Shoaib Akhtar On IND VS PAK: ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో టీమిండియా విజయం సాధించి గోల్డ్ మెడల్ దక్కించుకోగా….. ఓడిపోయిన పాకిస్తాన్ కు సిల్వర్ మెడల్స్ దక్కాయి. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar ) సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ లో తినడానికి తిండే లేదు… వేసుకోవడానికి గుడ్డ లేదు.. ఇలాంటి నేపథ్యంలో సిల్వర్ మెడల్ దక్కించుకోవడం చాలా గొప్ప విషయం అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోల్డ్ మెడల్ రాకున్నా పర్వాలేదు… సిల్వర్ తో సంతృప్తి పడాలని వెల్లడించారు. అత్యాశకు వెళ్లి బొక్క బోర్లా పడకూడదని హితువు పలికారు. దీంతో షోయబ్ అక్తర్ (Shoaib Akhtar ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో ఓడిపోయి సిల్వర్ మెడల్ అందుకున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు పై కీలక వ్యాఖ్యలు చేశారు షోయబ్ అక్తర్ (Shoaib Akhtar ). టీమిండియా కు గోల్డ్ మెడల్ వచ్చిందని పాకిస్తాన్ అభిమానులు ఎవరు టెన్షన్ పడొద్దు అని కోరారు. సిల్వర్ మెడల్ దక్కిన పాకిస్తాన్ కు కూడా కొన్ని ప్రయోజనాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఈ మెడల్ తో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే ఛాన్సులు ఉన్నాయని అంచనా వేశారు. ప్రస్తుత పరిస్థితులలో పాకిస్తాన్ లో తినడానికి తిండి లేదని వెల్లడించారు.
పెట్రోల్, బియ్యం, ఇతర ఆహార పదార్థాలు ఏమీ లేవని… ఇలాంటి గడ్డు పరిస్థితిలలో సిల్వర్ మెడల్ దక్కించుకోవడం ప్రశంసనీయమని కొనియాడారు. ఈ మూమెంట్ ను ఆనందించాలని కోరారు. దీంతో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే అతని వ్యాఖ్యలపై కొంత మంది మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు నీకు తలలో మెదడు ఉందా? అంటూ ఫైర్ అవుతున్నారు. దిక్కుమాలిన లెక్కలు చెప్పి పాకిస్తాన్ క్రికెట్ జట్టును కాపాడుతున్నావా? అంటూ ఆగ్రహిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇచ్చిన బంపర్ ఆఫర్ ను షోయబ్ అక్తర్ వదిలేసుకున్నాడు.