E-Paper
Advertisement

ఫ్రిజ్ క్లీనింగ్ కష్టమా? ఈ అల్యూమినియం ఫాయిల్ ట్రిక్‌తో మీ పని ఈజీ!

ఫ్రిజ్ క్లీనింగ్ కష్టమా? ఈ అల్యూమినియం ఫాయిల్ ట్రిక్‌తో మీ పని ఈజీ!
Advertisement

Aluminium foil hacks: ప్రతి ఇళ్లలోనూ ఫ్రిజ్ అనేది అత్యంత ముఖ్యమైన హోం అప్లయన్సెస్. కూరగాయలు, పండ్లు, పాలు , ఇతర ఆహార పదార్థాలను నిల్వ చేయడం వల్ల ఫ్రిజ్ లోపల త్వరగా మరకలు పడటం, జిడ్డుగా మారడం.. లేదా చెడు వాసన రావడం జరుగుతుంటుంది. గంటల తరబడి సమయం కేటాయించి ఫ్రిజ్‌ను కడగడం చాలా మందికి విసుగు తెప్పించే పని. అయితే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక సింపుల్.. ‘అల్యూమినియం ఫాయిల్ హ్యాక్’ మీ పనిని చిటికెలో ఈజీ చేస్తుంది. ఇంతకీ ఈ ట్రిక్ ఎలా పనిచేస్తుంది ? దీనివల్ల ఎలాంటి లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

 

అల్యూమినియం ఫాయిల్ హ్యాక్స్ :

Advertisement

మనం ఇళ్లలో.. ఆహార పదార్థాలను ప్యాక్ చేయడానికి లేదా ఓవెన్‌లో వంట చేయడానికి ఉపయోగించే అల్యూమినియం ఫాయిల్ పేపర్‌ను ఫ్రిజ్ క్లీనింగ్ కోసం కూడా వాడవచ్చు. ఫ్రిజ్‌లోని రాక్స్‌‌ మీద ఈ ఫాయిల్ పేపర్‌ను నీట్‌గా కవర్ చేసి ఉంచడమే.. ఈ హ్యాక్. ఇది ఎలా పని చేస్తుందంటే.. ఫ్రిజ్‌లో ఉండే గాజు లేదా ప్లాస్టిక్ షెల్ఫ్‌లపై కూరగాయల తడి, సూప్‌లు లేదా పాలు ఎండి పోయి జిడ్డు మరకలు ఏర్పడతాయి. వాటిని నేరుగా క్లీన్ చేయడం కష్టం. కానీ షెల్ఫ్‌లకు అల్యూమినియం ఫాయిల్ చుట్టడం ద్వారా ఆ మరకలన్నీ ఆ ఫాయిల్ మీదే పడతాయి. మరకలు అయినప్పుడు ఆ ఫాయిల్‌ను తీసి పారేసి కొత్తది వేస్తే సరి పోతుంది.

1. ఫ్రిజ్‌ను ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంచడం:

ఫ్రిజ్ లోపల కొన్ని సార్లు రక రకాల ఆహార పదార్థాల వాసనలు కలిసి పోయి ఒక లాంటి చెడు వాసన వస్తుంటుంది. అల్యూమినియం ఫాయిల్‌ను చిన్న ముద్దలుగా చేసి (బాల్స్ లాగా) ఫ్రిజ్ మూలల్లో పెట్టడం వల్ల ఇది తేమను , బ్యాక్టీరియాను కొంతవరకు నియంత్రిస్తుంది. దీని వల్ల ఫ్రిజ్ లోపల గాలి శుభ్రంగా ఉండి, ఆహారం పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

2. క్లీనింగ్ టైం, శ్రమ ఆదా:

Advertisement

సాధారణంగా ఫ్రిజ్‌లోని ట్రేలను బయటకు తీసి, సోప్ పెట్టి కడిగి, మళ్లీ ఆరబెట్టడానికి కనీసం గంట లేదా రెండు గంటల సమయం పడుతుంది. కానీ.. ఈ అల్యూమినియం ఫాయిల్ ట్రిక్ వాడటం వల్ల మీరు డీప్ క్లీనింగ్ చేయాల్సిన అవసరమే ఉండదు. కేవలం మురికిగా మారిన ఫాయిల్ పేపర్‌ను మార్చేస్తే చాలు.. మీ ఫ్రిజ్ నిమిషాల్లో కొత్త దానిలా మెరిసి పోతుంది. దీని వల్ల పని భారం చాలా వరకు తగ్గుతుంది.

Also Read: ఫ్రిజ్ దగ్గర గ్యాస్ సిలిండర్ ఉందా? వెంటనే ఈ తప్పు సరిదిద్దుకోండి!

3. ఖర్చు తక్కువ- లాభాలు ఎక్కువ:

ఈ క్లీనియం హ్యాక్ కోసం ఎలాంటి ఖరీదైన.. కెమికల్ లిక్విడ్స్ లేదా క్లీనర్లు కొనాల్సిన అవసరం లేదు. మార్కెట్లో లభించే సాదాసీదా అల్యూమినియం ఫాయిల్ రోల్ ధర సుమారు రూ. 80 నుంచి రూ. 200 లోపే ఉంటుంది. ఒక చిన్న రోల్ ద్వారా నెలల తరబడి మీ ఫ్రిజ్ షెల్ఫ్‌లను కాపాడుకోవచ్చు.

ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ మన పనులను ఎంతో  ఈజీగా మారుస్తాయి. ఇప్పట్నుంచే  ఫ్రిజ్‌లో ఈ అల్యూమినియం ఫాయిల్ హ్యాక్‌ను ట్రై చేసి, మీ టైం కూడా ఆదా చేసుకోండి.

Related News

110 ఇంచుల భారీ స్క్రీన్.. 6,000 నిట్స్ బ్రైట్‌నెస్.. హువావే కొత్త టీవీలు వచ్చేశాయ్!

చలికాలంలో వేడి నీళ్ల కోసం ఏ గీజర్ కొనాలి? గ్యాస్ Vs ఎలక్ట్రిక్ పూర్తి గైడ్!

వైర్డ్ vs వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. ఈ రెండింటిలో ఏది ఎక్కువ కాలం మన్నుతుంది?

వన్‌ప్లస్ కొత్త ఇయర్ బడ్స్‌పై భారీ డిస్కౌంట్.. ఫీచర్లు తెలిస్తే కొనకుండా ఉండలేరు!

అబ్బా ఏం ఐడియా భయ్యా.. నెట్‌వర్క్ లేకపోయినా వాకీటాకీలా వాడుకునే వన్‌ప్లస్ సీక్రెట్ ఫీచర్!

వింటర్ వచ్చేసింది..గీజర్ సర్వీసింగ్ చేయించకుండా ఆన్ చేస్తే భారీ మూల్యం తప్పదు!

పాటలు వినొచ్చు, ఫోన్ కాల్స్ మాట్లాడొచ్చు.. హ్యాండ్స్‌ఫ్రీ ఎక్స్‌పీరియన్స్‌తో శాంసంగ్ ఏఐ గ్లాసెస్!

Big Stories

Advertisement
×