E-Paper
Advertisement

స్టాక్ మార్కెట్ భారీ పతనం.. చివరిలో విదేశీ మదుపరులు అమ్మకాలు, అసలు కారణాలు ఇవే

స్టాక్ మార్కెట్ భారీ పతనం.. చివరిలో విదేశీ మదుపరులు అమ్మకాలు, అసలు కారణాలు ఇవే
Advertisement

Stock Market Crash: దేశీయ స్టాక్‌మార్కెట్‌లో గురువారం మూడో సెషన్‌లో బేర్ వీర విహారం చేసింది. ఫలితంగా మార్కెట్ భారీగా పతనమైంది. నిఫ్టీ దాదాపు 350 పాయింట్లు పతనం కాగా, సెన్సెక్స్ ఏకంగా సుమారు 1100 పాయింట్లు పతనమైంది. అధిక బాండ్ దిగుబడులు, ముడి చమురు ధరలు పెరగడం, బలపడిన అమెరికన్ డాలర్, వంటి అంశాల నేపథ్యంలో మదుపరులు అమ్మకాలకు పాల్పడ్డారు.

అంతర్జాతీయ మార్కెట్ భగ్గుమన్న చమురు ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. దీంతో ద్రవ్యోల్బణ భయాలు తెరపైకి వచ్చాయి. ఫలితంగా మూడో సెషన్‌లో స్టాక్ మార్కెట్లలో బేర్ చెలాయించింది. ఫలితంగా మదుపరులు అమ్మకాలకు పాల్పడడంతో దాదాపు అన్ని సూచీలు నేల చూశాయి. ఇన్వెస్టర్లు ఆందోళనకు గురై అమ్మకాలకు తెగబడ్డారు. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్ బీఎస్ఈ సూచీ ఏకంగా 1,100 పాయింట్లు పతనమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీలు 350 పాయింట్లు పతనమయ్యాయి.

స్టాక్ మార్కెట్ భారీ పతనం, చివరి సెషన్‌లో జోరుగా అమ్మకాలు

Advertisement

ఈ ఏడాది జూన్ 11 తర్వాత అతిపెద్ద పతనాన్ని చవిచూసింది దేశీయ స్టాక్ మార్కెట్. గురువారం నాటి పతనంతో నిఫ్టీ సెప్టెంబర్ 16 నాటి కనిష్ట స్థాయి 23,116 కంటే దిగువకు పడిపోయింది. గురువారం స్టాక్ మార్కెట్ పతనానికి దారితీసిన ఐదు కారణాలు చూద్దాం. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ జూలై 2007 తర్వాత అత్యధిక స్థాయికి అంటే 5.13 శాతానికి పెరిగాయి. బుధవారం రాత్రి యూఎస్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. 30 ఏళ్ల దీర్ఘకాలిక బాండ్ ఈల్డ్ ఇప్పుడు 5.4 శాతానికి చేరువలో ఉంది, 2004 తర్వాత వాటికి ఇదే అత్యధిక స్థాయి. అమెరికాలో అధిక బాండ్ దిగుబడులు దేశీయ మార్కెట్లకు ప్రతికూలంగా మారాయి. మెరుగైన రాబడి కోసం విదేశీ మదుపుదారులు అమ్మకాలతో తెగబడ్డారు. ఫలితంగా మార్కెట్ పతనమైంది.

పతనానికి అసలు కారణలివే

వారం ప్రారంభంలో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 కంటే తక్కువ స్థాయికి దిగింది. ఆ తర్వాత మార్కెట్ కోలుకున్నప్పటికీ పతనం తప్పలేదు. అమెరికాతో సంఘర్షణ మరింత విస్తరించవచ్చని ఇరాన్ అధికారులు చెప్పినట్లు వార్తలు రావడం కూడా పతనానికి కారణమైంది. ఫలితంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 106 డాలర్లకు చేరువలో ఉంది. ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ మాట్లాడుతూ.. అమెరికా బెదిరింపులకు ఇరాన్ లొంగిపోదన్నారు. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ ఇరాన్ షరతులకు అమెరికా అంగీకరించిన తర్వాత జరుగుతుందని చెప్పింది. ఫలితంగా రాత్రికి రాత్రే చమురు ధరలు అమాంతంగా పెరిగాయి.

Advertisement

ALSO READ: ఆన్‌లైన్ షాపింగ్‌‌కు కొత్త రూల్స్, జనవరి ఒకటి నుంచి అమల్లోకి, ఎట్టి పరిస్థితుల్లోనూ

యూఎస్ డాలర్ కూడా 101 మార్కును దాటి బలపడటం కొనసాగించింది. డాలర్ మన కరెన్సీ, మెటల్ స్టాక్‌లకు ప్రతికూలంగా మారింది. గురువారం మార్కెట్లో 3 శాతం వరకు పడిపోయాయి. గురువారం మార్కెట్‌ను అత్యధికంగా దెబ్బతీసినవి బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ స్టాక్స్. పంపిణీ నిబంధనలపై ఐఆర్‌డిఎఐ ముసాయిదా పత్రం కారణంగా చాలావరకు బ్యాంకింగ్ స్టాక్స్ పడిపోయాయి. పిబి ఫిన్‌టెక్ షేర్లు 32 శాతం, టర్టిల్‌మెంట్ షేర్లు 20 శాతం తగ్గాయి. యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు కూడా చెరో 5 శాతం పతనమైంది. ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు దాదాపు అంతే స్థాయిలో పతనమయ్యాయి.

Related News

కేంద్రంపై వర్తకుల తిరుగుబాటు.. అక్టోబర్ 2న క్యూఆర్ కోడ్స్ పని చేయవు! No UPI Day

ఆన్‌లైన్ షాపింగ్‌‌కు కొత్త రూల్స్, జనవరి ఒకటి నుంచి అమల్లోకి, ఎట్టి పరిస్థితుల్లోనూ

పండగ సీజన్‌ వేళ కేంద్రం శుభవార్త.. వంట నూనె ధరలకు ఊరట!

బ్యాంకుల సమ్మె ఎఫెక్ట్.. సెప్టెంబర్ 25వ తేదీనే జీతాలు.. కేంద్రం కీలక ఆదేశాలు!

పిపిఎఫ్ vs సుకన్య సమృద్ధి యోజన.. మీ కూతురి భవిష్యత్తు కోసం ఏ పథకం ఎక్కువ లాభదాయకం

చమురు ధరల పెరుగుదల.. ఆయిల్ కంపెనీలకు భారీగా నష్టాలు, పెట్రోల్‌పై రూ.8-డీజిల్‌ పై రూ.9

చదివింది ఇంటర్మీడియట్ మాత్రమే.. కట్ చేస్తే నేడు వేల రూ.కోట్లకు అధిపతి

Big Stories

Advertisement
×