Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతిరోజు ఒక విభిన్నమైన అంశంతో ఆడియన్స్ లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. సడన్గా స్నేహితులుగా ఉన్న వారి మధ్య శత్రుత్వం రాజుకోవడం, శత్రుత్వం ఉన్న వారి మధ్య ప్రేమ పుట్టుకు రావడం.. ఇలా రోజుకో ట్విస్ట్ తో ప్రస్తుత ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. అంతేకాదు ట్రయాంగిల్ లవ్ స్టోరీలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇదంతా పక్కన పెడితే.. ఎప్పటిలాగే ఈ వారం కూడా బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ చాలా గట్టిగా సాగింది.
ముఖ్యంగా గత రెండు వారాలలో సెలబ్రిటీలు ఎలిమినేట్ అవ్వడం.. మూడవ వారం కూడా సెలబ్రిటీలే ఎలిమినేట్ అవ్వాల్సి రాగా.. ముఖేష్ తన కెప్టెన్సీ పవర్ ను ఉపయోగించి సేవ్ చేయడం అన్నీ జరిగిపోయాయి. కానీ మూడవ వారం మిథిలేష్ రెడ్డి తన స్ట్రాటజీతో 48 గంటల్లోనే బిగ్ బాస్ ఇచ్చిన సూట్ కేస్ ఆఫర్ ను తీసుకొని బయటకు వెళ్లిపోయారు. ముఖ్యంగా 15 లక్షలు ఆయన తీసుకెళ్లిపోవడం సంచలనంగా మారింది. ఈ పాయింట్ ను తీసుకొని చాలామంది నామినేట్ చేశారు. అలా మొత్తం తొమ్మిది మంది నామినేషన్స్ లోకి వచ్చారు. ఇకపోతే నామినేషన్స్ లోకి వచ్చిన వారిని బట్టి చూస్తే ఈ వారం సెలబ్రిటీలు చాలా తెలివిగా కామనర్స్ అందరినీ నామినేషన్ లోకి తీసుకురావడం గమనార్హం.
ఇకపోతే ఈవారం కామనర్స్ హౌస్ నుండి వెళ్లబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంటే.. మరొకవైపు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఓటింగ్ పోల్ కూడా స్టార్ట్ అయింది. చివరి మూడు స్థానాలలో నరేష్ , చరణ్, సృష్టి ఉన్నారు. సింగిల్ ఎలిమినేషన్ అయితే వీరిలో సృష్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ పెడితే సృష్టి తో పాటు చరణ్ కూడా డేంజర్ జోన్లో పడ్డట్టే.. ఇకపోతే కామనర్స్ టార్గెట్ గా సెలబ్రిటీలందరూ కామనర్స్ ని నామినేషన్స్ లోకి పడేశారు.
నిజానికి రెండవ వారమే కృష్ణుడు స్థానంలో సృష్టి ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. కృష్ణుడిని ఆడియన్స్ మొదట ఎలిమినేట్ చేశారు. కనీసం ఇప్పటికైనా ఆమె మేల్కొని తన ఆటలో సత్తా చాటుతుందని అందరూ అనుకున్నారు. కానీ నాగార్జున ఈమె ఆడడం లేదని, హోస్ట్ నాగార్జున తిడితే దానిని చురుకుగా చూపించాల్సింది పోయి.. సుధీర్ పట్ల వ్యవహరించిన తీరు కారణంగా సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీని ఆమె కొని తెచ్చుకుంది. అయితే అనేకసార్లు ఆమె సుధీర్ కి క్షమాపణలు చెప్పింది కానీ ఆమె చుట్టూ గేమ్ ని తిప్పుకునే లాగా ఆడక పోవడంతో ఆమెపై నెగెటివిటీ పెరిగిపోయింది. దీంతో ఈ వారం కచ్చితంగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు సమాచారం.
ALSO READ: ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?
ఇక చరణ్ కి కూడా మొదటి వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ఎలిమినేట్ అయినా.. మళ్ళీ వారం ఆయనకు రెండవ అవకాశం కల్పించారు. అయితే ఈ అవకాశాన్ని కూడా చరణ్ సరిగా ఉపయోగించుకోకపోవడం గమనార్హం. పైగా ఝాన్సీని రెండవ వారం రైతుబిడ్డ ట్యాగ్ వాడుతోందని, కండువా వేసుకుంటుందని, షర్టు ధరిస్తోంది అంటూ కారణాలు చెప్పి నామినేట్ చేసి, ఆడియన్స్ లో నెగెటివిటీ కొని తెచ్చుకున్నారు. అలా ఒకవేళ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఈ ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఎవరు ఎలిమెంట్ కాబోతున్నారో తెలియాలి అంటే వీకెండ్స్ వరకు ఎదురు చూడాల్సిందే.