Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ మళ్లీ రాజకీయంగా పుంజుకోవాలని భావిస్తున్నారా? కూన రవి-సౌమ్య ఎపిసోడ్‌లోకి దువ్వాడ ఎందుకొచ్చినట్టు? ఎమ్మెల్యేకు మద్దతుగా నిలవడం వెనుక కారణమేంటి? ఈ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలచుకుని టీడీపీ విభజించే ప్లాన్ చేస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
దువ్వాడ శ్రీనివాస్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆయన-అచ్చెన్నాయుడితో విభేదాల గురించి అందరికీ తెల్సిందే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అచ్చెన్నపై తీవ్ర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత జగన్.. దువ్వాడను పిలిచి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం జరిగిపోయింది.
అప్పటి నుంచి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో సెంట్రాఫ్ ఎట్రాక్షన్‌గా మారారు. దువ్వాడ వ్యవహారశైలిపై మండిపడిన వైసీపీ ఆయన్ని దూరంగా పెట్టింది కూడా. అది వేరే విషయం. ఇక అసలు విషయానికి వద్దాం. ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్-ప్రిన్సిపల్ సౌమ్య వ్యవహారం టీవీ డిబేట్లలో పెద్ద చర్చకు దారి తీసింది.
సౌమ్య చేసిన ఆరోపణలపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు సదరు ఎమ్మెల్యే. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చాలంటూ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు రంగంలోకి దిగారు. కూన-సౌమ్య ఎపిసోడ్‌లోకి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చారు.
ALSO READ: పోలీసుల అదుపులో శ్రీకాంత్ ప్రియురాలు అరుణ, ఉలిక్కిపడిన అధికారులు, నేతలు
దీని వెనుక మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నారంటూ బుధవారం మధ్యాహ్నం మీడియా ముందుకొచ్చి విమర్శలు గుప్పించారు. కావాలనే సౌమ్య బదిలీ అంశాన్ని రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. కూన రవికుమార్ మంత్రి రేసులో ఉండడంతో అచ్చెన్నాయుడు ఈ కుట్ర చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. కూన రవి హింసించినట్లు ఆధారాలు ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు దువ్వాడ.
తాను తటస్థుడ్ని అంటూనే టీడీపీ, అచ్చెన్నాయుడి ఫ్యామిలీని టార్గెట్ చేశారాయన. టెక్కలి నియోజకవర్గంలో అదే జరుగుతుందని ప్రస్తావించే ప్రయత్నం చేశారు. మంత్రి అచ్చెన్నాయడు పేషీలో అధికారి రాజమోహన్‌ని ఒత్తిడి చేస్తున్నారని, ఆయన ఎండీకి లేఖ రాసిన విషయాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలో కులాల కుంపటిని రగిల్చే ప్రయత్నం చేశారు దువ్వాడ.
దువ్వాడ వ్యవహారశైలిపై మంత్రి అచ్చెన్నాయుడు నోరు విప్పుతారా? ఆరోపణలపై సమాధానాలు ఏం చెబుతామని సైలెంట్‌గా ఉంటారా? ఇవే ప్రశ్నలు ఆ జిల్లా నేతలను వెంటాడుతున్నాయి. ఓ వైపు ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు మద్దతుగా నిలుస్తూ.. ఇంకోవైపు మంత్రి అచ్చెన్నను టార్గెట్ చేశారు దువ్వాడ శ్రీనివాస్.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హాట్ కామెంట్స్
సౌమ్య బదిలీ అంశాన్ని కావాలనే రాద్ధాంతం చేస్తున్నారన్న దువ్వాడ
కూన రవి మంత్రి రేసులో ఉండడంతో అచ్చెన్నాయుడు ఈ కుట్ర చేస్తున్నారని ఆరోపణలు
కూన రవి హింసించినట్లు ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించిన దువ్వాడ https://t.co/0pDeXoD2ry pic.twitter.com/85pWOfwNhv
— BIG TV Breaking News (@bigtvtelugu) August 20, 2025