paper
Advertisement

ప్రతి నెలా డబ్బు ఆదా చేయలేకపోతున్నారా? ఖర్చులు తగ్గించుకోవడానికి బదులుగా ఈ ట్రిక్ ట్రై చేయండి!

ప్రతి నెలా డబ్బు ఆదా చేయలేకపోతున్నారా? ఖర్చులు తగ్గించుకోవడానికి బదులుగా ఈ ట్రిక్ ట్రై చేయండి!
Advertisement

Money saving tips: ప్రతి నెలా సంపాదన అంతా ఖర్చయిపోతోందని,అకౌంట్‌లో చిల్లిగవ్వ కూడా మిగలట్లేదని టెన్షన్ పడుతున్నారా? జీతం రాగానే బిల్లులు కట్టి, షాపింగ్ చేసి చేతులు దులుపుకుంటున్నారా? అయితే మీరు ఒంటరి కాదు, చాలామంది ఇదే సమస్యతో సతమతమవుతున్నారు. మనం డబ్బులు ఆదా చేయలేకపోవడానికి ప్రధాన కారణం మన లైఫ్ స్టైల్, ఖర్చు పెట్టే విధానం. “ఈ నెల ఖర్చులు బాగా తగ్గిస్తా, వచ్చే నెల నుంచి పక్కాగా సేవ్ చేస్తా” అని ప్రతి సారీ అనుకోవడం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆచరణలో అది సాధ్యం కాదు. ఎందుకంటే.. మన అవసరాలు, కోరికలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. అందుకే.. ఖర్చులను బలవంతంగా తగ్గించుకోవడానికి బదులుగా.. మీ సంపాదన, మైండ్‌సెట్‌ను మార్చుకునే సరి కొత్త పద్ధతిని ఈ రోజు తెలుసుకుందాం. అదే ‘రివర్స్ బడ్జెటింగ్’ లేదా ‘పే యువర్ సెల్ఫ్ ఫస్ట్’ సూత్రం.

‘పే యువర్ సెల్ఫ్ ఫస్ట్’ అంటే ఏంటి?

సాధారణంగా మనం ఏం చేస్తాం? చేతికి జీతం రాగానే ఇంటి అద్దె, కరెంట్ బిల్లులు, కిరాణా సామాన్లు, ఈఎంఐలు అన్ని ఖర్చులు పోను చివరిగా మిగిలిన మొత్తాన్ని సేవింగ్స్ అకౌంట్‌లో వేద్దామని చూస్తాం. కానీ అలా ఏమాత్రం మిగలదు. ఈ పద్ధతిని రివర్స్ చేయడమే అసలైన మనీ ట్రిక్.

Advertisement

జీతం రాగానే ముందుగా మీ సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించిన మొత్తాన్ని (ఉదాహరణకు మీ సంపాదనలో కనీసం 20 శాతం) పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత మిగిలిన డబ్బుతోనే మిగతా నెలంతా సర్దుకోవాలి. మొదట్లో .. ఇది కొంచెం కష్టంగా అనిపించినా, క్రమంగా మీ మెదడు ఆ పరిమిత బడ్జెట్‌కు అలవాటు పడుతుంది. దీని వల్ల అనవసరమైన ఖర్చులకు ఆటోమేటిక్‌గా బ్రేక్ పడుతుంది.

ఆటోమేటిక్ సేవింగ్స్ పద్ధతి:

మాన్యువల్‌గా డబ్బులు దాచడం చాలా మందికి బద్ధకం అనిపిస్తుంది. అందుకే బ్యాంకులు అందించే ఆటో-డెబిట్ ఫీచర్‌ను వాడండి. ప్రతి నెలా జీతం పడిన మరుసటి రోజే మీ శాలరీ అకౌంట్ నుంచి నిర్దిష్ట మొత్తం (రూ.5,000 లేదా రూ. 10,000 మీ సామర్థ్యాన్ని బట్టి) నేరుగా మ్యూచువల్ ఫండ్స్, రికరింగ్ డిపాజిట్ లేదా పీపీఎఫ్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యేలా సెట్ చేసుకోండి. ఆ డబ్బు కంటికి కనిపించకపోతే.. ఖర్చుపెట్టాలనే ఆలోచన కూడా రాదు.

ఆదాయ వనరులను పెంచుకోండి:

Advertisement

ఖర్చులు తగ్గించుకోవడం.. ఒక పరిమితి వరకు మాత్రమే సాధ్యం. ఒక కప్పు కాఫీ తాగడం మానేయడం వల్ల వచ్చేది కొన్ని వందలే. కానీ మీ స్కిల్స్‌ను పెంచుకోవడం ద్వారా అదనపు ఆదాయం సంపాదిస్తే వచ్చేది వేలల్లో ఉంటుంది. ఫ్రీలాన్సింగ్, కంటెంట్ క్రియేషన్, ఆన్‌ లైన్ ట్యూషన్స్ లేదా మీ హాబీని బిజినెస్‌గా మార్చుకోవడం ద్వారా అదనపు సంపాదనను సృష్టించుకోండి. ఇలా వచ్చిన అదనపు ఆదాయాన్ని వంద శాతం నేరుగా సేవింగ్స్‌కే కేటాయించాలి.

Also Read: 30 ఏళ్లు వచ్చేలోపు..ఈ 7ట్రిక్స్ పాటిస్తే, మీ ఫ్యూచర్ సెట్టైనట్టే!

చిన్న చిన్న పెట్టుబడులు:

డబ్బులు దాచడం అంటే.. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని రూల్ ఏమీ లేదు. రోజుకు కేవలం రూ.100 లేదా రూ.200 చొప్పున పక్కన పెట్టినా ఏడాదికి అది మంచి మొత్తంగా మారుతుంది.మార్కెట్లో సిప్ ద్వారా కేవలం రూ.500 తో కూడా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రారంభించవచ్చు. ఇలా క్రమశిక్షణతో కూడిన చిన్న పెట్టుబడులు భవిష్యత్తులో మీకు ఆర్థిక భద్రతను ఇస్తాయి.

డబ్బు దాచడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు.. అది ఒక ఆర్థిక స్వేచ్ఛను ఇచ్చే గొప్ప ప్రయాణం. ఖర్చులను అణచివేయడానికి బదులుగా.. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి.’రివర్స్ బడ్జెటింగ్’ పద్ధతిని ఫాలో అవ్వండి. రేపటి సేఫ్టీ కోసం ఈ రోజే సరైన నిర్ణయం తీసుకోండి.

Related News

ఇతర బ్యాంకులో తక్కువ వడ్డీకి హోమ్ లోన్.. మీ బ్యాంకు నుంచి లోన్ ట్రాన్స్‌ఫర్ చేసే ముందు ఇది తెలుసుకోండి

క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టకపోతే.. జైలులో పెడతారా? చట్టం ఏం చెబుతోంది?

పిల్లల పేరుతో SIPలో పెట్టుబడి చేస్తున్నారా? 18 ఏళ్లు నిండిన తరువాత జరిగే మార్పులివే

భారీగా పడిపోతున్న పసిడి ధర.. మార్కెట్లో ధరల మాటేంటి? ఈనెలలో ఎంత తగ్గింది?

బాబూ ఈ డిగ్రీలు చేస్తే ఉద్యోగాల్లేవ్.. ఏఐ దెబ్బ.. తక్కువ జీతానికి చేయాల్సిందే

నలుపు vs నీలం సోలార్ ప్యానెళ్లు.. ఏది ఎక్కువ కరెంట్ ఇస్తుంది? మీ ఇంటికి ఏది బెస్ట్?

ఇది కదా SIP పవరంటే.. రూ. 9 వేలతో రూ. 3 కోట్ల సంపద.. సామాన్యులకు జాక్ పాట్!

Big Stories

Advertisement
×