E-Paper
Advertisement

హీరో కాకపోతే నాని ఆ పని చేసేవాడా? చెప్తే లాజిక్ ఉండాలి బ్రో!

హీరో కాకపోతే నాని ఆ పని చేసేవాడా? చెప్తే లాజిక్ ఉండాలి బ్రో!
Advertisement

Actor Nani: నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఒకవైపు నెగిటివీటి వస్తున్నప్పటికీ మరోవైపు భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. ఈ సినిమా రెండు రోజులకే 114 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్లు చిత్ర నిర్మాతలు అధికారకంగా ఒక పోస్టర్ ద్వారా తెలియచేశారు. ఒకవైపు ఈ సినిమాకు నెగిటివిటీ స్ప్రెడ్ అవుతున్నప్పటికీ మరోవైపు కలెక్షన్ లో వర్షం కురుస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే నాని(Nani) సైతం ఈ సినిమా విడుదలైనప్పటికీ ప్రమోషన్లను తనదైన శైలిలోనే నిర్వహిస్తున్నారు.

బైక్ నడపడమే నాకు వచ్చిన స్కిల్..

ఈ నేపథ్యంలోనే నాని ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ర్యాపిడో డ్రైవర్ల(Rapido Drivers)తో సమావేశమయ్యారు అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన ” నాని ర్యాపిడో ఫ్యాన్స్ మీట్” (Nani Rapido Fans Meet)కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడారు. ఇకపోతే నాని ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తాను ఒకవేళ సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి హీరో కాకపోయి ఉంటే కచ్చితంగా తాను కూడా ర్యాపిడో డ్రైవర్ అయి ఉండే వాడినని తెలిపారు. నాకు వచ్చిన స్కిల్ ఏదైనా ఉంది అంటే అది బైక్ నడపడమేనని ఈయన తెలిపారు.

ర్యాపిడో డ్రైవర్ అయ్యేవాడిని..

Advertisement

ఒకవేళ హీరో కాకపోయి ఉంటే కచ్చితంగా నేను కూడా మీలాగే ర్యాపిడో డ్రైవర్ గా మారి మీలాగే ఈరోజు నేను కూడా ఏదో ఒక హీరో సినిమా వేడుకకు హాజరయ్యే వాడిని అంటూ నాని మాట్లాడారు దీంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా నాని చేసిన వ్యాఖ్యలపై నేటిజన్స్ స్పందిస్తూ ఏదైనా చెబితే లాజిక్ ఉండాలి నాని అన్న.. మీరు హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ర్యాపిడో ఎక్కడుంది బ్రో అంటూ నాని వ్యాఖ్యలపై విమర్శలు కురిపిస్తున్నారు. నాని ఇండస్ట్రీలోకి హీరో అవ్వాలని ఎంట్రీ ఇవ్వలేదనే సంగతి అందరికీ తెలిసిందే. ఈయన డైరెక్టర్ అవ్వాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రయాణం మొదలుపెట్టారు అయితే అనుకోకుండా అష్టా చమ్మ సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది.

కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న నాని సినిమా..

ఇలా ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ కావడంతో ఈయన తదుపరి వరుస సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం హీరోగాను అలాగే నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తాజాగా ర్యాపిడో డ్రైవర్ల సమావేశంలో భాగంగా తాను కూడా ర్యాపిడో డ్రైవర్ అవ్వాలనుకున్నానని చెప్పడంతో విమర్శలు వస్తున్నాయి. ఇక ది ప్యారడైజ్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా మొదటి రోజు 88 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో భారీ ఓపెనింగ్ రాబట్టింది. నాని కెరియర్ లోనే ఇది హైయెస్ట్ ఓపెనింగ్ అని చెప్పాలి. ఇక రెండు రోజులలో ఈ సినిమా 144 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు.

Advertisement

Also Read: బిగ్ బాస్ వల్ల ఒరిగిందేం లేదు…అమర్ దీప్ కామెంట్స్ వైరల్!

Related News

ది ప్యారడైజ్ ఫస్ట్ చాయిస్ కయాదు కాదా? ఆమె రిజెక్ట్ చేస్తేనే ఛాన్స్ వచ్చిందా?

పెళ్లి కావాలి, పిల్లలు వద్దు.. గర్భసంచి అవసరం లేదు: స్నిగ్ధ!

సుమలత వల్లే ఇన్ని సమస్యలు.. డాన్సర్స్ సమావేశంలో సీనియర్ మాస్టర్స్ ఫైర్!

మరో వివాదంలో ది ప్యారడైజ్..సమ్మక్క పాత్రను అవమానించారంటూ?

జూహీ చావ్లా ఆస్తులు డబుల్.. ఒక్క ఏడాదికి అన్ని కోట్లా..?

ఈ సంక్రాంతి మనదే.. కాకా పై చిరు అప్డేట్!

నాని పై ఇండస్ట్రీలో కుట్ర జరుగుతుందా? సక్సెస్ ను జీర్ణించుకోలేకపోతున్నారా?

Big Stories

Advertisement
×