UP Crime News: ఉత్తరప్రదేశ్‌లో ఈ మధ్యకాలం రకరకాల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అందులో వివాహేతర సంబంధాలు ఎక్కువగా ఉంటున్నాయి. పెళ్లికి ముందు కొన్ని, పెళ్లయిన తర్వాత మరికొన్ని ఉన్నాయి. ఈ క్రమంలో భర్తలు, భార్యలు హత్య చేసిన ఘటనలు కోకొల్లలు. తాజాగా వివాహం జరిగిన రెండు వారాలకే మరో పెళ్లి చేసుకున్నాడు ఓ వ్యక్తి. అసలు ట్విస్ట్ ఏంటంటే, రెండో పెళ్లి చేసుకున్న ఆమెకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అసలు స్టోరీలోకి వెళ్లొద్దాం.
అసలేం జరిగింది?
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లా బాబుగఢ్ ప్రాంతంలో వెలుగులోకి ఈ కేసు వెలుగులోకి వచ్చింది. రసూల్‌పూర్ గ్రామానికి చెందిన నేహా యువతి, ఫిబ్రవరి 16న గజల్‌పూర్ గ్రామానికి చెందిన నవీన్‌ను హిందూ సంప్రదాయల ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. వివాహమైన మూడు రోజులకు భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు భార్య తెలిసింది. పెళ్లయిన మూడు రోజులకు భర్త గురించి తెలిసి అల్లాడిపోయింది.
వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ ఎప్పటి నుంచి ఉందో తెలీదు. అప్పటి నుంచి ఇరువురు ఎడముఖం పెడముఖంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో భార్యని కన్వీన్స్ చేసే ప్రయత్నం చేశాడు నవీన్. అందుకు ఆమె ససేమిరా అంది. ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని తెగేసి చెప్పింది. అప్పటి నుంచి భార్యభర్తల మధ్య తరచు గొడవలు జరిగేవి. చివరకు భార్యకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు.
రెండో భార్యకు ముగ్గురు పిల్లలు
చివరకు మార్చి ఒకటి రెండు పెళ్లి చేసుకున్నాడు నవీన్. అప్పటికే ఆమెకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరి ఎప్పటి నుంచి ఆ రిలేషన్ నవీన్ కొనసాగిస్తున్నాడో తెలీదు. విచిత్రం ఏంటంటే ఆమె మహిళా కానిస్టేబుల్ నిర్మల కూడా. భర్త రెండో వివాహం విషయం తెలిసి షాకైంది మొదటి భార్య. పట్టరాని కోపంతో నేరుతో పోలీసుస్టేషన్ కు వెళ్లి భర్తపై కేసు పెట్టింది. దీంతో ఫ్యామిలీ మేటర్ వ్యవహారం బయటకు వచ్చింది.
ALSO READ: కూకట్‌పల్లిలో దారుణం, భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి, ఆపై పూడ్చిపెట్టిన భార్య
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మరోవైపు మొదటి భార్యను హాపూర్‌లోని నిర్మల ఇంటికి తీసుకొచ్చాడు నవీన్. నిర్మలతో కలిసి ఉండాలని మొదటి భార్యపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అందుకు మొదటి భార్య నేహా అందుకు ఒప్పుకోలేదు. ఇద్దర్నీ వేర్వేరు ప్రాంతంలో ఉంచుతానని చెప్పారు అందుకు ఏ మాత్రం అంగీకరించలేదు. నిర్మలను భార్యగా అంగీకరించాలంటూ బెదిరించడం మొదలుపెట్టాడు.
పరారీలో నవీన్, రెండో భార్య
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 16న రాత్రి తొమ్మిది గంటలకు మొహల్లా సాకేత్ కాలనీలోని నవీన్-నిర్మల ఏకాంతంగా ఉన్న సమయంలో వీరిద్దరినీ పట్టుకుంది భార్య నేహా. ప్రస్తుతం వీరిద్దరు పరారీలో ఉన్నారు. నిర్మలను కానిస్టేబుల్ కావడంతో హఫీజ్‌పుర్ పోలీస్ స్టేషన్‌కు అటాచ్ చేస్తున్నట్లు వెల్లడించారు పోలీసులు. నవీన్-నిర్మలకు చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుకున్నాయి. ఫ్యామిలీ మేటర్‌ని పోలీసులు ఏ విధంగా సెటిల్ చేస్తారో చూడాలి.