E-Paper
Advertisement

ఏసీబీ దూకుడు.. భీంరెడ్డి బినామీ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు

ఏసీబీ దూకుడు.. భీంరెడ్డి బినామీ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు
Advertisement

Bheem Reddy: స్వేచ్ఛ బ్యూరో: అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్ల ఆస్తులు కూడబెట్టి అడ్డంగా దొరికిపోయిన డీఎస్పీ భీంరెడ్డి బినామీల ఇళ్లపై గురువారం ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. తనిఖీల్లో వందల కోట్ల విలువ చేసే ఆస్తుల డాక్యుమెంట్లతోపాటు కట్టలు కట్టలుగా కరెన్సీ నోట్లు దొరికాయి. డీజీపీ కార్యాలయం స్టేషనరీ వింగ్​ లో డీఎస్పీగా పని చేసిన భీంరెడ్డి ఇంటిపై జూలై 2న ఏసీబీ అధికారులు దాడి చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో వేర్వేరు బృందాలుగా విడిపోయి హైదరాబాద్, జహీరాబాద్​, రంగారెడ్డి, శంషాబాద్, గచ్చిబౌలి, వికారాబాద్​ సహా 16ప్రాంతాల్లో భీంరెడ్డి బంధుమిత్రుల ఇళ్లపై కూడా దాడులు చేశారు. తనిఖీల్లో ప్రైవేట్​ మార్కెట్​ రేటు ప్రకారం 200 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తుల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనిని లెక్కించటానికే రెండు రోజుల సమయం పట్టిందంటే ఏ స్థాయిలో నగదు దొరికిందో అర్థం చేసుకోవచ్చు.

కీలకంగా మారిన డైరీ.. సెల్​ ఫోన్​..

Advertisement

ఇక, ఏసీబీ అధికారులు జరిపిన తనిఖీల్లో దొరికిన ఓ డైరీ భీంరెడ్డి బినామీల గుట్టును రట్టు చేసింది. దాంతోపాటు ఆయన భార్య నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్​ ఫోన్​ లో కూడా కీలక ఆధారాలు దొరికాయి. కుటుంబ సభ్యుల్లో ఎవరెవరికి ఏయే ఆస్తులు కేటాయించాలి? ఏ బినామీ పేర ఎంతెంత ఆస్తులున్నాయి? ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి? అన్న సమాచారం ఏసీబీ చేతికి చిక్కింది.

ఈ ఆధారాలతోనే..

Advertisement

ఈ ఆధారాలతోనే ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు అనుమతితో గురువారం తెల్లవారుఝాము నుంచే వేర్వేరు బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు భీంరెడ్డికి బినామీలుగా ఉన్నవారి ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు. హైదరాబాద్​, జహీరాబాద్ లో కలిపి మొత్తం పదిమంది ఇళ్లల్లో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో భారీగా ఆస్తుల డాక్యుమెంట్లు దొరికాయి. బొమ్మ వెంకటేశ్​ అనే వ్యక్తి ఇంట్లో ఏకంగా కోటీ 35లక్షల రూపాయల నగదు లభ్యమైంది. దాంతోపాటు 14లీటర్ల విదేశీ మద్యం సీసాలు దొరికాయి. బినామీల ఇళ్లల్లో దొరికిన డాక్యుమెంట్ల ఆధారంగా ఆయా ఆస్తులు ఎలా కొనుగోలు చేశారు? డబ్బు ఎవరు పెట్టారు? అన్న సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇక, దొరికిన విదేశీ మద్యం గురించి ఎక్సయిజ్​ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం ఇవ్వండి..

అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు కూడబెట్టుకున్న వారితోపాటు పని చేసి పెట్టటానికి లంచాలు డిమాండ్ చేసే ప్రభుత్వ ఉద్యోగుల గురించి సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరారు. టోల్​ ఫ్రీ నెంబర్​ 1064కు ఫోన్​ చేయటంతోపాటు 9440446106 నెంబర్​ కు వాట్సాప్​ ద్వారా సమాచారం అందించ వచ్చన్నారు. ఏసీబీకి చెందిన సోషల్ మీడియా ప్లాట్​ ఫాంల ద్వారా కూడా వివరాలు అందించవచ్చని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా పెడతామన్నారు.

Also Read: సిరిసిల్లలో 8 వేల ఎకరాల భూవివాదం.. అసలు లెక్క తేలేదెప్పుడు?

Tags

Related News

సిరిసిల్లలో 8 వేల ఎకరాల భూవివాదం.. అసలు లెక్క తేలేదెప్పుడు?

నిమజ్జనాల్లో అమ్మాయిలను వేధిస్తే ఇదే గతి.. 1,530 మందిపై కేసులు నమోదు

తప్పుడు ప్రచారాలు చేస్తే ఎవరినీ వదలం.. కోర్టులో హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!

దమ్ముంటే రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లు.. సీఎం రేవంత్‌కు రాంచందర్ రావు సవాల్!

కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలారా.. సిగ్గుతో తలదించుకోండి: బండి సంజయ్

సుప్రీంలో చుక్కెదురు.. దానం నాగేందర్ ఆసక్తికర రియాక్షన్.. ‘ఇది ముందే తెలుసంటూ..!’

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

Big Stories

Advertisement
×