E-Paper
Advertisement

బీఆర్ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలపై దాడి వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు

బీఆర్ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలపై దాడి వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
Advertisement

Hyderabad: తెలంగాణ అసెంబ్లీ సమీపంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మహిళాఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాలని ఆదేశించింది. ఈ మేరకు డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. దీంతో సదరు ఎమ్మెల్యే ఘటన వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.

బీఆర్ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలపై దాడి వ్యవహారం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ ఏడున మొదలయ్యాయి. సమావేశాల తొలిరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులను ధరించి అసెంబ్లీకి బయలుదేశారు. అయితే అసెంబ్లీ ఆవరణలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ సమీపంలో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు-పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. దీనిపై బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు న్యాయస్థానం తలుపు తట్టారు.

డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు

Advertisement

ఈ పిటిషన్‌ను మంగళవారం విచారించిన తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించారన్న వాదనకు ఆధారాలు లేవని పేర్కొంది. మహిళా ఎమ్మెల్యేల పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాలని డీజీపీని ఆదేశించింది. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులను గుర్తించి, వారిపై చర్యలు తీసుకునేలా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించింది.

ALSO READ: రేవంత్‌కు మైండ్ దొబ్బింది.. మంచి డాక్టర్‌కి చూపించండి: రాంచందర్ రావు

Advertisement

అందుకు సంబంధించిన నివేదికను అసెంబ్లీ స్పీకర్‌ ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు.. స్పీకర్‌ ఆదేశాల మేరకు వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకునే అంశం స్పీకర్‌ పరిధిలోకి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్‌ అధికారాలను గుర్తు చేసింది. మరి డీజీపీ నివేదికపై ఇంకెంత రాద్ధాంతం జరుగుతుందో చూడాలి.

Related News

భారీగా తరలిరండి.. సిరిసిల్ల సీఎం సభను సక్సెస్ చేద్దాం!- మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్ సంస్థ బియ్యంపై అమెరికా ఎఫ్‌డిఏ దృష్టి.. పురుగుమందు అవశేషాలపై హెచ్చరిక

శ్రీమంతుడులా వచ్చి సిరిసిల్లలో పడ్డాడు.. కేటీఆర్‌పై ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు!

రేవంత్‌కు మైండ్ దొబ్బింది.. మంచి డాక్టర్‌కి చూపించండి: రాంచందర్ రావు

పేదల దేవుడు శివుడు.. ధనికుల దేవుడు శ్రీరాముడు, హర హర మహాదేవ్ ఎందుకనరు-సీఎం రేవంత్

తెలంగాణకు పీఎం సహకరించడం లేదు.. డెవలప్‌మెంట్ ఫైళ్లన్నీ ఆపేస్తున్నారు: సీఎం రేవంత్

మేడ్చల్‌ జిల్లాలో తీవ్ర విషాదం.. రైలు ఢీకొని సుమారు 300 గొర్రెలు మృతి!

Big Stories

Advertisement
×